'90 శాతం మంది కాంగ్రెస్తో విలీనం వద్దంటున్నారు'
కాంగ్రెస్ పార్టీలో విలీనం వద్దని దాదాపు 90 శాతం మంది తమ పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారని టీఆర్ఎస్ నేత జి.వినోద్ మంగళవారం న్యూఢిల్లీలో వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఎంత ముఖ్యమో ఆ రాష్ట్ర పునర్నిర్మాణం కూడా తమకు అంతే ముఖ్యమని తెలిపారు. తమ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పునర్నిర్మాణం జరగాలని తామంతా కోరుకుంటున్నామన్నారు.
తెలంగాణ సమస్యల పరిష్కారం, అభివృద్ధికి సంబంధించిన కీలక బాధ్యతలు కేసీఆర్కు అప్పగిస్తే తమ పార్టీ విలీనంపై ఆలోచిస్తామన్నారు. అయితే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తా లేక విలీనమా అనే అంశాలపై చర్చల ప్రక్రియ జరుగుతుందని విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆ అంశాలపై చర్చ ఒక్క రోజులో ముగిసేది కాదన్నారు.