సాక్షి, హైదరాబాద్ : వలస విధానంపై నిర్దిష్ట లక్ష్యాలు అవసరమని మాజీ రాయబారి బీఎం వినోద్‌కుమార్ అన్నారు. బేగంపేటలోని జీవన్‌జ్యోతిలో ‘గ్లోబల్ కాంపాక్ట్ ఫర్ మైగ్రేషన్’ (జీసీఎం) అంశంపై రెండు రోజుల రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్ శుక్రవారం ప్రారంభమైంది. ఎంఎఫ్‌ఏ, ఎన్‌డబ్ల్యూడబ్ల్యూటీ, ఈడబ్ల్యూఎఫ్, ఐఎల్‌ఓ, సీఐఎంఎస్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. సురక్షిత, క్రమబద్ధమైన, చట్టపరమైన వలసలకు అంతర్జాతీయ సహకారం, ప్రపంచ భాగస్వామ్యం బలోపేతం చేయాలన్నారు. సామాజిక భద్రతా అర్హతలు, ప్రయోజనాలకు అనుగుణంగా విధానాలు ఉండాలన్నారు.
రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ త్రిపురాన వెంకటరత్నం మాట్లాడుతూ.. ప్రజలు తమ స్వదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళేలా ప్రేరేపించే ప్రతికూల అంశాలపై దృష్టిసారించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ, మైగ్రేట్స్ రైట్స్ యాక్టివిస్ట్ నర్సింహనాయుడు, ఎం.భీంరెడ్డి, సిస్టర్ లిస్సీ జోసఫ్, ఆశాలత, రఫీక్, రాజశేఖర్, డాక్టర్ తిలక్‌చందన్, మాణిక్యాలరావు పాల్గొన్నారు.
వలస విధానంపై నిర్దిష్ట లక్ష్యాలు అవసరం
Published Sat, Sep 14 2019 2:14 PM | Last Updated on Sat, Sep 14 2019 2:16 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment