Left Canal
-
టన్నెల్ లోనే చిక్కుకుపోయిన మరో 8 మంది
-
శ్రీశైలం లెఫ్ట్ కెనాల్ టన్నెల్ లో ప్రమాదం
-
ఐదేళ్లలో 35 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి పనిచేస్తుంది. ఏటా 6.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సృష్టించబోతున్నాం. ఈ ఐదేళ్లలో 35 లక్షల ఎకరాల్లో ఆయకట్టును సృష్టించి సాగునీరు అందించబోతున్నాం’అని మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువకు, వరద కాలువకు శుక్రవారం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నీటిని విడుదల చేశారు. అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది సాగునీటికి బడ్జెట్ రూ.22500 కోట్లు పెట్టామని, దాంట్లో రూ.10,828 కోట్లు ఆన్ గోయింగ్ వర్క్స్ కింద, కొత్త ప్రాజెక్టులకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద కేటాయించామన్నారు.మిగతా రూ.11వేల కోట్లు ఎస్టాబ్లి‹Ùమెంట్, అప్పుల కోసమని చెప్పారు. తెలంగాణ చరిత్రలో ఏ ఒక్క ఆరŠిథ్ధక సంవత్సరంలో కూడా ఈ స్థాయిలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద కేటాయించలేదని, ఇప్పుడు కేటాయించిన డబ్బంతా ఈ ఏడాది ప్రాజెక్టులపైనే ఖర్చు పెట్టబోతున్నామని ఉత్తమ్ స్పష్టం చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. గత పదేళ్లలో ఎప్పుడూ ఇవ్వనివిధంగా సాగర్ ఎడమ కాలువకు తాము ఈసారి ముందుగా నీళ్లు ఇచ్చామని చెప్పారు.గత ఏడాది నీళ్లు లేక రైతులు ఇబ్బంది పడ్డారని, సాగర్‌తోపాటు ఏఎంఆర్పీ పరిధిలోనూ పంటలు వేసుకోలేకపోయామన్నారు. నల్లగొండ జిల్లాకు ఎంతో కీలకమైన ఎస్ఎల్బీసీ టన్నెల్‌పై 1981లో అంజయ్య సీఎంగా ఉన్నప్పుడే గ్రావిటీ ద్వారా నీటిని తీసుకొచ్చేలా ఆలోచించారని, అయినా అప్పుడు కాలేదన్నారు.వైఎస్.రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక, ఆయన్ను ఒప్పించి ప్రాజెక్టు తీసుకొచ్చామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్నా పూర్తి చేయలేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేట్ల ప్రకారం టన్నెల్ పనులను పూర్తి చేయడానికి నిధులు విడుదల చేసిందని చెప్పారు. వచ్చే రెండు మూడేళ్లలో సొరంగం పూర్తి చేస్తామని, దీంతో దాదాపు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.సాగర్ ఎడమకాల్వకు నీటి విడుదల నాగార్జునసాగర్: సాగర్ ఎడమకాల్వకు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి చేతులమీదుగా శుక్రవారం సాయంత్రం నీటిని విడుదల చేశారు. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు బాలునాయక్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో నాగార్జునసాగర్‌కు వచ్చారు. ఎర్త్ డ్యాం అంతర్భాగంలో గల హెడ్‌రెగ్యులేటర్ ప్యానల్‌బోర్డు వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం స్విచ్ ఆన్‌చేసి ఎడమ కాల్వకు వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. గంటగంటకు నీటిని పెంచుతూ 11వేల క్యూసెక్కులు విడుదల చేయనున్నట్టు తెలిపారు.అనంతరం మంత్రులు వరదకాల్వ వద్దకు వెళ్లి అక్కడ నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా, నల్లగొండ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.రేపో మాపో సాగర్ గేట్లు ఎత్తివేతసాక్షి, హైదరాబాద్/దోమలపెంట: నాగార్జునసాగర్‌లోకి కృష్ణా వరద ఉధృతి మరింత పెరిగింది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు సాగర్‌లోకి 3,99,159 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో నీటినిల్వ 550.6 అడుగుల వద్ద 211.1 టీఎంసీలకు చేరుకుంది. రోజుకు సగటున 30 టీఎంసీల రాకతో మరో రెండు రోజుల్లో సాగర్ ప్రాజెక్టు నిండుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. శనివారం నుంచి రోజుకు ఇన్‌ఫ్లో 40 టీఎంసీలకు పెరుగుతుందని..దీంతో రేపోమాపో గేట్లు ఎత్తివేసే వరదను కిందకు విడుదల చేసే అవకాశముందని అధికారవర్గాలు పేర్కొంటున్నారు.ఇటు సుంకేశుల నుంచి తుంగభద్ర, అటు జూరాల నుంచి కృష్ణా వరద ఉధృతి శ్రీశైలంలోకి మరింత పెరిగింది. ప్రాజెక్టులోకి 4,89,361 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. స్పిల్‌వే పది గేట్లు 20 అడుగు మేర ఎత్తి 4,66,650 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. విద్యుదుత్పత్తి చేస్తూ కుడి కేంద్రం నుంచి 23,904, ఎడమ కేంద్రం నుంచి 37,857 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. వెరసి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 5,28,411 క్యూసెక్కులు సాగర్ వైపు దూసుకెళ్తున్నాయి.మహారాష్ట్ర, కర్ణాటకలో పశి్చమ కనుమల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణా ప్రధాన పాయ, తుంగభద్ర నదుల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. తుంగభద్ర డ్యామ్‌లోకి 1.90 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 1.82 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి వరద ప్రవాహం స్థిరంగా వస్తున్న నేపథ్యంలో శ్రీశైలంలోకి వరద ఉధృతి శనివారం కూడా ఇదే రీతిలో కొనసాగుతుందని అధికారులు చెప్పారు. -
డెడ్ స్టోరేజీకి ‘నాగార్జున సాగర్’!.. ఆందోళనలో ఆయకట్టు రైతులు
సాక్షిప్రతినిధి, నల్లగొండ: నాగార్జునసాగర్ ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది. బోరుబావుల వసతి ఉన్నవారు నార్లు పోసి నీటివిడుదల కోసం ఎదురుచూస్తుండగా, మిగతావారు ఎగువ కృష్ణానది నుంచి వరద వస్తుందా? లేదా? అన్న ఆందోళనలో ఉన్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని ఎడమకాల్వ ద్వారా ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో స్థిరీకరించిన ఆయకట్టు 6.57 లక్షల ఎకరాలు. గతేడాది జూలై 28వ తేదీన ఎడమ కాల్వ ద్వారా వ్యవసాయ అవసరాలకు సాగునీటిని విడుదల చేశారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. శ్రీశైలం ప్రాజెక్టు వరకే... గత నెల చివరలో కురిసిన వర్షాలతో కృష్ణానదికి ఎగువ నుంచి వరద రాక మొదలైంది. అది కూడా శ్రీశైలం ప్రాజెక్టు వరకే వస్తోంది. దిగువకు అంటే నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి నీరు రాలేదు. ఈ ఆగస్టులోనూ ఇంతవరకు వర్షాలు పడలేదు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు (215.81 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 864.57 అడుగుల (120.92 టీఎంసీలు) మేర మాత్రమే నీటినిల్వ ఉంది. ప్రస్తుతం ఎగువ నుంచి 65 వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తోంది. కృష్ణానదికి ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద వస్తే మరో వారంలో ఈ ప్రాజెక్టు నుంచి నీటి విడుదలకు అవకాశం ఉంటుంది. లేదంటే 15 రోజులకుపైగా సమయం పట్టవచ్చని, ఆ ప్రభావం నాగార్జునసాగర్ ఆయకట్టుపైనా తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు. వ్యవసాయశాఖ కూడా అప్పుడే ముమ్మరంగా వరినాట్లు వద్దని, పంటలు ఎండిపోయే పరిస్థితి రావొచ్చని పేర్కొంటోంది. చదవండి: అంకాపూర్ @మక్కవడలు.. చికెన్‌తో నంజుకుని తింటే.. ఆ టేస్టే వేరు! సాగర్ 570 అడుగులకు చేరితేనే.... నాగార్జునసాగర్ ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 590 అడుగులు. కుడి, ఎడమ కాల్వలకు నీరు విడుదల చేయాలంటే సాగర్ జలాశయంలో కనీసం 570 అడుగుల మేర నీటినిల్వ ఉండాలి. అయితే ప్రస్తుతం నాగార్జునసాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి దగ్గరలో ఉంది. డెడ్ స్టోరేజీ 510 అడుగులు కాగా, ప్రస్తుతం 515.4 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. నల్లగొండ, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు మాత్రమే ఈ నీటిని వినియోగించుకునే పరిస్థితి నెలకొంది. వ్యవసాయానికి ఇచ్చే పరిస్థితి లేదు. సాగర్ రిజర్వాయర్‌లోని బ్యాక్‌వాటర్ నుంచే నల్లగొండ జిల్లాలో మిషన్ భగీరథ కింద 597 గ్రామాలకు రోజుకు 25 క్యూసెక్కుల తాగునీటిని సరఫరా చేయాల్సి వస్తోంది. హైదరాబాద్ జంట నగరాలకు తాగునీటి అవసరాల కోసం రోజుకు 595 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. నారు ఎండిపోతోంది పదిహేను రోజుల క్రితం వరినారు పోశాను. ఎడమకాల్వ నీటికోసం ఎదురుచూస్తున్నా. బోరుబావుల కింద ఐదు ఎకరాలు నాట్లు వేశా. ఎడమకాల్వ నుంచి నీరు విడుదల కాకపోవడంతో బోర్లలో కూడా నీరు తగ్గిపోయింది. నారుమడి, నాట్లు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. సకాలంలో సాగునీరు అందించకుంటే నష్టపోయే ప్రమాదం ఉంది. – పసునూరి హనుమంతరెడ్డి, రైతు,యాద్గార్పల్లి, మిర్యాలగూడ సాగర్ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదల ఇలా... ►2019- ఆగస్టు 12 ►2020- ఆగస్టు 8 ►2021- ఆగస్టు 2 ►2022 - జూలై 28 ప్రాజెక్టుల నీటిమట్టం ఇలా... (అడుగుల్లో) గరిష్టం ప్రస్తుతం శ్రీశైలం 885 864.57 నాగార్జున సాగర్ 590 515.4 -
మధ్యతరహా ప్రాజెక్టుకు.. మరమ్మతులు ఎప్పుడో?
మంగపేట: మండల పరిధిలోని నర్సింహాసాగర్ వద్ద మల్లూరువాగుపై నిర్మించిన మల్లూరు మధ్యతరహా ప్రాజెక్టు మరమ్మతు పనులు ఇంకెప్పుడు చేస్తారని ప్రాజెక్టు ఆయకట్టు రైతులు అధికారులను, పాలకులను ప్రశ్నిస్తున్నారు. ప్రాజెక్టు బాగోగులు చూడాల్సిన అధికారులు చుట్టపు చూపులా వచ్చి వెళ్తున్నారే తప్పా శ్రద్ధ చూపడం లేదని మండిపడుతున్నారు. 26 అడుగుల నీటిమట్టం సామర్థ్యంతో 1976లో అప్పటి సీఎం జలగం వెంగళరావు ప్రాజెక్టును ప్రారంభించారు. 1980లో ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాగా ఆయకట్టు భూములకు సాగునీటిని వదిలారు. నర్సింహాసాగర్, పూరేడుపల్లి, శనిగకుంట, మల్లూరు, వాగొడ్డుగూడెం, రమణక్కపేట, చుంచుపల్లి వరకు 17 కిలోమీటర్ల కుడి కాల్వ ద్వారా సుమారు 4,300 ఎకరాలు, బాలన్నగూడెం, తిమ్మంపేట, మంగపేట, చెరుపల్లి తదితర గ్రామాల వరకు 8 కిలోమీటర్ల ఎడమ కాల్వ ద్వారా 3,500 ఎకరాల ఆయకట్టు భూములకు రెండు పంటలకు సాగునీరు అందాల్సి ఉంది. 27 ఏళ్ల నుంచి ప్రాజెక్టు నిర్వహణపై సంబంధిత ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణ క్షేత్రస్థాయిలో లేకపోవడం ప్రాజెక్టు అభివృద్ధిపై పాలకులు అంతగా శ్రద్ధ చూపకపోవడంతో నిరాదరణకు గురైంది. 2007లో అప్పటి సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి పుణ్యమా అంటూ ప్రాజెక్టు ఆధునికీకరణకు రూ.16 కోట్ల జపాన్(జైకా) నిధులు మంజూరు అయ్యాయి. పనులపై పర్యవేక్షణ లేకపోవడంతో అసంపూర్తిగా చేసి కోట్ల రూపాయల నిధులను కాంట్రాక్టర్లు, అధికారులు కాజేశారు. ఆనాటి నుంచి ఇప్పటి వరకు కుడి ఎడమ కాల్వల తూములకు ఏర్పడిన లీకేజీలకు మరమ్మతుల పేరుతో నాయకులు, అధికారులు కుమ్మకై ్క లక్షల రూపాయలు కాజేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అభివృద్ధిని మరిచి సంబురాలు తెలంగాణ స్వరాష్ట్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా అధికారులు, పాలకులు ప్రాజెక్టు అభివృద్ధిని మరిచి సంబురాలు నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని రైతులు వాపోతున్నారు. 2015లో అప్పటి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, మంత్రి చందూలాల్ ప్రాజెక్టును సందర్శించారు. వెంటనే ప్రాజెక్టు అభివృద్ధికి, కుడి, ఎడమ కాల్వలు, తూముల నిర్మాణం ఆధునికీకరణ పనులు చేపట్టేందుకు ఎస్టిమేట్ నివేదిక తయారు చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. హామీ ఇచ్చి ఎనిమిదేళ్లు గడిచినా అతీగత లేదు. ఇప్పుడేమో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా చెరువుల పండుగలో భాగంగా ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టని ప్రాజెక్టులో నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని రైతులు వాపోతున్నారు. అధికారుల తీరు రైతులకు శాపం ప్రాజెక్టుపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, ప్రభుత్వం పట్టిచుకోక పోవడం తమకు శాపంగా మారిందని రైతులు ఆరోపిస్తున్నారు. తూముల లీకేజీల పనులు వేసవి కాలంలో చేపట్టాల్సి ఉండగా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వర్షాకాలంలో ప్రాజెక్టులోకి నీరు చేరిన తరువాత కొందరు స్థానికులతో సంబంధిత అధికారులు కుమ్మక్కై నాసిరకంగా మరమ్మతులు చేపట్టడంతో యథావిథిగా లీకేజీలు ఏర్పడి నీరు వృథాగా పోతుందని రైతులు వాపోతున్నారు. కాల్వల్లో షిల్టు పేరుకుపోయి సాగునీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం చెరువు కట్టపై చెట్లను తొలిగించక పోవడంతో కట్టపై నుంచి నడిచి వెళ్లే వీలులేకుండా మారింది. చెరువు మత్తడి వద్ద గైడ్ వాల్స్ కోతకు గురై ధ్వంసమయ్యాయి. అపరాన్ రాళ్లు తేలి కనిపిస్తున్నాయి. ఈ ఏడాది మత్తడి నుంచి వరద నీరు భారీ స్థాయిలో ప్రవహిస్తే మత్తడికే ప్రమాదం పొంచి ఉందని రైతులు వాపోతున్నారు. -
గండి వల్లే ప్రమాదాన్ని గుర్తించలేదు.. మంత్రి జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట: కాలువలో నీరు నిండుగా ఉండటంతో పాటు.. నీటి మధ్యలో గండి పడటం వల్లే సాగర్ ఎడమ కాలువ ప్రమాదాన్ని వెంటనే గుర్తించలేకపోయామని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం సూర్యాపేటలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాలువ కట్ట పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, ఐదారు రోజుల్లో తిరిగి ఎడమ కాల్వలో నీటిని పునరుద్ధరిస్తామని చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లో చేరిన నీటిని కూడా యుద్ధ ప్రాతిపదికన బయటకు పంపగలిగామని, అకాల వరదతో అదృష్టవశాత్తు పెద్దగా నష్టం జరగలేదని వివరించారు. నష్టపోయిన వారుంటే ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. -
నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు గండి
సాక్షి, నిడమనూరు: నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ముప్పారం–వేంపాడ్ గ్రామాల మధ్య నారెళ్లగూడ మేజర్ సమీపంలో నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కట్టకు బుధవారం భారీ గండి పడింది. సాయంత్రం 5.45 గం.కు యూటీ వద్ద నీరు కాల్వ లో సుడి తిరుగుతూ ఉండటం, కట్టకు కింది భాగంలోంచి నీరు అధికంగా వెళ్తుండటం గమనించారు. మొదట అయోమయానికి గురైన రైతులు, తర్వాత బుంగ పడిందని నిర్ధారణ చేసుకున్నారు. సాగర్ ఎడమ కాల్వకు 32.109 కిలోమీటర్ వద్ద ఉన్న యూటీకి (అండర్ టన్నెల్) కుడి పక్కన గండి పడి తర్వాత మొత్తం కొట్టుకుపోయింది. బుంగ కాస్తా పెరిగి గంటలోనే కట్టకు గండిపడింది. కట్ట 30 మీటర్ల మేర కొట్టుకు పోయింది. సాగర్ నుంచి వచ్చే నీరంతా పొలాలకు నర్సింహులగూడెం మీదుగా, నిడమనూరు సమీపంలోని వాగులోకి చేరాయి. వాగు ద్వారా నీరు వెళ్తుండటంతో నిడమనూరుకు ముప్పు తప్పింది. గండి పడిన ప్రాంతానికి తహశీల్దార్ ప్రమీల, మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వరరావు వెళ్లి పరిశీలించారు. పూర్తిగా చీకటిపడటంతో ఎక్కడ ఎంత మేర గండి పడిందో అంచనా వేయలేకపోతున్నారు. విషయం తెలుకున్న సాగర్ ప్రాజెక్టు అధికారులు నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు బుధవారం రాత్రి నీటిని నిలిపివేశారు. నిడమనూరు–నర్సింహులగూడెం మధ్య కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారిపైకి నీరు రావడంతో ఒక పక్కనే రాకపోకలకు అనుమతిస్తున్నారు. ఆధునీకరణకు ముందు రెండు చోట్ల గండ్లు సాగర్ ఎడమకాల్వ కట్టకు ఆధునీకరణకు ముందు గండ్లుపడిన సందర్భాలున్నాయి. నిడమనూరు మండలం బీకే పహాడ్ సమీపంలోని వెంగన్నగూడెం మైనర్ తూము వద్ద, హాలియా మండలం ఇబ్రహీంపేట గ్రామం వద్ద కాల్వకట్టకు గండి పడింది. అప్పుడూ వ్యవసాయ పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. సాగర్ ఎడమకాల్వకు ఆధునీకరణ పనులు చేపట్టిన తర్వాత గండి పడటం మాత్రం ఇదే మొదటిసారి. కట్టబలోపేతం చేయడం వల్ల కట్టకు ఇబ్బంది లేకున్నా యూటీలను ఆధునీకరించకపోవడం వల్లే గండిపడింది. ఇదీ చదవండి: సరి లేదు ‘వరి’కేదీ!.. రాష్ట్ర చరిత్రలోనే రికార్డ్ స్థాయిలో నాట్లు -
ప్రమాదాలకు నిలయంగా సాగర్ ఎడమకాల్వ
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల గుండా పారుతూ లక్షల ఎకరాలకు సాగునీరందిస్తోన్న నాగార్జునసాగర్ ఎడమకాల్వ ప్రమాదాలకు నిలయంగా మారింది. ఎక్కడికక్కడ రెయిలింగ్‌లు విరిగిపోవడం, రక్షణ గోడలు లేక ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. అదే విధంగా ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, కొందరి అవగాహనా రాహిత్యంతో కాలువలోకి దిగుతూ నీటి ఉధృతికి గల్లంతవుతున్నారు. గడిచిన నెల రోజుల వ్యవధిలోనే ఈ నాలుగు నియోజకవర్గాల పరిధిలో పదిమంది జలసమాధి కావడం ఆందోళన కలిగిస్తోంది. సాక్షి, మిర్యాలగూడ : నాగార్జునసాగర్ ఎడమ కాలువ మిర్యాలగూడ నియోజకవర్గంలో పలు చోట్ల ప్రమాదకరంగా ఉంది. కాలువపై బ్రిడ్జిలు ఉన్నచోట రెయిలింగ్, రక్షణ గోడలు లేకపోవడం వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయి. నియోజకవర్గంలో ఎక్కువ రద్దీగా ఉండే అద్దంకి – నార్కట్‌పల్లి రహదారిపై వేములపల్లి మండల కేంద్రం సమీపంలో కాలువ ప్రమాదకరంగా ఉంది. అదే విధంగా భీమారం– సూర్యాపేట రహదారిపై శెట్టిపాలెం సమీపంలో ఉన్న బ్రిడ్జి మరింత ప్రమాదకరంగా ఉంది. ఎదురుగా ఒక వాహనం వస్తుంటే మరో వాహనం పక్కకు నిలుపుకోవల్సిన పరిస్థితి ఉంది. నిత్యం రద్దీగా ఉండే భీమారం – సూర్యాపేట రోడ్డుపై ఉన్న వంతెన వెడల్పు చేయాలని ఎంతో కాలంగా డిమాండ్ ఉన్నా అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. అంతే కాకుండా కాలువ కట్టపైనుంచి వెళ్లేవారు మాత్రం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణాలు సాగిస్తుంటారు. వ్యవసాయ పనులకు వెళ్లే వారు కాలువకట్టపై వెళ్లక తప్పడం లేదు. ఎడమ కాలువకు యూటీలు ఉన్న చోట రెయిలింగ్‌లు విరిగిపోవడం వల్ల పశువులు, వాహనాలు పడుతున్నాయి. వేములపల్లి మండల కేంద్రానికి సమీపంలో ఉన్న అన్నపురెడ్డిగూడెం వెళ్లే వైపు కాలువ కట్టపైన, తిమ్మారెడ్డిగూడెం వెళ్లే వైపు కాలువ కట్టపైన యూటీ వల్ల కాలువ నిర్మాణ సమయంలో రెయిలింగ్ ఉండగా అవి ప్రస్తుతం విరిగిపోయాయి. కానీ కొత్తగా రెయిలింగ్‌లు కూడా నిర్మించడం లేదు. ఆదమరిస్తే అంతే సంగతులు కోదాడ: నియోజకవర్గ పరిధిలో సాగర్ కాలువ వద్ద మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. కనీస రక్షణ చర్యలు లేకపోవడం, అవగాహనలోపం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు అంటున్నారు. నియోజకవర్గంలోని చిలుకూరు, మునగాల, నడిగూడెం మండలాల పరిధిలో ఉన్న సాగర్ కాలువపై రెండు చోట్ల అత్యంత ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. గడిచిన కొన్ని నెలల్లో మునగాల హెడ్‌రెగ్యులేటరీ వద్ద 15 మంది ప్రాణాలు కోల్పోగా నడిగూడెం మం డలం చాకిరాల వద్ద ఈ నెల 18న ఆరుగురు యువకులు ప్రాణాలను పోగొట్టుకున్నారు. హెచ్చరిక బోర్డులు కూడా కరువు... 65వ నంబర్ జాతీయరహదారిపై మునగాల సమీపంలో సాగర్ ఎడమకాలువ ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ రహదారిపై వెళ్లేవారు ఈత కోసం సరదాగా కాలువలోకి దిగి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. పాలేరు వైపు వెళ్లే కాలువలో సుడిగుండాలు ఉంటాయి. దీనివల్ల ఈత వచ్చినçప్పటికీ కొత్త వారు ఇక్కడ నీటిలోకి దిగితే ప్రమాదం తప్పదు. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు ఇక్కడ ఇప్పటి వరకు 15 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. గత సంవత్సరం కార్తీకమాసంలో కారు కాలువలోకి దూసుకెళ్లి ఇద్దరు మృతిచెందారు. కార్తీకమాసం, అయ్యప్పల దీక్షా సమయంలో ఇక్కడ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక్కడ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని స్థానికులు పలుమార్లు విజ్ఞప్తులు చేసినా ఎన్ఎస్పీ అధికారులు, పోలీసులు, పంచాయితీ అధికారులు గానీ పట్టించుకున్న దాఖలాలులేవు. చాకిరాల వద్ద అతి ప్రమాదకరం... నడిగూడెం మండలం చాకిరాల వద్ద ఉన్న సాగర్‌కాలువ అతిప్రమాదకరంగా ఉంది. ఇక్కడకు కొత్తవారు వస్తే ప్రమాదానికి గురవడం ఖా యం. మండలం మధ్య నుంచి ఈ కాలువ వెళుతోంది. మండల పరిధిలోని ఆరుగ్రామాల వారు ప్రతి రోజు ఈ కాలువ దాటి ప్రయాణిం చాలి. కొత్తవారు మాత్రం ఏమాత్రం అదమరిచి నా ప్రాణాలు పోతున్నాయి. ఇక్కడ రక్షణగొడ కట్టాలని స్థానికులు కోరుతున్నారు. రక్షణ గోడలు, ప్రమాద సూచిక బోర్డులేవీ..? చింతలపాలెం (హుజూర్నగర్) : సాగర్ ఎడమ కాల్వ గరిడేపల్లి మండలంలోని మర్రికుంట నుంచి వెలిదండ వరకు ప్రవహిస్తోంది. అయితే ఈ కాల్వపై ప్రయాణించే వారికి అవగాహన లేకపోవడం, ప్రమాద సూచికలు లేక నీటిలో గలంతై ప్రాణాలు కొల్పోతున్నారు. పొనుగోడు సమీపంలో మెయిన్ కెనాల్‌కు రిజర్వాయర్ ఉండడంతో చాలా మంది ఈ కాల్వలో ప్రమాదవశాత్తు జారిపడి కొందరు, ఈత కొడుతూ మరికొందరు ప్రాణాలు కొల్పోతున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 15న ధరావత్ వీరన్న, పద్మల కుమార్తె శిరీష (8) కాల్వవద్ద స్నేహితులతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కాల్వలో జారిపడి మృతిచెందింది. రక్షణ చర్యలు శూన్యం.. హాలియా (నాగార్జునసాగర్) : నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని హాలియా, 14వ మైలురాయి, నిడమనూరు మండలంలోని వేంపాడు, ముప్పారం ప్రాం తాల వద్ద ఉన్న సాగర్ ఎడమ కాల్వ ప్ర మాదాలకు నిలయంగా మారింది. హాలి యా పట్టణానికి సమీపంలో సాగర్ ఎడమ కాల్వ ఉంది. దీంతో స్నానం చేసేందుకు, దుస్తులు ఉతికేందుకు, చేపలు పట్టేందుకు వెళ్తున్న వారు ప్రమాదవశాత్తు కాలు జారీ కాల్వలో కొట్టుకుపోతున్నారు. ఎడమ కాల్వకు సమీపంలోనే ఆంజనేయస్వామి, పోతులూరి వీరబ్రహేంద్రస్వామి, శ్రీసీతారామచంద్రస్వామి ఆలయాలు ఉన్నాయి. ఆయా ఆలయాలకు వచ్చే భక్తులతో పాటు వివిధ మాలధారణలు వేసుకున్న స్వాములు కూడా ఎడమ కాల్వలో స్నానాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో ప్రమాదశాత్తు కాలు జారీ గల్లంతవుతున్నారు. అయితే ప్రమాదాల నివారణకు అధికారులు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టడం లేదు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కాల్వ వెంట రక్షణ గోడలు నిర్మించాలి. కాల్వ వెంట నిత్యం ఎన్ఎస్పీ, పోలీస్ సిబ్బంది గస్తీ నిర్వహిస్తే ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. నెల వ్యవధిలో చోటు చేసుకున్న ప్రమాదాలు ⇔ అక్టోబర్ 6న హాలియా పట్టణంలో పెయింటర్‌గా పనిచేస్తున్న పెద్దవూర మండలం శిరసనగండ్ల గ్రామానికి దోరేపల్లి వినయ్‌కుమార్(25) ఎడమ కాల్వ వద్దకు బహిర్భూమికి వెళ్లాడు. శుభ్రం చేసుకునేందుకు కాల్వలోకి దిగే క్రమంలో కాలు జారి మృత్యువాతపడ్డాడు. ⇔ అక్టోబర్ 12న తూర్పుగోదావరి జిల్లా అమలాపురం గ్రామానికి చెందిన కుచ్చర్లపాటి కుమార వెంకటసాయి వర్మ(21) నిడమనూరు మండలంలోని వేపాండు వద్ద ఎడమ కాల్వ వద్దకు బహిర్భూమికి వెళ్లాడు. కాల్వలోకి దిగే క్రమంలో కాలుజారి గల్లంతై మృతిచెందాడు. ⇔ అక్టోబర్ 20న హాలియా పట్టణానికి చెందిన కామిశెట్టి రాంబాబు(30) నీరు పెట్టేందుకు తండ్రి వెంకటేశ్వర్లు కలిసి పొలం వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో రాంబాబు బహిర్భూమి కోసం ఎడమ కాల్వ వద్ద వెళ్లి అందులోకి దిగే క్రమంలో కాలుజారి ప్రాణాలు కోల్పోయాడు. ⇔ 29న వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామానికి చెందిన సకినాల అంజయ్య (24) సమీపంలోని కాలువ వద్దకు బహిర్భూమికి వెళ్లాడు. కాలు జారీ ఎడమ కాలువలో పడిపోయాడు. సమీపంలో ఉన్న వారు రక్షించడానికి ప్రయత్నించినా ఫలితం లేక గల్లంతయ్యాడు. ⇔ హైదరాబాద్‌కు చెందిన జమ్మికుంట్ల నాగేశ్వరరావు (36), వంగపల్లి పవన్ కుమార్ (23), బోనికట్ల సంతోష్ (24), అబ్దుల్ అజీద్ (34), జాన్సన్ జార్జి, తిప్పని రాజేష్ (29) ఈ నెల 18న స్కార్పియో వాహనంలో నడిగూడెం మండలం చాకిరాల గ్రామంలో స్నేహితుడి వివాహానికి హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో రాత్రి 7:45 గంటలకు ఆ వాహనం అదుపుతప్పి 125 కిలోమీటరు వద్ద సాగర్ కాల్వలోకి దూసుకెళ్లింది. దీంతో వాహనంలో ప్రయాణిస్తున్న వారందరూ మృతిచెందారు. రెయిలింగ్ ఏర్పాటు చేయాలి సాగర్ ఎడమకాల్వపై యూటీలు ఉన్న చోట బ్రిడ్జిల వద్ద రెయిలింగ్‌లను విరిగి పోవడంతో ప్ర మాదాలు చోటుచేసుకుంటున్నాయి. సమీప గ్రామాల రైతులు ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలపై కాలువ కట్టపై నిత్యం ప్రయాణించాల్సి ఉంటుంది. బ్రిడ్జి సమీపానికి రాగానే రక్షణ గోడ లేకపోవడంతో ఎడమకాల్వలో దూ సుకెళ్తామని భయాందోళన కు గురి కావాల్సి వస్తోంది. ఒక్కోసారి కాల్వలోకి కూడా దూసుకెళ్లిన ఘటనలు ఉన్నాయి. – ప్రసాద్‌రెడ్డి, తిమ్మారెడ్డిగూడెం, వేములపల్లి రక్షణ గోడలు నిర్మించాలి హాలియా సమీపంలో ఉన్న ఎడమ కాల్వలో ప్రమాదవశాత్తు కాలు జారి గల్లంతవుతున్నారు. ఎడమ కాల్వకు సమీపంలో పలు ఆలయాలు ఉండడంతో భక్తులు తాకిడి ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎడమ కాల్వలో స్నానాలు చేసేందుకు కొందరు, దుస్తులు ఉతికేందుకు వెళ్లే వారు తరుచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రమాదాల నివారణకు అధికారులు ఎడమ కాల్వ వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు కాల్వకు ఇరువైపులా రక్షణ గోడల ఏర్పాటు చేయాలి. –ఆకారపు నరేష్కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు, హాలియా ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలి సాగర్ ప్రధాన ఎడ మ కాల్వ వెంట ప్రమాద సూచికలు లేవు. దీంతో చాలామంది కాల్వలో పడిన మృత్యువాత పడిన ఘటనలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో మర్రికుంట వద్ద చిన్నారి శిరీష అవగాహన లేక కాలు జారీ కొట్టుకుని పోయి చనిపోయింది. ఈతకు వచ్చిన వారు కూడా వరద ప్రవాహాన్ని అంచనా వేయలేక ప్రాణాలు పొగొట్టుకున్నారు. కాల్వ వెంట ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. –రామినేని అశోక్, మర్రికుంట -
తవ్వలేక... తోడలేక!
సాక్షి, హైదరాబాద్: మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైంది ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ)లో సొరంగా ల తవ్వకాల పరిస్థితి. ఎప్పుడూ ఏదో అవాంతరాల తో ఆగుతున్న ఈ పనులకు ప్రస్తుతం సీపేజీ, పాడైన బోరింగ్ యంత్రానికి తోడు నిధుల సమస్య వచ్చి పడింది. గతేడాది మే నెల నుంచి ఈ పనులు నిలిచిపోగా, ఇప్పుడు కొత్తగా సీపేజీ సమస్యతో భారీగా నీరు చేరుతూ మొత్తానికి ఎసరు వచ్చేలా ఉంది. తిరిగి పనులను గాడిలో పెట్టేందుకు రూ.80 కోట్ల వరకు చెల్లిస్తే కానీ పనులు సాగవని నిర్మాణ సంస్థ ప్రభుత్వానికి తేల్చిచెప్పడంతో ఆ నిధులు సర్దడం ఎలా అన్నదానిపై ప్రభుత్వం తల పట్టుకుంటోంది. ఇప్పుడైనా స్పందిస్తారా..? ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో భాగంగా తవ్వాల్సిన రెండు సొరంగాలకు గాను మొదటి దాన్ని శ్రీశైలం డ్యామ్ నుంచి మహబూబ్‌నగర్‌లోని మన్నెవారిపల్లె వరకు తవ్వాలి. దీని మొత్తం పొడవు 43.93 కి.మీ. కాగా, ఇప్పటి వరకు 33.20 కి.మీల పని పూర్తయింది. మరో 10.73కి.మీ.ల పని పూర్తి చేయాల్సి ఉంది. ఈ టన్నెల్‌ను రెండు వైపుల నుంచి తవ్వుతూ వస్తుండగా.. శ్రీశైలం నుంచి జరుగుతున్న పనులు గత ఏడాది మే నెల నుంచి ఆగాయి. టన్నెల్ బోరింగ్ మెషీన్ పాడవడం, కన్వేయర్ బెల్ట్ మార్చాల్సి ఉండటం, ఇతర యంత్రాల్లో మరమ్మతులు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇక ఇన్లెట్ టన్నెల్ పనుల వద్ద ప్రస్తుతం ఊహించని విధంగా సీపేజీ వస్తోంది. గరిష్టంగా గంటకు 9వేల లీటర్ల మేర నీరు సీపేజీ రూపంలో వస్తుండగా, అంత నీటిని తోడే సామర్ధ్యం పనులు చేస్తున్న జేపీ సంస్థ వద్ద లేకపోవడంతో నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఈ దృష్ట్యానే యంత్రం మరమ్మతులకు తోడు నీటిని తోడేందుకు తమకు కనిష్టంగా రూ.60 కోట్లు అడ్వాన్స్‌గా ఇవ్వా లని ఏజెన్సీ ప్రభుత్వానికి గత ఏడాది నవంబర్ నెల లో కోరింది. ఎన్నికల నేపథ్యంలో అది ఆగి చివరకు దీనిపై చర్యలు తీసుకోవాలని ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం నీటి పారుదల శాఖకు సూచించింది. దీనిపై ఆశాఖ రూ.60 కోట్ల అడ్వాన్సులు కోరుతూ ఆర్థిక శాఖకు పంపినా ఇంతవరకు నిర్ణయం తీసు కోలేదు. నిధులు విడుదల చేయలేదు.దీంతో పనులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. ఈ రూ.60 కోట్లకు తోడు ప్రస్తుతం మరో రూ.20 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తంగా రూ.80 కోట్లు చెల్లిస్తే కానీ పనులు మొదలయ్యే అవకాశం లేదని ఇటీవల మరోమారు నిర్మాణ సంస్థ ప్రభుత్వానికి మొరపెట్టుకుంది. ఈ నేపథ్యంలో అయినా నిధుల విడుదల జరిగి పనులు మొదలవుతాయో లేదో చూడాలి. అయితే ప్రాజెక్టును రూ.1,925 కోట్లతో ఆరంభించగా, తర్వా త ఈ వ్యయాన్ని రూ.3,074 కోట్లకు సవరించారు.ఇందులో రూ.2,186 కోట్ల మేర నిధులు ఖర్చయ్యా యి. ప్రాజెక్టు పనులను 2022 నాటికి పూర్తి చేయా లని లక్ష్యం పెట్టుకున్నా, ఇప్పుడున్న పరిస్థితుల్లో అది మరో ఏడాది అదనపు సమయం పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని అధికార వర్గాలే అంటున్నాయి. -
ప్రమిదలు వెలిగించబోయి..
కృష్ణమ్మకు ప్రమిదలు వెలిగించి..జీవితంలో వెలుగులు నింపుకోవాలని అనుకున్నాడు.. ఆ యువకుడు. ఉన్నతంగా జీవించేలా దీవించాలని ఆ తల్లిని వేడుకునేందుకు తండ్రితోపాటే బయలుదేరాడు. విధిరాతకు ఎదురీదలేక చివరకు కృష్ణమ్మ ఒడిలోనే గల్లంతయ్యారు.ఆ తండ్రీకుమారుడు. సూర్యాపేట క్రైం/వేములపల్లి : నూతనకల్ మండలం మిర్యాల గ్రామానికి చెందిన కేతం వెంకన్న. వృత్తిరీత్యా ఎల్ఐసీ ఏజెంట్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మిర్యాల గ్రామమైనప్పటికీ ఏజెంట్‌గా పనిచేస్తూ సూర్యాపేట మొదటి విడత ఇందిరమ్మ కాలనీలోని ఓ ఇల్లును అద్దెకు తీసుకుని ఇక్కడే పాలసీలు చేయిస్తున్నాడు. తనకున్న ఇద్దరు కుమారులు జగదీశ్, నిశాంత్‌లకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. అయితే పెద్ద కుమారుడు జగదీశ్ ఎంసీఏ పూర్తిచేసి హైదరా బాద్‌లో ఉద్యోగం సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు తండ్రి వెళ్తున్నాడని.. జగదీశ్ రెండు నెలల నుంచి ఇంటి వద్దనే ఉంటున్నాడు. మంగళవారం తండ్రి వెంకన్న పాలసీలు చేయించేందుకు మిర్యాలగూడ బయలుదేరేందుకు సిద్ధమవుతున్నాడు. భక్తిభావం ఉన్న జగదీశ్ కృష్ణమ్మ ఒడిలో ప్రమిదలు వెలి గించాలని తండ్రికి చెప్పాడు. వెంటనే తండ్రివెంకన్న కొడుకు జగదీశ్నువెంట తీసుకుని మిర్యాలగూడకు బయలుదేరాడు. మార్గమధ్యలోని శెట్టిపాలెం గ్రామ శివారులోని సాగర్ ఎడమ కాలువ వద్దకు వెళ్లి ప్రమిదలు వెలిగించే ప్రయత్నంలో జగదీశ్ కాలు జారి పడిపోయాడు. వెంకన్న కుమారుడిని కాపాడబోయి ఆయన కూడా అందులో జారిపడ్డాడు. సాయంత్రం సమయంలో అక్కడే చేపలు పట్టే జాలరులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాహన నంబరుతో.. వెంకన్నకు ఉన్న టీవీఎస్ స్టార్ సిటీ వాహనం నంబర్ ద్వారా పోలీసులు అడ్రస్సు కనుగొని బంధువులకు సమాచారం ఇచ్చారు. వారు వెళ్లి చూసే సరికి చెప్పులు.. టూవీలర్ వాహనం వెంకన్నదిగా గుర్తించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుమేరకు అక్కడి పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు సాగిస్తున్నారు. అయితే వెంకన్న, జగదీశ్‌లు గల్లంతయ్యారా.. లేక ఇంకేమైనా జరిగి ఉందన్న కోణంలో పోలీసులు ముమ్మరంగా విచారణ సాగిస్తున్నారు. పేటలో విషాధచాయలు.. సూర్యాపేట జిల్లా కేంద్రం ఇందిరమ్మ మొదటి విడత కాలనీతో పాటు వెంకన్న స్వగ్రామమైన మిర్యాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. భర్త వెంకన్న, చేతికందిన పెద్ద కుమారుడు జగదీశ్ సాగర్ కాలువలో గల్లంతవడంతో భార్య రోది స్తున్న తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. -
సాగర్ నీటిలో కొట్టుకుపోయిన మహిళ
-
ప్రణాళికలు రూపొందించండి
ఏలూరు (ఆర్ఆర్ పేట) : పోలవరం ప్రాజెక్ట్ కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా 2018 జూన్ నుంచి నీటిని విడుదల చేయడానికి అనువుగా జల వనరుల శాఖ అధికారులు పక్కా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. పోలవరం ప్రాజెక్ట్ అతిథి గృహంలో పనుల ప్రగతిపై ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీల ప్రతినిధులతో మంగళవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే అక్టోబర్ 16వ తేదీ నుంచి పోలవరం ప్రాజెక్ట్ స్పిల్‌వే కాంక్రీట్ పనులు ప్రారంభించాలన్నారు. ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇంకా 639 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని చేయాల్సి ఉందని, ఈ పనిని వేగవంతం చేసేందుకు అధునాతన యంత్రాలను ఉపయోగిస్తున్నామని చెప్పారు. లక్ష క్యూబిక్ మీటర్లకే పరిమితమైన మట్టి పనులను 2.40 లక్షల క్యూబిక్ మీటర్లకు పెంచాలని, అవసరమైతే మరిన్ని అధునాతన యంత్రాలు విని యోగించాలని ఆదేశించారు. పోల వరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులపై 4 నెలలకు ఒకసారి ఢిల్లీ స్థాయి అధికారులతో సమీక్షించడంతోపాటు రాష్ట్ర స్థాయిలో ప్రతినెలా క్షేత్ర స్థాయిలో పర్యటించి సమీక్షిస్తానని చెప్పారు. సమావేశంలో జలవనరుల శాఖమంత్రి దేవినేని ఉమ, ప్రిన్సిపల్ కార్యదర్శి సతీష్‌చంద్ర, జల వనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు కె.భాస్కర్, హెచ్.అరుణకుమార్, భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ భవానీప్రసాద్, ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎం.వెంకటేశ్వరరావు, చీఫ్ ఇంజినీర్ హరిబాబు, సూపరింటెండింగ్ ఇంజినీర్లు వి.రమేష్‌బాబు, పోలేశ్వరరావు, ఎంటీ రాజు, శ్రీనివాస్‌యాదవ్, ట్రాన్స్ట్రాయ్ సీఎండీ చెరుకూరి శ్రీధర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.సాంబశివరావు, కుకునూరు సబ్ కలెక్టర్ షాన్మోహన్ పాల్గొన్నారు. జిల్లా ప్రతినిధులకు చోటేది సమీక్ష సమావేశానికి జిల్లాకు చెందిన మంత్రి పీతల సుజాత, స్థానిక ఎమ్మె ల్యే మొడియం శ్రీనివాస్, అక్కడే ఉన్న ఇతర ఎమ్మెల్యేలను ఆహ్వానించక పోవడం చర్చనీయాంశమైంది. కారులో విజయవాడకు.. ఏలూరు అర్బన్ : పోలవరం ప్రాజెక్ట్ పనుల పరిశీలన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు రోడ్డు మార్గంలో విజయవాడ ప్రయాణమయ్యారు. తొలుత ఆయన హెలికాప్టర్లో విజయవాడ చేరుకునే విధంగా అధికారులు షెడ్యూల్ రూపొందించారు. అయితే, పోలవరంలో భారీ వర్షం కురవడంతో హెలికాప్టర్ ప్రయాణించేందుకు అనువైన పరిస్థితులు లేవని, రోడ్డు మార్గంలో విజయవాడ చేరుకోవాలని భద్రతా అధికారులు సూచించారు. దీంతో ముఖ్యమంత్రి పోలవరం, నల్లజర్ల, దూబచర్ల, గుండుగొలను, ఏలూరు, గన్నవరం మీదుగా రోడ్డు మార్గంలో విజయవాడ బయలుదేరారు. ముఖ్యమంత్రి రాకతో దూబచర్ల, గుండుగొలను, ఏలూరు, గన్నవరం జాతీయ రహదారి వెంబడి గంటల తరబడి వాహనాలను నిలిపివేశారు. ఆర్టీసీ బస్‌లు కూడా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
ప్రణాళికలు రూపొందించండి
ఏలూరు (ఆర్ఆర్ పేట) : పోలవరం ప్రాజెక్ట్ కుడి, ఎడమ ప్రధాన కాలువల ద్వారా 2018 జూన్ నుంచి నీటిని విడుదల చేయడానికి అనువుగా జల వనరుల శాఖ అధికారులు పక్కా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. పోలవరం ప్రాజెక్ట్ అతిథి గృహంలో పనుల ప్రగతిపై ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీల ప్రతినిధులతో మంగళవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే అక్టోబర్ 16వ తేదీ నుంచి పోలవరం ప్రాజెక్ట్ స్పిల్‌వే కాంక్రీట్ పనులు ప్రారంభించాలన్నారు. ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇంకా 639 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని చేయాల్సి ఉందని, ఈ పనిని వేగవంతం చేసేందుకు అధునాతన యంత్రాలను ఉపయోగిస్తున్నామని చెప్పారు. లక్ష క్యూబిక్ మీటర్లకే పరిమితమైన మట్టి పనులను 2.40 లక్షల క్యూబిక్ మీటర్లకు పెంచాలని, అవసరమైతే మరిన్ని అధునాతన యంత్రాలు విని యోగించాలని ఆదేశించారు. పోల వరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులపై 4 నెలలకు ఒకసారి ఢిల్లీ స్థాయి అధికారులతో సమీక్షించడంతోపాటు రాష్ట్ర స్థాయిలో ప్రతినెలా క్షేత్ర స్థాయిలో పర్యటించి సమీక్షిస్తానని చెప్పారు. సమావేశంలో జలవనరుల శాఖమంత్రి దేవినేని ఉమ, ప్రిన్సిపల్ కార్యదర్శి సతీష్‌చంద్ర, జల వనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు కె.భాస్కర్, హెచ్.అరుణకుమార్, భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ భవానీప్రసాద్, ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎం.వెంకటేశ్వరరావు, చీఫ్ ఇంజినీర్ హరిబాబు, సూపరింటెండింగ్ ఇంజినీర్లు వి.రమేష్‌బాబు, పోలేశ్వరరావు, ఎంటీ రాజు, శ్రీనివాస్‌యాదవ్, ట్రాన్స్ట్రాయ్ సీఎండీ చెరుకూరి శ్రీధర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.సాంబశివరావు, కుకునూరు సబ్ కలెక్టర్ షాన్మోహన్ పాల్గొన్నారు. జిల్లా ప్రతినిధులకు చోటేది సమీక్ష సమావేశానికి జిల్లాకు చెందిన మంత్రి పీతల సుజాత, స్థానిక ఎమ్మె ల్యే మొడియం శ్రీనివాస్, అక్కడే ఉన్న ఇతర ఎమ్మెల్యేలను ఆహ్వానించక పోవడం చర్చనీయాంశమైంది. కారులో విజయవాడకు.. ఏలూరు అర్బన్ : పోలవరం ప్రాజెక్ట్ పనుల పరిశీలన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు రోడ్డు మార్గంలో విజయవాడ ప్రయాణమయ్యారు. తొలుత ఆయన హెలికాప్టర్లో విజయవాడ చేరుకునే విధంగా అధికారులు షెడ్యూల్ రూపొందించారు. అయితే, పోలవరంలో భారీ వర్షం కురవడంతో హెలికాప్టర్ ప్రయాణించేందుకు అనువైన పరిస్థితులు లేవని, రోడ్డు మార్గంలో విజయవాడ చేరుకోవాలని భద్రతా అధికారులు సూచించారు. దీంతో ముఖ్యమంత్రి పోలవరం, నల్లజర్ల, దూబచర్ల, గుండుగొలను, ఏలూరు, గన్నవరం మీదుగా రోడ్డు మార్గంలో విజయవాడ బయలుదేరారు. ముఖ్యమంత్రి రాకతో దూబచర్ల, గుండుగొలను, ఏలూరు, గన్నవరం జాతీయ రహదారి వెంబడి గంటల తరబడి వాహనాలను నిలిపివేశారు. ఆర్టీసీ బస్‌లు కూడా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
కాలువ గండిపై విచారణ జరిపించాలి
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి సీతారామపురం(నూజివీడు) : పోలవరం కుడి కాలువకు పడిన గండి విషయంలో కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. పోలవరం కుడి కాలువ అండర్‌టన్నెల్‌కు గండి పడిన ప్రాంతాన్ని శనివారం పరిశీలించారు. కాలువ ఎస్ఈ వై.శ్రీనివాసయాదవ్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్థసారథి మాట్లాడుతూ జల వనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, వాస్తవాన్ని వదిలేసి విద్రోహులు చేశారంటూ అసలు విషయాన్ని పక్కదారి పట్టించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గండి పడి ఆరురోజులవుతున్నా ఇప్పటి వరకు శాఖాపరమైన విచారణ చేయించకపోవడంపై విస్మయం వ్యక్తం చేశారు. విద్రోహుల పనే అయితే ఈ గండి ద్వారా నీళ్లు ఎక్కడికి వెళ్లాయి, ఎవరికి లబ్ధిచేకూరిందనే దానినైనా గుర్తించారా అని ప్రశ్నించారు. నీళ్లతో రెండు వేల ఎకరాల్లోని చేపల చెరువులను నింపుకున్నారని, దీనిని ఎందుకు గుర్తించడం లేదని నిలదీశారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన కాలువకు గండి పడినప్పుడు ప్రాథమిక నివేదికను అధికారులు ఇవ్వాలని, ఇది ఎవరి వైఫల్యమో తేల్చి చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ ఇంత వరకు ప్రభుత్వం ఈ గండి పై నోరుమెదపక పోవడాన్ని బట్టే దీని వెనుక ఎవరున్నారో అర్థమవుతోందన్నారు. ప్రజలసొమ్ము అంటే ప్రభుత్వానికి బాధ్యత లేకుండా పోయిందని, ఇష్టారాజ్యంగా దోపిడీ జరుగుతోందని ధ్వజమెత్తారు. పార్థసారథి వెంట గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త దుట్టా రామచంద్రరావు, బాపులపాడు జెడ్పీటీసీ సభ్యురాలు కైలే జ్ఞానమణి, వైఎస్సార్సీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి కోడెబోయిన బాబి, జిల్లా కార్యదర్శి నక్కా గాంధీ, ఎంపీటీసీలు బేతాల ప్రమీలారాణి, కొనకళ్ల వెంకటేశ్వరరావు ఉన్నారు. యుద్ధప్రాతిపదికన పనులు పోలవరం కుడికాలువపై రామిలేరుపై ఉన్న యూటీకి పడిన గండిని పూడ్చేందుకు గాను యుద్ధప్రాతిపదికన పనులు జరిగేలా చర్యలు తీసుకున్నట్లు జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. గండి పూడ్చివేత పనులను శనివారం పరిశీలించారు. అండర్‌టన్నెల్ స్లాబ్‌ను ఆనుకుని చేస్తున్న ఆఫ్రాన్ త్వరితగతిన పూర్తిచేయాలని ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, పోలవరం సీఈ రమేష్‌బాబులను ఆదేశించారు. పనులన్నీ పూర్తయిన తరువాత మరల పట్టిసీమ నుంచి నీటిని విడుదల చేసి కృష్ణాడెల్టాకు గోదావరి జలాలను అందించనున్నట్లు చెప్పారు. ఉమాతో పాటు పోలవరం కాలువ ఎస్ఈ వై.శ్రీనివాస్ యాదవ్, జల వనరులశాఖ ఎపెక్స్ కమిటీ సభ్యుడు ఆళ్ల గోపాలకృష్ణ, కృష్ణా తూర్పుడెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ గుత్తా శివరామకృష్ణ ఉన్నారు. -
సాగర్ ఎడమ కాల్వకు గండి
ఖమ్మం: నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు 133వ కిలో మీటరు వద్ద గండిపడింది. దీంతో ఖమ్మం జిల్లాలతోపాటు, ఆంధ్రప్రదేశ్‌లో అనేక ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. సుమారు 4 నుంచి 10 మీటర్ల వెడల్పుతో గండి పడినట్లు తెలిసింది. దీంతో పాలేరు దిగువకు నీటి సరఫరాను నిలిపివేశారు.. దీంతో రెండున్నర లక్షల ఏకరాల ఆయకట్టుకు నీటి సరఫరా నిలిచిపోయంది. ఈ విషయమై సమాచారమందుకున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, తన్నీరు హరీశ్‌రావులు అధికారులను అప్రమత్తం చేశారు. కాల్వకు వెంటనే మరమతులు చేపట్టి నీటిని విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. గండిపడిన ప్రాంతంలో శుక్రవారం పొక్లెయిన్‌తో తవ్వకాలు చేసి సాధ్యమైనంత మేరకు గండిని బంక మట్టిని నింపి అవసరమైతే కాంక్రీటు చేసి ఈనెల రోజులు తాత్కాలికంగా రైతులకు నీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు సంబధిత అధికారులు తెలిపారు. గండి పూడ్చే పనులు కనీసం నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. -
ఎడమ కాల్వ.. యమ డేంజర్
మిర్యాలగూడ : మిర్యాలగూడ నియోజకవర్గంలో నాగార్జునసాగర్ ఎడమ కాల్వ డేంజర్‌జోన్‌గా మారింది. కాల్వకట్టపై నుంచి ప్రమాదమని తెలిసినా ప్రయాణాలు సాగిస్తూనే ఉన్నారు. నియోజకవర్గంలోనే సుమారుగా 30 కిలోమీటర్ల మేర సాగర్ ఎడమ కాల్వ ఉంది. సమీపఉంది. సమీప గ్రామాల ప్రజలు కాలువపై నుంచే ప్రయాణాలు చేస్తుంటారు. బ్రిడ్జిలు ఉన్న చోటనుంచి కాకుండా వ్యవసాయ పొలాల వద్దకు వెళ్లడంతోపాటు దూర ప్రాంతాలకు వెళ్లేవారూ కాలువ కట్టపైనుంచే వెళ్తుంటారు. ఈ క్రమంలో వాహనాలు అదుపుతప్పి కాలువలో పడి మృతిచెందుతున్నారు. ఇలాంటి సంఘటనలు మిర్యాలగూడ నియోజకవర్గంలో సర్వసాధారణంగా జరుగుతున్నాయి. ఆదివా రం వేములపల్లి మండలంలోని రావులపెంటలో జరిగిన ప్రమాదం ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. కాలువకు అతి సమీపంలో గ్రామాలు.. ఎడమ కాలువకు అతి సమీపంలో పలు గ్రామాలు ఉన్నాయి. వేములపల్లి మండలంలోని అన్నపురెడ్డిగూడెం, వేములపల్లి, శెట్టిపాలెం, దొండవారిగూడెం, రావులపెంట, తడకమళ్ల గ్రామాలు ఉన్నాయి. ఆయా గ్రామాల ప్రజలు నిత్యం వ్యవసాయ పనులకు కూడా ఎడమ కాల్వకు సమీపంలోకి వెళ్తుం టారు. కొంతమంది వ్యవసాయ పనుల కోసం వెళ్లి కాలువలో జారిపడడంతోపాటు కాల్వకట్టపై నుంచి ప్రయాణాలు చేస్తూ ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతిచెందుతున్నారు. రెయిలింగ్ ఉంటే ప్రమాదాల నివారణ.. ఎడమ కాల్వ కట్ట వెంట రెయిలింగ్ ఉంటే ప్రమాదాలు నివారించే అవకాశం ఉంది. వేములపల్లి మండల కేంద్రంతోపాటు శెట్టిపాలెం, అన్నపురెడ్డిగూడెం, ఐలాపురం, రావులపెంట, తడకమళ్ల గ్రామాల వద్ద కాల్వపై వంతెనలు ఉన్నాయి. వంతెనల వద్ద కూడా రెయిలింగ్ సక్రమంగా లేకపోవడం వల్ల ప్ర మాదాలు సంభవిస్తున్నాయి. కాల్వ ఆధునికీకరణలో భాగంగా కట్ట వెడల్పు చేయడం వల్ల ద్విచక్ర, ఇతర వాహనాలు కూడా వెళ్తున్నాయి. ఇటీవల జరిగిన ఘటనలు.. సెప్టెంబర్ 2వ తేదీన మిర్యాలగూడ పట్టణానికి చెందిన తేలుకుంట్ల నాగేశ్వర్రావు (52) అనే వ్యాపారి వేములపల్లి వద్ద ఎడమ కాల్వలో పడి గల్లంతయ్యాడు. ఎల్ - 21 లిఫ్ట్ వద్ద మృతదేహం లభించింది. నవంబర్ 11వ తేదీన వేములపల్లి మండల కేంద్రం సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న బొమ్మపాల సంతోష్ కాల్వలోకి దిగడంతో ప్రమాదవశాత్తు కాలుజారి గల్లంతయ్యాడు. నవంబర్ 25వ తేదీన హైదరాబాద్‌కు చెందిన లారీడ్రైవర్ స్నానానికి వేములపల్లి వద్ద సాగర్ ఎడమ కాల్వలోకి దిగి కాలుజారి పడి గల్లంతయ్యాడు. 27న జాన్‌పహడ్ మేజర్ వద్ద అతని మృతదేహం లభించింది. నవంబర్ 2వ తేదీన కాల్వలో గల్లంతైన ముగ్గురు వ్యక్తులను స్థానికులు గమనించి కాపాడారు. డిసెంబర్ 1వ తేదీన వృద్ధురాలు కాల్వలో పడి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా స్థానికులు కాపాడారు. ఆదివారం వేములపల్లి మండలంలోని రావులపెంట వద్ద కాల్వలో ఆటో పల్టీ కొట్టిన సంఘటనలో ముగ్గురు మృతిచెందారు. అదే విధంగా వేములపల్లి మండల కేంద్రం సమీపంలోని కాల్వలో శ్రీకాంత్ అనే విద్యార్థి గల్లంతయ్యాడు. -
ఒక జిల్లా పరిధిలో ఒకే సర్కిల్
ఖమ్మం అర్బన్ : ఇప్పటి వరకు ఒక రాష్ట్రం ఒకే కాల్వగా ఉన్న నాగార్జునసాగర్ ప్రధాన ఎడమ కాల్వ ఇక నుంచి రెండు రాష్ట్రాలు.. మూడు ముక్కలుగా మారబోతోంది. జూన్ 2న ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోవడంతో సాగర్ ఎడమకాల్వ పరిధిలోని రెండు రాష్ట్రాల అయకట్టును కూడా విడగొట్టారు. దీని ప్రకారం కాల్వలను, సిబ్బందిని, కార్యాలయాలను సైతం కేటాయించారు. ఆ పనులన్నీ ఇప్పటికే దాదాపు పూర్తయ్యాయి. ఇక ఆయా రాష్ట్రాల పరిధిలో ఉన్న జిల్లాల్లో సైతం అయకట్టును విడగొట్టి ఒక జిల్లా పరిధిలో ఒకే సర్కిల్‌గా మార్చబోతున్నారు. అంటే ఖమ్మం, నల్లగొండ, కృష్ణా మూడు జిల్లాల్లో మూడు సర్కిల్లు ఏర్పాటు కానున్నాయి. దీంతోపాటు ఆ జిల్లాల్లో ఉన్న ఆయకట్టు ప్రకారం సెక్షన్, సబ్ డివిజన్, డివిజన్ కార్యాలయాలను సైతం ఏర్పాటు చేయబోతున్నారు. దానికి అవసరమైన నివేదిక కోసం ఆయకట్టు వివరాలు, ప్రస్తుతం ఉన్న కార్యాలయాల డేటాను నమోదు చేస్తున్నారు. గత రెండు రోజులుగా ఎన్నెస్పీ టేకులపల్లి (ఖమ్మం) ఎస్ఈ అప్పలనాయుడు, ఈఈలు, డీఈలతో పాటు సిబ్బంది లెక్కలు తీశారు. జిల్లాలో ఒకే సర్కిల్... ఎన్నెస్పీ కెనాల్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు టేకులపల్లి సర్కిల్ పేరుతో(ఖమ్మం) కార్యాలయం కొనసాగుతోంది. నల్లగొండ జిల్లా పరిధిలోని కొంత ఆయకట్టు, కృష్ణా జిల్లాలోని కొంత ఆయకట్టు.. ఇలా మూడు జిల్లాల పరిధిలోని 5,49, 296 ఎకరాల భూమి ఈ సర్కిల్ పరిధిలో ఉండేది. ఇప్పడు జిల్లాల వారీగా సర్కిల్ మార్పులతో ఖమ్మం పరిధిలో 2, 51,800 ఎకరాల ఆయకట్టు మాత్రమే మిగిలి ఉంది. గతంలో నల్లగొండ జిల్లాలోని 20,681 ఎకరాలు, కృష్ణా జిల్లాలోని 2.70 లక్షల ఎకరాలు ఖమ్మం పరిధిలో ఉండేది. ఇప్పుడు ఇవన్నీ ఆయా జిల్లాల సర్కిల్ పరిధిలోకి వెళ్లనున్నాయి. ఇక గతంలో నూజవీడు డివిజన్ పరిధిలో ఉన్న జిల్లా ఆయకట్టు 13, 994 ఎకరాలు ఇప్పుడు ఖమ్మం జిల్లాలో కలవనుంది. ఈ అయకట్టు ఖమ్మం జిల్లాకు చెందినప్పటికీ జోన్-3 పరిధిలో ఉండేది. ఇప్పుడు ఈమొత్తాన్ని జోన్- 2 పరిధిలోకి తీసుకొచ్చేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొం దిస్తున్నారు. జోన్-2 పరిధిలోకి వచ్చే భూములకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరు విడుదల చేసేందుకు అధికారులు రూ. 20 కోట్లకు పైగా అంచనాలతో ప్రతిపాదనలు తయారు చేసి రాష్ట్రం విడిపోకముందే ప్రభుత్వానికి అందించారు. జిల్లాలో మొత్తం ఆయకట్టును ఒకే సర్కిల్ కార్యాలయం పరిధిలోకి తీసుకొచ్చిన తర్వాత దాని ప్రకారం కార్యాలయాలు ఏర్పా టు చేస్తారు. గతంలో కృష్ణా, ఖమ్మం జిల్లాల పరిధిలో కలిసి ఉన్న ఆయకట్టుకు సెక్షన్ కార్యాలయాలు ఉండేవి. రాష్ట్రాలు విడిపోవడంతో జిల్లా ఆయకట్టును మినహాయించి ఆటువైపు ఉన్న ఎనిమిది సెక్షన్, ఒక సబ్‌డివిజన్ కార్యాలయాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపారు. జిల్లాలో మరో మానిటరింగ్ సబ్ డివిజన్ కార్యాలయం..? జిల్లాలో ఉన్న ఆయకట్టు ప్రకారం 750 నుంచి1200 ఎకరాలకు ఒక సెక్షన్, 30 వేల నుంచి 40 వేల ఎకరాలకు ఒక సబ్ డివిజన్, లక్ష నుంచి 1.50 లక్షల ఎకరాలకు ఒక డివిజన్ కార్యాలయాల చొప్పున ఏర్పాటు చేయనున్నారు. నీటి సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీలను సైతం ఇదే తరహాలో తయారు చేయబోతున్నారు. దీంతో గతంలో ఉన్న నీటి సంఘాల్లో పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇప్పటి వరకు ఎడమకాల్వ మొత్తానికి మానిటరింగ్ డివిజన్ కార్యాలయం ఖమ్మంలోనే ఉంది. దాని పరిధిలోనే ఐదు సబ్ డివిజన్ కార్యాలయాలు (మిర్యాలగూడెం, హూజూర్‌నగర్, నాయకన్‌గూడెం, టేకులపల్లి, తిరువూరులలో) ఉన్నాయి. అయితే రాష్ట్రం విడిపోవడంతో తిరువూరు సబ్ డివిజన్‌ను జగ్గయ్య పేటలో విలీనం చేశారు. దాని స్థానంలో ఖమ్మం జిల్లాలో కల్లూరు సబ్ డివిజన్ ఏర్పాటు చేస్తే నీటి పర్యవేక్షణతో పాటు పరిపాలన పరంగా వెసులుబాటు ఉంటుందని, దాని ప్రకారమే ఈ మార్పులకు శ్రీకారం చుట్టామని అధికారులు చెపుతున్నారు.