
‘రియో’లో ఆసీస్ తరఫున భారత సంతతి రెజ్లర్
ఈ ఏడాది ఆగస్టులో జరిగే రియో ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియా తరఫున భారత సంతతి రెజ్లర్ విన్యాసాలు చూడొచ్చు.
మెల్‌బోర్న్: ఈ ఏడాది ఆగస్టులో జరిగే రియో ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియా తరఫున భారత సంతతి రెజ్లర్ విన్యాసాలు చూడొచ్చు. భారత్‌కు చెందిన వినోద్ కుమార్ దహియా రియో ఒలింపిక్స్‌లో పురుషుల 66 కేజీల గ్రీకో రోమన్ విభాగంలో ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఇటీవల జరిగిన ఆఫ్రికా-ఓసియానియా క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో 31 ఏళ్ల వినోద్ కుమార్ రజత పతకం నెగ్గి రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందాడు. హరియాణాకు చెందిన వినోద్ 2010లో ఆస్ట్రేలియాకు వలస వెళ్లాడు. అక్కడే యునెటైడ్ రెజ్లింగ్ క్లబ్‌లో తన ప్రాక్టీస్‌ను కొనసాగించాడు. గతేడాది ఆస్ట్రేలియా పౌరసత్వం పొందిన అతను ఇప్పటివరకు ఆరుసార్లు ఆస్ట్రేలియా చాంపియన్‌గా నిలిచాడు.