
సాధారణంగా వారసులు ఇండస్ట్రీలోకి రావడం చాలా కామన్. అలా ఇప్పటివరకు ఎంతోమంది నటీనటులు తమ వారసుల్ని తెలుగు తెరకు పరిచయం చేశారు. ఇప్పుడు మరో సీనియర్ నటుడు వినోద్ కుమార్ తన కొడుకును పరిచయం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. 'మౌన పోరాటం' సినిమాతో హీరోగా పరిచయం అయిన వినోద్‌కుమార్ అతి తక్కువ సమయంలోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 'సీతారత్నంగారి అబ్బాయి', 'మామగారు' వంటి సూపర్ హిట్ సినిమాలతో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా చేరువయ్యాడు.
తాజాగా తన పెద్ద కొడుకు టాలీవుడ్ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. త్వరలోనే అతడు తెరంగేట్రం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే యాక్టింగ్, మార్షల్ ఆర్ట్స్ వంటి వాటిల్లో శిక్షణ తీసుకుంటున్నాడని, కన్నడ ఇండస్ట్రీ నుంచి అవకాశాలు వస్తున్నప్పటికీ.. తెలుగు సినిమాతోనే ఎంట్రీ ఇవ్వాలనే ఉద్దేశంతో వెయిట్ చేస్తున్నారని చెప్పారు. మంచి కథ దొరికితే అతి త్వరలో అతడి ఎంట్రీ ఉంటుందని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment