
సూర్యాపేట: ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ బీజేపీ దుర్మార్గాలకు పరాకాష్ట అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. దేశంలో ఎమర్జెన్సీకి మించిన దారుణ పరిస్థితులు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన సోమవారం సూర్యాపేటలో విలేకరులతో మాట్లాడుతూ ఈడీ, ఐటీ, సీబీఐ వంటి సంస్థలు తమ స్వాతంత్య్రాన్ని కోల్పోయి బీజేపీ నేతల ఆరోపణల కోసమే పనిచేస్తున్నాయని విమర్శించారు.
బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు అప్రజాస్వామికంగా ఉన్నాయని, బీజేపీ అరాచకాలు ఇలానే కొనసాగితే దేశ ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలతో తెలంగాణ అభివృద్ధిని బేరీజు వేసుకుని కేంద్రమంత్రులు మాట్లాడాలన్నారు. కేసీఆర్ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతల కుయుక్తులు తెలంగాణ సమాజం ముందు సాగవని మంత్రి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment