సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణలో అభివృద్ధి చూసి విపక్షాలు భయపడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్ మంగళవారమిక్కడ మాట్లాడుతూ..‘మమ‍్మల్ని తిడితేనే కాంగ్రెస్ నేతలకు పూట గడుస్తుంది. చివరకు మా పిల్లలను కూడా వదలడం లేదు. సీఎం కేసీఆర్‌ను, మా ఇంట్లో చిన్న పిల్లలను కూడా తిడుతున్నారు. గడ్డాలు పెంచుకుంటామన్నవాళ్లు... గడీలు పగులకొడతామన్నవారికి ప్రజల మద్దతు లేదు. ప్రజల గుండెల్లో ఉన్న కేసీఆర్‌ను ఏం చేయలేరు.’ అని వ్యాఖ్యలు చేశారు. కాగా ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ కాంగ్రెస్, టీఆర్‌ఎస్ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం విదితమే.
అలాగే తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం వ్యాఖ్యలపై కూడా కేటీఆర్ ధ్వజమెత్తారు. కొందరు అవాకులు, చెవాకులు పేలుతున్నారు. ప్రగతి భవన్ గేట్లు తెరవరని కొందరు అంటున్నారు. ప్రగతితో పనిలేనివారికి ప్రగతిభవన్‌తో ఏంపని?. కార్మికులకు, కన్నీటితో బాధపడేవారికి, సింగరేణి కార్మికులు, అంగన్‌వాడీలకు ప్రగతిభవన్‌లో చోటుంది అని ఆయన అన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం ముందుంది. దేశంలో ఎక్కడాలేని పథకాలను తెలంగాణలో అమలు పరుస్తున్నామని, రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వేలేకే ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment