
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు ఏపీలో ఆయన స్థానం ఏంటో తెలుసుకుంటే మంచిదని టీఆర్‌ఎస్ ఎంపీ బి.వినోద్‌కుమార్ హితవు పలికారు. బుధవారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. మోదీకి వ్యతిరేకంగా అప్పటికే ఉన్న కూటమిలో చంద్రబాబు చేరారే తప్ప ఆయన సొంతంగా కూటమి ఏర్పాటు చేసిందేమీ లేదన్నారు. అప్పటికే కాంగ్రెస్ కూటమిలో ఉన్న ముఖ్యమంత్రులు, ఇతర పార్టీల నేతలతో చంద్రబాబు తరచూ ఢిల్లీలో సమావేశమవుతూ కూటమిని తానే నడిపిస్తున్నానని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. రిజర్వేషన్ల పరిధి 50 శాతానికి మించరాదన్న సుప్రీంకోర్టు తీర్పును కూడా సవరించాల్సిన అవసరం ఉందని వినోద్‌కుమార్ అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్రాలు పంపిన ప్రతిపాదనలను కూడా కేంద్రం ఆమోదించాల్సిన అవసరం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment