
సాక్షి, హైదరాబాద్: జోన్‌లో నిర్మాణంలో ఉన్న రైల్వే ప్రాజెక్టు ల పూర్తికి ఆటంకంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకుం టూ లక్ష్యాలను చేరుకోవాలని అధికారులకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ సూచించారు. గురువా రం రైల్‌వికాస్ నిగమ్ లిమిటెడ్, రైల్వే ఎలక్ట్రిఫికేషన్ నిర్మాణ సంస్థల ఉన్నతాధికారులతో రైల్ నిలయంలో సమీక్ష నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు అవసరమైన ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు.
ఆయా విభాగాల అధికారుల సమన్వయంతో భూసేకరణ, రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు పొందటం, అటవీ అనుమతులు సహా పలు సమస్యలను పరిష్కరించుకుని పనులు పూర్తి చేయా లని ఆదేశించారు. ఎంఎంటీఎస్ ఫేజ్– 1, కాజీపేట–విజయవాడ ట్రిప్లింగ్, పర్భని–ముద్ఖేడ్ డబ్లింగ్, నడికుడి–శ్రీకాళహస్తి కొత్తమార్గం, కల్లూరు–గుంతకల్లు ప్రాజెక్టుల వార్షిక ప్రణాళికలను సమీక్షించారు.