తెలంగాణ ప్రజలకు వరం.. ఎస్సారెస్పీ
ఎంపీలు కవిత, వినోద్‌కుమార్
జగిత్యాల: ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రజలకు వరంలాంటిదని, గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఎస్సారెస్పీ కాలువల ద్వారా నీరు తగ్గుముఖం పట్టిందని నిజామాబాద్, కరీంనగర్ ఎంపీలు కవిత, వినోద్‌కుమార్ అన్నారు. జగిత్యాలలో ఆదివారం విలేక రులతో మాట్లాడారు.
20 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వాలు 365 రోజులు కాకతీయ కాలువను తవ్వి సూర్యాపేట జిల్లా వరకు తీసుకువెళ్లారని, సరైన రూపకల్పన లేకపోవడంతో ఒక ఎకరాకు నీళ్లు అందలేదన్నారు. ఈ పరిస్థితిని గుర్తించిన సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను రీడిజైన్ చేసి ప్రాణహిత–చేవెళ్ల వద్ద ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసి అన్ని జిల్లాలకు నీరందించేందుకు కృషిచేస్తు న్నారని చెప్పారు. ఈనెల 10న పోచంపాడ్ వద్ద సీఎం ప్రజలకు సందేశం ఇచ్చేలా సభ ఏర్పాటుచేశామని తెలిపారు.