SRSC Project
-
Godavari: వందేళ్లలో తొలిసారి
సాక్షి, హైదరాబాద్: గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. మహారాష్ట్ర, తెలంగాణలోని నదీ పరీవాహక ప్రాంతంలో విస్తృతంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. జూలైలో గోదావరికి ఇంత భారీ వరద రావడం వందేళ్లలో ఇదే ప్రథమం. నిండుకుండలా మారడంతో రాష్ట్రంలోని ఎస్సారెస్పీ నుంచి ఏపీలోని ధవళేశ్వరం బ్యారేజీ వరకూ గోదావరిపై ఉన్న అన్ని ప్రాజెక్టుల గేట్లను ఎత్తేశారు. ఉప నదుల పరవళ్లు: గోదావరి బేసిన్ పరిధిలో సోమవారం రాత్రి, మంగళవారం భారీ వర్షాలు కురవడంతో కడెంవాగు, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, తాలిపేరు, కిన్నెరసారి, పెద్దవాగు తదితర ఉప నదులు ఉప్పొంగుతున్నాయి. దాంతో గోదావరికి వరద పోటెత్తుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగైన పార్వతి (సుందిళ్ల), లక్ష్మీ (మేడిగడ్డ), సరస్వతి (అన్నారం) బ్యారేజీల గేట్లను పూర్తిగా ఎత్తేశారు. ఎస్సారెస్పీ గేట్లు తొమ్మిది ఎత్తారు. ఆయా ప్రాజెక్టులు, బ్యారేజీలకు వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. పార్వతి నుంచి 4,90,254 క్యూసెక్కులు, సరస్వతి నుంచి 4,30,110 క్యూసెక్కులు, లక్ష్మీ నుంచి 8,83,140 క్యూసెక్కులు వదులుతున్నారు. లక్ష్మీ బ్యారేజీ 81 గేట్లు, సరస్వతీ 54, ఎల్లంపల్లి 41 గేట్లు ఎత్తారు. దేవాదుల పంప్ హౌస్ వద్ద గోదావరి మట్టం 83.70 మీటర్లకు పైగా ఉంది. సమ్మక్క బ్యారేజీ (తుపాకులగూడెం)లోకి 9.31 లక్షల క్యూసెక్కులు చేరుతోంది. అంతే స్థాయిలో వరదను దిగువకు వదిలేస్తున్నారు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద వస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా మంగళవారం 2.22 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో అప్రమత్తమైన అధికారులు 16 గేట్లు ఎత్తి అదేస్థాయిలో నీటిని దిగువకు వదిలారు. సీతమ్మసాగర్‌లోకి 13,42,030 క్యూసెక్కులు చేరుతోంది. దీంతో గేట్లు ఎత్తి అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న నీటిమట్టం మంగళవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో 13,49,465 క్యూసెక్కుల ప్రవాహం ఉంది. గేజ్ వద్ద నీటి మట్టం 51.60 అడుగులకు తగ్గడంతో మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకుని రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. అయితే ఎగువన భారీ వరద దిగువకు విడుదలైన నేపథ్యంలో భద్రాచలం వద్ద మళ్లీ నీటిమట్టం పెరుగుతోందని, 53 అడుగులకు చేరుకుంటే మళ్లీ మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తామని అధికారులు తెలిపారు. మరో మూడు రోజులు వరద ఉధృతి గోదావరి పరీవాహక ప్రాంతంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఎగువ నుంచి భారీ వరద వస్తుందని బేసిన్ పరిధిలోని రాష్ట్రాలను సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) అప్రమత్తం చేసింది. మరో 36 గంటల్లో భద్రాచలం వద్ద గోదావరిలో నీటిమట్టం భారీగా పెరగనుందని హెచ్చరించింది. గరిష్టంగా 16 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ వరద ఉధృతి కనీసం వారం పాటు కొనసాగే అవకాశం ఉంది. -
ప్రాజెక్టులకు వరద పోటు
సాక్షి, హైదరాబాద్/ నెట్వర్క్: భారీ వర్షాలతో తెలంగాణ తడిచి ముద్దవుతోంది. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అనేక జిల్లాల్లో వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. కొన్నిచోట్ల చెరువులకు గండ్లు పడ్డాయి. ఎగువ నుంచి వస్తున్న వరదకు తోడు ఉప నదులు పోటెత్తడంతో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రాజెక్టులకు వరద అంతకంతకూ పెరుగుతోంది. దీంతో కొన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కొన్నిచోట్ల వరద రోడ్లపై నుంచి ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. పత్తి, సోయా పంటలకు నష్టం వాటిల్లింది. పలు ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోయాయి. పెద్దపల్లి–భూపాలపల్లి జిల్లాల మధ్య రాకపోకలు బంద్ ఉమ్మడి వరంగల్‌లో మున్నేరు, చలివాగులతో పాటు పలు వాగులు పొంగిపొర్లుతున్నాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, కలెక్టరేట్ కార్యాలయాల్లో టోల్ ఫ్రీ నంబర్లు, కంట్రోల్‌రూమ్‌లను ఏర్పాటు చేశారు. కాకతీయ వైభవ సప్తాహం వేడుకలను వాయిదా వేశారు. జనగామ జిల్లాలో రామవరం చెరువు మత్తడి పోస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం– పెద్దపల్లి జిల్లా మంథని రహదారిలోని మల్హర్ మండల పరిధిలో గల బొమ్మారపు వాగు లోలెవల్ కాజ్వే పై నుంచి ఉధృతంగా ప్రవహించడంతో ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు పెద్దపల్లి–భూపాలపల్లి జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మల్హర్ మండలంలోని రుద్రారం చెరువు పూర్తిగా నిండి కట్టపై నుంచి నీరు ప్రహించింది. సంగారెడ్డి, సిద్దిపేట, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. వాగులో చిక్కుకున్న 500 గొర్రెలు మల్హర్ మండలం కొయ్యూరు బొమ్మరాపు వాగులో 500 పైగా గొర్రెలు చిక్కుకుపోయాయి. 80 గొర్రెలు కొట్టుకుపోగా పోలీసులు గ్రామస్తుల సహకారంతో మిగతావాటిని ఒడ్డుకు చేర్చారు. ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని వెంగ్లాపూర్ సమీపంలో హైదారాబాద్ నుంచి మేడారం వెళ్తున్న భక్తుల వాహనం వరదలో చిక్కుకుంది. స్థానికులు వారిని రక్షించి బయటకు తీసుకువచ్చారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో అత్యధికంగా 21.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మాక్లూర్ మండలం మెట్పల్లి వద్ద కాచకుంట చెరువు కట్ట తెగింది. జక్రాన్‌పల్లి మండలం కేశ్‌పల్లి కొత్తకుంట చెరువుకు గండి పడింది. కామారెడ్డి జిల్లాలో రెండిళ్లు పూర్తిగా, 74 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. విద్యుద్ఘాతంతో ఒకరి మృతి ఇల్లు ఉరుస్తోందని ఇంటిపై ప్లాస్టిక్ కవర్ కప్పేందుకు యత్నిస్తుండగా నిజాంసాగర్ మండలం అచ్చంపేటలో సాయిలు (45) అనే వ్యకిŠత్ విద్యుదాఘాతంతో మృతిచెందాడు. లక్ష్మీబ్యారేజీ వద్ద దిగువకు తరలిపోతున్న వరద నీరు లక్ష్మీ బ్యారేజీకి 10 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కాళేశ్వరం వద్ద గోదావరి 12.7 మీటర్ల ఎత్తులో ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీలకు వరద పోటెత్తింది. లక్ష్మీ బ్యారేజీకి 10.25 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, మొత్తం 85 గేట్లు ఎత్తి అదేస్థాయిలో వరదను దిగువకు వదులుతున్నారు. సరస్వతి బ్యారేజీ వద్ద 3,55,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, 66 గేట్లకు 50 గేట్లెత్తి అదే స్థాయిలో దిగువకు వదులుతున్నారు. ఎస్సారెస్పీకి ఒక్కరోజే 28 టీఎంసీలు నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని శ్రీరాంసాగర్ జలాశయంలోకి ఆదివారం రాత్రికి ఎగువ నుంచి 4,47,765 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (90 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 1,086.7 అడుగుల (72.26 టీఎంసీలు) నీరుంది. ఆదివారం ఒక్కరోజే 28 టీఎంసీల నీరు చేరడం గమనార్హం. ఎగువన వర్షాలు కురుస్తుండడంతో ముందు జాగ్రత్తగా 9 వరద గేట్లను ఎత్తి 25 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్ల నుంచి దిగువకు వరద నీరు నేడు నిండే అవకాశం ఎస్సారెస్పీ ఎగువన ఉన్న మహారాష్ట్రలోని బాబ్లి, బాలేగావ్, నిర్మల్ జిల్లాలోని గెడ్డన్న, సుద్దవాగు ప్రాజెక్టులు నిండడంతో నీరు భారీగా వస్తోంది. మహారాష్ట్రలోని గైక్వాడ్, విష్ణుపురి ప్రాజెక్టులు నిండి గేట్లు ఎత్తితే ఇన్‌ఫ్లో భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇన్‌ఫ్లో పెరిగితే సోమవారం జలాశయం పూర్తిస్థాయిలో నిండే అవకాశముందని భావిస్తున్నారు. కాగా కామారెడ్డి జిల్లాలోని పోచారం, కౌలాస్ ప్రాజెక్టులు పూర్తిగా నిండి అలుగులు పారుతున్నాయి. సింగితం రిజర్వాయర్, కల్యాణి ప్రాజెక్టులు ఉప్పొంగుతున్నాయి. 531 చెరువులు నిండి అలుగులు పారుతున్నాయి. పొంగి పొర్లుతున్న పోచారం సంగారెడ్డి జిల్లా సింగూరు జలాశయానికి ఐదు వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. కల్హేర్ మండలంలోని నల్ల వాగు ప్రాజెక్టు పూర్తిగా నిండటంతో గేట్లను పైకెత్తి నీటిని కిందికి వదిలారు. మెదక్ జిల్లా హల్దీ, ఘనపూర్ ప్రాజెక్టుల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుండగా పోచారం ప్రాజెక్టు మాత్రం పొంగిపొర్లుతోంది. భద్రాచలం వద్ద పెరుగుతున్న నీటిమట్టం ఎల్లంపల్లి, కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన బ్యారేజీల గేట్లు ఎత్తేయడంతో సమ్మక్క బ్యారేజీ వద్దకు ఆదివారం ఉదయానికి తొమ్మిది లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం చేరింది. అంతే ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తుండటంతో భద్రాచలం వద్ద గంట గంటకూ వరద నీటిమట్టం పెరుగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు నీటిమట్టం 38 అడుగులు దాటింది. ఇక్కడ 43 అడుగల మేరు నీరు వస్తే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. రాత్రి 10 గంటల వరకు ఆ మేరకు నీటి మట్టం పెరగవచ్చని సీడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్ నీటి మట్టం 19.4 అడుగులకు, పాలేరు రిజర్వాయర్ నీటిమట్టం 17.50 అడుగులకు చేరింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పత్తి పంటలు నీట మునిగిపోయాయి. సింగరేణి వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం వాటిల్లింది. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని రిజర్వాయర్ నాలుగు గేట్లు ఎత్తి 21 వేల క్యూసెక్కుల నీటిని, తాలిపేరు ప్రాజెక్టు 16 గేట్లు ఎత్తి 20,792 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ఎగువ నుంచి భారీ వరదను దిగువకు వదిలేస్తున్న నేపథ్యంలో సోమవారం నాటికి పోలవరం ప్రాజెక్టు వద్దకు పది లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆలమట్టికి వరద కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో కృష్ణా, దాని ఉప నదుల్లో ప్రవాహం పెరిగింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 91 వేల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. నీటి నిల్వ 82.84 టీఎంసీలకు చేరుకుంది. వరద ప్రవాహం ఇదే రీతిలో కొనసాగితే మంగళవారం రాత్రికి తుంగభద్ర డ్యామ్ గేట్లు ఎత్తేసే అవకాశం ఉంది. ఆలమట్టి ప్రాజెక్టుకు 75,149 క్యూసెక్కులు, నారాయణపూర్ ప్రాజెక్టుకు 18,526 క్యూసెక్కుల వరద ఉండగా.. ఈ రెండు ప్రాజెక్టులు నిండితే జూరాలకు నీటిని వదులుతారు. ప్రస్తుతం జూరాలకు 872 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. మూసీ ప్రాజెక్టు గేట్లు ఐదు ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. -
16 ‘ఎత్తిపోతల’కు కార్యాచరణ!
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు కృష్ణా జలాలు అందించేవిధంగా కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగా 16 ఎత్తిపోతల పథకాల పనులకు శ్రీకారం చుట్టే దిశగా అడుగులు పడుతున్నాయి. వీటి తుది అంచనాలకు సైతం ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్యాచరణపై సీఎం కేసీఆర్ ఇంజనీర్లకు మార్గదర్శనం చేయనున్నారు. ఆగస్టు 2న నాగార్జునసాగర్ నియోజకవర్గం లోని హాలి యాలో పర్యటించనున్న సీఎం టెండర్లు, నిధుల సమీకరణ, కార్యాచరణ ప్రణాళికపై ఇంజనీర్లకు కీలక ఆదేశాలివ్వనున్నారు. సీఎం పర్యటన తర్వాత టెండర్లు మిర్యాలగూడ, దేవరకొండ, నకిరేకల్, నాగార్జునసాగర్, హజూర్‌నగర్, సూర్యా పేట, కోదాడ నియోజకవర్గాల్లో 1.70 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరందించేలా రూ.3,691 కోట్లతో ఈ ఎత్తిపోతల పథకాలను చేపట్టనున్నారు. ఇందులో నెల్లికల్ కింద 24,886 ఎకరాల ఆయకట్టుకు నీళ్లిచ్చేలా రూ.692 కోట్లు, ముక్త్యాల కింద 53 వేల ఎకరాలకు నీరిచ్చేలా రూ.1,480 కోట్లు, దున్నపోతలగండి 12,239 ఎకరాలకు నీరిచ్చేలా రూ.219.90 కోట్లు, బోతలపాలెంతో 8,610 ఎకరాలకు నీరిచ్చేలా రూ.229.25 కోట్లు, జాన్‌పహడ్ కింద 5,650 ఎకరాలకు నీరిచ్చేలా రూ.185 కోట్లతో చేపట్టే ఎత్తిపోతల పథకాలకు ఇప్పటికే అంచనాలు సిద్ధమయ్యాయి. ఈ పథకాలన్నింటికీ ఏకకాలంలో టెండర్లు పిలిచి నెల రోజుల్లో పనులు మొదలు పెట్టాలని గత నెల సమీక్ష సందర్భంగానే ముఖ్యమంత్రి సూచించినప్పటికీ టెండర్ల ప్రక్రియ ముందుకెళ్లలేదు. 1.70 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరందించేలా రూ.3,691 కోట్లతో ఈ ఎత్తిపోతల పథకాలను చేపట్టనున్నారు. ఇందులో నెల్లికల్ కింద 24,886 ఎకరాల ఆయకట్టుకు నీళ్లిచ్చేలా రూ.692 కోట్లు, ముక్త్యాల కింద 53 వేల ఎకరాలకు నీరిచ్చేలా రూ.1,480 కోట్లు, దున్నపోతలగండి 12,239 ఎకరాలకు నీరిచ్చేలా రూ.219.90 కోట్లు, బోతలపాలెంతో 8,610 ఎకరాలకు నీరిచ్చేలా రూ.229.25 కోట్లు, జాన్‌పహడ్ కింద 5,650 ఎకరాలకు నీరిచ్చేలా రూ.185 కోట్లతో చేపట్టే ఎత్తిపోతల పథకాలకు ఇప్పటికే అంచనాలు సిద్ధమయ్యాయి. ఈ పథకాలన్నింటికీ ఏకకాలంలో టెండర్లు పిలిచి నెల రోజుల్లో పనులు మొదలు పెట్టాలని గత నెల సమీక్ష సందర్భంగానే ముఖ్యమంత్రి సూచించినప్పటికీ టెండర్ల ప్రక్రియ ముందుకెళ్లలేదు. ఎస్సారెస్పీ స్టేజ్–2 పనులకు.. సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజక వర్గంలోని చివరి ఆయకట్టు వరకు గోదావరి నీటిని పారించేలా శ్రీరాంసాగర్ రెండోదశ (స్టేజ్–2) కాల్వలను పూర్తిస్థాయిలో లైనింగ్ చేసి ఆధునీకరించే పనులకు సీఎం పర్యటనలో మోక్షం లభించే అవకాశముంది. రూ.400 కోట్లతో స్టేజ్–2 పరిధిలోని ప్రధాన డిస్ట్రిబ్యూటరీలన్నింటినీ ఆధునికీకరించేలా ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. డీబీఎం–69 కాల్వల లైనింగ్‌ను రూ.54 కోట్లు, డీబీఎం–70 కాల్వల లైనింగ్‌ను రూ.12 కోట్లు, డీబీఎం–71 లైనింగ్‌కు రూ.159 కోట్లతో ప్రతిపాదించగా, వీటితోపాటే ఈ డిస్ట్రిబ్యూటరీల కింది పిల్ల కాల్వలు, ఇతర చిన్న కాల్వల లైనింగ్ పనులను మరో రూ.175 కోట్లతో ప్రతిపాదించారు. వీటిపై సీఎం సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేసే అవకాశముంది. -
గలగలా గోదారి కదిలి వచ్చింది
సాక్షి, సిద్దిపేట : ‘తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా చూడాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయం నెరవేరే రోజులు ఎంతో దూరంలో లేవు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎస్సారెస్పీకి అదనంగా నీరు ఇవ్వగలిగాం. నిజాంసాగర్‌ను పూర్తి చేసుకుంటున్నాం. అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్లు పూర్తయ్యాయి. సీతారామ, పాలమూరు ప్రాజెక్టులు కూడా పూర్తయితే రాష్ట్రంలోని 46 వేల చెరువుల్లో జలకళ ఉట్టిపడు తుంది. సాగునీటి కోసం ఇబ్బందిపడ్డ రైతుల కష్టాలు తీరి దేశానికే ఆదర్శవంతమైన వ్యవ సాయ కేంద్రంగా తెలంగాణ విరాజిల్లుతుంది’ అని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి తారక రామారావు అన్నారు. మూడు టీఎంసీల సామర్థ్యం, 1,10,718 ఎకరాలకు సాగునీరు అందించేలా సిద్దిపేట జిల్లా చంద్లాపూర్‌లో నిర్మించిన శ్రీ రంగనాయకసాగర్ రిజర్వాయర్‌ను శుక్రవారం మంత్రులు హరీశ్, కేటీఆర్ ప్రారంభించారు. తొలుత రంగనాయకసాగర్ కొండపై ఉన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కేటీఆర్, హరీశ్‌రావు అక్కడి నుంచి పంప్‌హౌస్ వద్దకు చేరుకొని పంపులను స్విచ్ ఆన్ చేశారు. దాదాపు 10 నిమిషాల వ్యవధిలో రంగనాయకసాగర్‌లోకి వచ్చిన గోదావరికి మంత్రులు, ఇతర ప్రజాప్రతినిదులు పసుపు, కుంకుమలు విడిచిపెట్టి స్వాగతం పలికారు. పంప్హౌస్లోంచి నీరు పైకి ఎగసిపడే క్రమంలో కేటీఆర్, హరీశ్‌పైనా నీరు చిమ్మడంతో వారు తడిసి ముద్దయ్యారు. అనంతరం గుట్టపై ఉన్న విశ్రాంతి భవనం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రంగనాయకసాగర్ రిజర్వాయర్‌లోకి చేరుతున్న గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు చేస్తున్న మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు భగీరథుడికన్నా గొప్పగా... ఆకాశంలో ఉన్న గంగను భూమికి తీసుకొచ్చిన భగీరథుడి గురించి అందరం చెప్పుకుంటామని, కానీ భూమిపై ఉన్న గోదావరిని ఎత్తైన ప్రదేశంలోకి తీసుకొచ్చి కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తున్న సీఎం కేసీఆర్ భగీరథునికన్నా గొప్ప అన్పించుకున్నారని మంత్రి కేటీఆర్ కొనియాడారు. మెతుకుసీమగా పిలిచే ఉమ్మడి మెదక్ జిల్లా పేరే మెతుకు అనే పేరు నుంచి వచ్చిందని, గోదావరి జలాలు ఉమ్మడి మెదక్ జిల్లాను ముద్దాడిన తర్వాత మొత్తం తెలంగాణకు బువ్వపెట్టే జిల్లాగా కావాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. నీటివనరులు పెరిగితే ప్రజల జీవన విధానంలో మార్పు వస్తుందన్నారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. చదవండి: తెలంగాణకు కేంద్ర బృందం నాలుగు విప్లవాల ద్వారా ఆర్థిక అభివృద్ధి దశలవారీగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తవుతోందని, రాబోయే రోజుల్లో నాలుగు రకాల విప్లవాల ద్వారా తెలంగాణ గ్రామీణ వ్యవస్థ ఆర్థికంగా బలోపేతం అవుతుందని, దేశానికే ఆదర్శంగా నిలస్తుందని కేటీఆర్ చెప్పారు. నీటి వసతులతో ఈ విప్లవాలు అనుబంధంగా ఉంటాయని చెప్పారు. కోటి ఎకరాల మాగాణిగా తెలంగాణ ఆవిర్భవిస్తుందన్నారు. దీంతో రెండో హరిత విప్లవానికి నాంది పలుకుతుందని చెప్పారు. చెరువులు, కుంటల్లో నీరు సంమృద్ధిగా ఉంటే మత్స్య పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని, దీంతో నీలి విప్లవం వస్తుందన్నారు. అదేవిధంగా పంటలు పండి, పచ్చటి చేలు, గడ్డితో పల్లెలు ఆహ్లాదకరంగా ఉంటే పాడిపరిశ్రమ అభివృద్ధి చెందుతుందని, దీంతో శ్వేత విప్లవం వస్తుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని గొల్ల కురుమలకు గొర్రెలు పంపిణీ చేశామని, దీంతో మాంసం ఉత్పత్తులు పెరుగుతున్నాయని, ఈ పెరుగుదల పింక్ రివల్యేషన్కు చిహ్నమన్నారు. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో సంపద పెరుగుతుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. సర్జికల్ పంప్‌హౌస్‌లో రెండో మోటార్‌ను ప్రారంభిస్తున్న హరీశ్, కేటీఆర్. చిత్రంలో కలెక్టర్ వెంకట్రామిరెడ్డి హరీశ్‌రావు చరిత్ర తిరగరాశారు... ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా మంత్రి హరీశ్‌రావు పనిచేసి చరిత్ర తిరగరాశారని కేటీఆర్ కొనియాడారు. గతంలో భారీ నీటిపారుదలశాఖ మంత్రిగా రేయింబయళ్లు పనిచేసి ప్రాజెక్టుల పనులను పరుగులు పెట్టించారన్నారు. రాజకీయంగా ఆదరించిన సిద్దిపేట అంటే ముఖ్యమంత్రికి ఎంతో ఇష్టమని, సీఎం తర్వాత సిద్దిపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా నిలిపి హరీశ్‌రావు సమర్థతను రుజువు చేసుకున్నారన్నారు. నాయనమ్మ, అమ్మమ్మ ఊర్లు మునిగాయి.. ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు, గ్రామాలను త్యాగం చేసిన నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిదని కేటీఆర్ కొనియాడారు. ఇతర పార్టీల వారికి నిర్వాసితుల బాధ తెలియదని విమర్శించారు. ఎగువ మానేరు నిర్మాణం సందర్భంగా తన నాయనమ్మ గ్రామం దొమకొండ మండలం పూసాన్పల్లి మనిగిపోయిందని, మధ్యమానేరు నిర్మాణంలో అమ్మమ్మ గ్రామం కొదురుపాక మునిగిపోయిందని కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. రాష్ట్రంలో మేజర్ కాల్వల నిర్మాణం పూర్తయిందని, ఏ గ్రామానికి ఆ గ్రామ పెద్దలు కథానాయకులుగా మారి చిన్న కాల్వల నిర్మాణంలో ఉద్యమ స్ఫూర్తి చాటాలని పిలుపునిచ్చారు. అసాధ్యమన్న పనులు సుసాధ్యం.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తుంటే అందరూ అసాధ్యమని విమర్శలు చేశారని, కానీ అసాధ్యమన్న పనులను సుసాధ్యం చేసి రైతులకు నీరు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సముద్ర మట్టానికి 90 మీటర్ల ఎత్తులో ఉన్న మేడిగడ్డ వద్ద పారే గోదావరిని 490 మీటర్ల ఎత్తులో ఉన్న రంగనాయకసాగర్‌కు, 618 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపొచమ్మ సాగర్ వరకు పంపింగ్ చేయవచ్చని రుజువు చేశారన్నారు. కరవు కాటకాలకు నిలయంగా ఉన్న తెలంగాణలో సాగునీటి అవసరాన్ని గుర్తించిన సీఎం... ఇంజనీర్‌గా పనిచేయడంతోపాటు అందరితో పని చేయించారన్నారు. గతంలో ప్రాజెక్టుల నిర్మాణమంటే 3–4 దశాబ్దాల కాలం పట్టేదని, కానీ సీఎం కేసీఆర్ పట్టుదలతో పనిచేయించి మూడున్నర సంవత్సరాల్లోనే పనులు పూర్తి చేయించారన్నారు. కూలీలతో సహపంక్తి భోజనం చేస్తున్న మంత్రులు అన్నదాత కష్టాలు తీరేరోజు... వర్షం, బోర్లపై ఆధారపడి వ్యవసాయం చేసే రైతులకు కాలం, కరెంట్‌తో పనిలేకుండా కాల్వల ద్వారా రెండు పంటలు పండించుకునేలా సాగునీరు అందుతుందని హరీశ్‌రావు చెప్పారు. అప్పులు చేసి బోర్లు వేసి బోర్లాపడ్డ రైతులు వలసలు, ఆత్మహత్యలు చేసుకునేవారిని గుర్తుచేశారు. వర్షం ఎప్పుడొస్తుందో అని మోగులు చూసే రైతులకు గోదావరి జలాలు ఈ నేలను ముద్దాడడాన్ని చూసి సంబుర పడిపోతున్నారన్నారు. గోదావరి జలాల ద్వారా చెరువులు, కుంటలు నింపితే భూగర్భ జలాలు కూడా పెరుగుతాయన్నారు. ఉపరితల నీటివనరుల ద్వారా వ్యవసాయం చేస్తే తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వస్తుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారన్నారు. నీరు అభివృద్ధికి సూచిక అని, నీటివనరులు పెరిగితే మానవ మనుగడలో మార్పు వస్తుందన్నారు. ‘‘ఎకానమే కాకుండా ఎకాలజీ’’లో కూడా మార్పు వస్తుందని చెప్పారు. నా జన్మ చరితార్థం... తెలంగాణ ఉద్యమకాలంలో ఉద్యమ నేత వెంట ఉండి పనిచేయడం, దేశంలోనే మహోన్నత ఘట్టం కాళేశ్వరం జలాలు సిద్దిపేట జిల్లాను ముద్దాడే కార్యక్రమంలో భాగస్వామ్యం అయినందుకు తన జన్మ చరితార్థం అయిందని హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రం ఏర్పాటు ప్రకటన వచ్చిన రోజు ఎంత సంతోషం కలిగిందో రంగనాయకసాగర్ నీటిని విడుదల చేసినప్పుడూ అంతే సంతోషం కలిగిందన్నారు. చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచే ఈ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ సమక్షంలో లక్షల మంది మధ్య జరుపుకోవాల్సి ఉండేదని, కానీ కరోనా వైరస్‌తో తక్కువ మందితో జరుపుకుంటున్నామన్నారు. గోదావరి జలాలు రంగనాయకసాగర్‌లో పారుతుంటే ఆ జలాల్లో రైతులు పండించబోయే ధాన్యం సిరులు కన్పిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, బి.వెంకటేశ్వర్లు, కూర రఘోత్తంరెడ్డి, అంచనాల కమిటీ చైర్మన్ సొలిపేట రామలింగారెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఒడితల సతీష్ కుమార్, రసమయి బాలకిషన్, రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, గ్యాదరి బాలమల్లు, ఓఎస్డీ దేశపతి శ్రీనివాసరావు, లిఫ్ట్ ఇరిగేషన్ రాష్ట్ర సలహాదారులు పెంటారెడ్డి, కాళేశ్వరం ఈఎన్సీ హరిరాం, సిద్దిపేట, సిరిసిల్ల కలెక్టర్లు వెంకట్రామిరెడ్డి, కృష్ణ భాస్కర్, జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ తదితరులు పాల్గొన్నారు. చదవండి: పట్టణం నుంచి పల్లెకు మహా పయనం -
కందుల దిగుమతి నిలిపివేయాలి
సాక్షి, హైదరాబాద్ : కందుల దిగుమతి నిలిపివేయా లని కోరుతూ కేంద్రానికి లేఖ రాయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన అధికారులతో వివిధ అంశాలపై సమీక్షిం చారు. కందులను కేంద్రం ఇతర దేశాలనుంచి దిగు మతి చేసుకుంటుందన్నారు. రాష్ట్రంలో కొన్న కందు లను మార్కెట్లోకి పూర్తిగా విడుదల చేశాకే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలన్నారు. దీనిపై కేంద్రానికి లేఖ రాయాలని ఆయన ఆదేశించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి, మొక్క జొన్న, జొన్న వంటి పంటల మద్దతు ధరలను ప్రభుత్వం వెంటనే చెల్లిస్తోందన్నారు. రైతుల నుంచి రూ. 5,618 కోట్ల విలువైన వడ్లను కొనుగోలు చేసి పూర్తిగా చెల్లింపులు చేసినట్లు మంత్రి చెప్పారు. కందులను రూ.1,427 కోట్లతోకొని, రూ.1,420 కోట్లు చెల్లింపులు చేశామన్నారు. మిగిలిన రూ.7.33 కోట్లు రెండు రోజుల్లో చెల్లించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి శనగలు రూ.294 కోట్లతో కొనుగోలు చేస్తే రూ.265 కోట్లు చెల్లింపులు జరిగాయన్నారు. మిగిలిన మొత్తాన్ని రెండు రోజుల్లో రైతులకు చెల్లించాలని నాఫెడ్, మార్క్‌ఫెడ్ అధికారులను ఆదేశించారు. మొక్కజొన్న రూ.629 కోట్లతో రైతుల నుంచి కొనుగోలు చేసి, రూ.611 కోట్లు చెల్లింపులు చేశామని తెలిపారు. మిగిలిన రూ.18 కోట్లు రెండు మూడు రోజుల్లో చెల్లించాలన్నారు. జూలై రెండో వారానికి పూర్తిచేయాలి ఎస్సారెస్పీ స్టేజ్–1 పనులను జూలై రెండో వారానికి పూర్తి చేయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన సచివాలయంలో ఎస్సారెస్పీ స్టేజ్–1, స్టేజ్–2 పనులు, ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తొలి ఫలితం అందుకునేది ఎస్సారెస్పీ ప్రాజెక్టేనని మంత్రి చెప్పా రు. సీఎం ఆదేశాల మేరకు రాత్రింబవళ్ళు కష్టపడి పనులు పూర్తి చేయాలన్నారు. పూర్తి ఆయకట్టుకు, ఆయకట్టులోని చివరి పొలాలకు నీరు అందించాలని, ఆ దిశగా ఇంజనీర్లు పని చేయాలన్నారు. ఎస్సారెస్పీ కింద రబీలో ఏప్రిల్, మే నెలలోనూ నీరు ఇవ్వడం వల్ల పనిలో కొంత జాప్యం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి క్రిటికల్ వర్క్, స్ట్రక్చర్ నిర్మాణంపై దృష్టి పెట్టాలన్నారు. కాకతీయ కాలువ పనులు నాణ్యతతో చేయాలన్నారు. షట్టర్స్ పనులు, నాణ్యతను ఈఈలు ఎప్పటికప్పుడు పరిశీలించాల న్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఈఎన్సీలు మురళీధర్, అనిల్ కుమార్lతదితరులు పాల్గొన్నారు. -
పునరుజ్జీవ’ పథక మోటార్లను పరిశీలించిన ఇంజనీర్లు
సాక్షి, హైదరాబాద్: ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో వినియోగించనున్న మోటార్ల తయారీ, పనితీరును చైనా వెళ్లిన రాష్ట్ర ఇంజనీర్ల బృందం గురువారం పరిశీలించింది. నిర్ణీత ప్రామాణికాల మేరకు పంపుల తయారీ ఉన్నదీ లేనిదీ తనిఖీ చేసింది. ఈఎన్సీ అనిల్‌కుమార్, ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి, తెలంగాణ జెన్కో ఇంజనీర్ వాసుదేవ్ చైనాలోని వుషి నగరంలో ఎస్ఈసీ కంపెనీలో తయారవుతున్న వర్క్‌షాప్‌ను రెండు గంటల పాటు పరిశీలించారు. మోటారు పనితీరు సంతృప్తికరం గా, డిజైన్ స్పెసిఫికేషన్ల ప్రకారమే ఉన్నాయని పెంటారెడ్డి పేర్కొన్నారు. జూలై చివరి వరకు కనీసం మూడు పంపులు బిగించి నీటిని తోడవలసిన పరిస్థితి ఉందని, దానికి అనుగుణంగా పంపులు మోటార్ల సరఫరా జరగాలని పెంటారెడ్డి కంపెనీ ప్రతినిధులకు స్పష్టం చేశారు. మోటార్లు, పంపుల బిగింపు సమయంలో కంపెనీ ప్రతినిధులు తప్పనిసరిగా ఉండాలని వారికి సూచించారు. వీటి సరఫరా తేదీలను నిర్ధారించాలని కోరారు. సాయంత్రం 6 గంటల వరకు అనేక సాంకేతిక అంశాలపై కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపామని అనిల్, పెంటారెడ్డి పేర్కొన్నారు. రెండు పంపు హౌస్‌లలో బిగించడానికి 6 మోటార్లు సిద్ధంగా ఉన్నాయని, జూన్ చివరికల్లా ప్రాజెక్టు ప్రదేశానికి వాటిని చేరుస్తామని కంపెనీ ప్రతినిధులు హామీ ఇచ్చినట్లు పెంటారెడ్డి తెలిపారు. -
‘టోల్’ తీస్తున్నారు
బాల్కొండ : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ సందర్శనకు వస్తున్న పర్యాటకులు ప్రాజెక్ట్ వద్ద పార్కు నిర్వాహకుల దోపిడిని చూసి శ్రీరామా.. ఇదేమీ దోపిడి అంటు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ సందర్శనకు రావాలంటే జంకుతున్నారు. శ్రీరాంసాగర్‌ప్రాజెక్ట్ పర్యాటక అభివృద్ధిలో భాగంగా గత నాలుగేళ్ల క్రితం 6 కోట్ల నిధులతో పార్కు నిర్మించారు. పార్కు నిర్వహణనను యువజన సంఘాల పేరుతో అధికార పార్టీ నేతలు దక్కించుకున్నారు. ప్రాజెక్ట్ సందర్శనకు వస్తున్న పర్యాటకుల వద్ద పార్కింగ్ వసూలు కోసం కౌంటర్ ఏర్పాటు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం పార్కు నిర్వహణ చేపడుతూ.. పార్కు సందర్శనకు వచ్చే పర్యాటకుల వద్ద నిర్ణయంచిన రుసుం ప్రకారం టికెట్ తీసుకోవాలి. కాని ప్రాజెక్ట్ సందర్శనకు వస్తున్న ప్రతి పర్యాటకుని వద్ద వాహనాలకు పార్కింగ్ ఫీజు పేరిట ద్విచక్ర వాహనానికి 10 రూపాయాలు, కారులకు 20 రూపాయాల చొప్పున వసూలు చేస్తున్నారు. దీంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. స్థానికులనూ వదలడం లేదు... శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద నుంచే సోన్‌పేట్ గ్రామస్తులు రాకపోకలు సాగిస్తుంటారు. అంతే కాకుండా లెఫ్ట్ పోచంపాడ్ వాసులు ఎస్సారెస్పీ డ్యాం పై నుంచే వెళ్లాలి. వాళ్లను కూడా వదలకుండా టోల్ వసూలుకు పాల్పడుతున్నారు. ఫలాన గ్రామం అని చెప్పినా వినకుండా వాహనాలను ఆపుతున్నారు. గ్రామ నివాసి అని గుర్తింపు కార్డు చూపాలంటున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేదే దోపిడి దానికి గుర్తింపు కార్డులు చూపాలనడం విడ్డూరంగా ఉందని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. ఫోటోలకూ ఫీజు వసూలు..! పార్కు ఎంట్రీ ఫీజుకు తోడు పార్కులో ఫోటోలు దిగాలంటే నిర్వహకులకు 350 రూపాయాల నుంచి 500 రూపాయాలు సమర్పించుకుంటేనే ఫోటోలు దిగే అవకాశం ఇస్తారు. ఈ విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు పోయినా ప్రయోజనం లేదని పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అధికారులు వారికి అండగా ఉంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి దోపిడిని అరికట్టాలని పర్యాటకులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నోటీసులు అందించాం: శ్రీనివాస్‌రెడ్డి,ఎస్ఈ శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద పార్కులో వసూళ్లకు పాల్పడుతున్నారని దృష్టికి రావడంతో నిర్వహకులకు నోటీసులను జారీ చేశాం. వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటాం. -
తెలంగాణ ప్రజలకు వరం.. ఎస్సారెస్పీ
ఎంపీలు కవిత, వినోద్‌కుమార్ జగిత్యాల: ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రజలకు వరంలాంటిదని, గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఎస్సారెస్పీ కాలువల ద్వారా నీరు తగ్గుముఖం పట్టిందని నిజామాబాద్, కరీంనగర్ ఎంపీలు కవిత, వినోద్‌కుమార్ అన్నారు. జగిత్యాలలో ఆదివారం విలేక రులతో మాట్లాడారు. 20 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వాలు 365 రోజులు కాకతీయ కాలువను తవ్వి సూర్యాపేట జిల్లా వరకు తీసుకువెళ్లారని, సరైన రూపకల్పన లేకపోవడంతో ఒక ఎకరాకు నీళ్లు అందలేదన్నారు. ఈ పరిస్థితిని గుర్తించిన సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను రీడిజైన్ చేసి ప్రాణహిత–చేవెళ్ల వద్ద ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసి అన్ని జిల్లాలకు నీరందించేందుకు కృషిచేస్తు న్నారని చెప్పారు. ఈనెల 10న పోచంపాడ్ వద్ద సీఎం ప్రజలకు సందేశం ఇచ్చేలా సభ ఏర్పాటుచేశామని తెలిపారు.