తెలంగాణకూ ప్రత్యేకహోదా ఇవ్వాలి: వినోద్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదాను ఇవ్వాలని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి టీఆర్‌ఎస్ ఎంపీ బి.వినోద్‌కుమార్ శనివారం లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని 94(1) ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి తగిన విధంగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారన్న విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రం స్థిరపడే చర్యలకు, ప్రజల స్థితిగతులు పెంచే ప్రభుత్వ పథకాలకు, పారిశ్రామిక అభివృద్ధికి, ఆర్థికవృద్ధికి రెండు రాష్ట్రాల్లోనూ కేంద్రప్రభుత్వం చేయూతను ఇస్తుందని చెప్పిన విషయాన్ని ఆ లేఖలో వినోద్ ప్రస్తావించారు.