మన ఆశల పోటీలు నేటి నుంచి
రియో డి జనీరో: ఒలింపిక్స్ ప్రారంభమై ఐదు రోజులు గడుస్తున్నా భారత్ పతకాల బోణీ చేయలేకపోయింది. కచ్చితంగా పతకం వస్తుందనుకున్న షూటింగ్‌లో ఇప్పటివరకూ పూర్తి నిరాశే మిగిలింది. అయితే భారత్‌కు కచ్చితంగా పతకాలు వస్తాయని భావిస్తున్న మరో మూడు ఈవెంట్లు నేటి నుంచి జరుగుతాయి. లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌తో పాటు సింధు, శ్రీకాంత్ లు గురువారం బరిలోకి దిగుతున్నారు.
ఇక మిక్స్‌డ్ డబుల్స్‌లో బోపన్న-సానియా జోడీ కూడా తమ తొలి మ్యాచ్ ఆడబోతున్నారు. 112 సంవత్సరాల తర్వాత ఒలింపిక్స్‌లోకి వచ్చిన గోల్ఫ్‌కూ ఈరోజు తెరలేస్తుంది. అనేక మంది టాప్ ఆటగాళ్లు రియోకు దూరంగా ఉన్ననేపథ్యంలో ఆసియా నంబర్‌వన్ అనిర్బన్ లాహిరిపై పతక అంచనాలు పెరిగాయి.
గోల్ఫ్
పురుషుల వ్యక్తిగత ఈవెంట్
(తొలి రౌండ్)
అనిర్బర్ లాహిరి, శివ్ చౌరాసియా
సాయంత్రం 4.00 గంటల నుంచి
బ్యాడ్మింటన్
మహిళల సింగిల్స్
పీవీ సింధు వర్సెస్ లారా సరోసి (హంగెరి)
సాయంత్రం 6.40 గంటల నుంచి
సైనా వర్సెస్ లోహన్నీ విసెంటే (బ్రెజిల్)
రాత్రి 7.50 గంటల నుంచి
పురుషుల సింగిల్స్
కె.శ్రీకాంత్ వర్సెస్ లినో మునోజ్ (మెక్సికో)
శుక్రవారం తెల్లవారుజాము 5.35 గంటల నుంచి
మహిళల డబుల్స్
జ్వాల, అశ్విని వర్సెస్ టకహషి, మట్సుటొమొ (జపాన్)
సాయంత్రం 4.30 గంటల నుంచి
పురుషుల డబుల్స్
సుమిత్ రెడ్డి, అత్రి వర్సెస్ సెటియవాన్, అహ్‌సన్
(ఇండోనేసియా)
సాయంత్రం 5.30 గంటల నుంచి
ఆర్చరీ
మహిళల వ్యక్తిగత విభాగం ప్రిక్వార్టర్స్
బొంబేలా దేవి వర్సెస్ అలెజాండ్రా (మెక్సికో)
సాయంత్రం 5.56 గంటల నుంచి
పురుషుల హాకీ
భారత్ వర్సెస్ నెదర్లాండ్స్
సాయంత్రం 6.30 గంటల నుంచి
మహిళల హాకీ
భారత్ ్ఠ అమెరికా
శుక్రవారం తెల్లవారుజాము 4.00 గంటల నుంచి
బాక్సింగ్
పురుషుల బాంటమ్ 56 కేజీ
శివ థాపా వర్సెస్ కరజానా (క్యూబా)
రాత్రి 8.00 గంటల నుంచి
(మ్యాచ్‌లన్నీ స్టార్‌స్పోర్ట్స్ 1,2లో ప్రత్యక్షప్రసారం)