
సూర్యాపేట: కాలువలో నీరు నిండుగా ఉండటంతో పాటు.. నీటి మధ్యలో గండి పడటం వల్లే సాగర్ ఎడమ కాలువ ప్రమాదాన్ని వెంటనే గుర్తించలేకపోయామని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం సూర్యాపేటలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
కాలువ కట్ట పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, ఐదారు రోజుల్లో తిరిగి ఎడమ కాల్వలో నీటిని పునరుద్ధరిస్తామని చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లో చేరిన నీటిని కూడా యుద్ధ ప్రాతిపదికన బయటకు పంపగలిగామని, అకాల వరదతో అదృష్టవశాత్తు పెద్దగా నష్టం జరగలేదని వివరించారు. నష్టపోయిన వారుంటే ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment