ఖమ్మం: నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు 133వ కిలో మీటరు వద్ద గండిపడింది. దీంతో ఖమ్మం జిల్లాలతోపాటు, ఆంధ్రప్రదేశ్‌లో అనేక ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. సుమారు 4 నుంచి 10 మీటర్ల వెడల్పుతో గండి పడినట్లు తెలిసింది. దీంతో పాలేరు దిగువకు నీటి సరఫరాను నిలిపివేశారు.. దీంతో రెండున్నర లక్షల ఏకరాల ఆయకట్టుకు నీటి సరఫరా నిలిచిపోయంది. ఈ విషయమై సమాచారమందుకున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, తన్నీరు హరీశ్రావులు అధికారులను అప్రమత్తం చేశారు. కాల్వకు వెంటనే మరమతులు చేపట్టి నీటిని విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. గండిపడిన ప్రాంతంలో శుక్రవారం పొక్లెయిన్‌తో తవ్వకాలు చేసి సాధ్యమైనంత మేరకు గండిని బంక మట్టిని నింపి అవసరమైతే కాంక్రీటు చేసి ఈనెల రోజులు తాత్కాలికంగా రైతులకు నీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు సంబధిత అధికారులు తెలిపారు. గండి పూడ్చే పనులు కనీసం నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉందని తెలుస్తుంది.