సాక్షి, కరీంనగర్: బీఆర్‌ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్.. బీజేపీ ఎంపీ బండి సంజయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటిపేరు ఒకటైతే బంధువులు అవుతారా? అని ప్రశ్నించారు. బండి సంజయ్ తనపై బీజేపీ కార్యకర్తలతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని సీరియస్ అయ్యారు.
కాగా, వినోద్ కుమార్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. జెన్కో ప్రభాకర్‌రావు ఉద్యోగం ఇచ్చిన బోయినపల్లి సరితకు నాకు ఎలాంటి సంబంధం లేదు. దీనిని బీజేపీ, కాంగ్రెస్ విస్తృత ప్రచారం చేశారు. ఇంటి పేరు ఒకటైతే బంధువులు అవుతారా?. అలాగైతే ప్రధాని మోదీ, నీరవ్ మోదీలు బంధువులా?. నా 22 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను ఏనాడూ తప్పులను ప్రోత్సహించలేదు. చట్ట వ్యతిరేక పని చేయమని చెప్పను. బండి సంజయ్ కావాలనే నాపై బీజేపీ కార్యకర్తలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గోబెల్స్ ప్రచారం ఆపాలి. ఆ అమ్మాయి నా బంధువు అని రుజువు చేయగలరా?’ అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment