సాక్షి, న్యూఢిలీ: హుజూరాబాద్ మీదుగా కరీంనగర్–కాజీపేట మధ్య కొత్త రైల్వే లైన్ వేయాలని రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు ఎంపీ వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఈ లైన్‌కు అయ్యే వ్యయాన్ని డిసెంబర్‌లో ప్రవేశపెట్టనున్న సప్లిమెంటరీ బడ్జెట్‌లో కేటాయించాలని పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో మంత్రిని కలిసిన వినోద్, రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పలు రైల్వే ప్రాజెక్టులు, వాటికి నిధుల కేటాయింపు, కొన్ని స్టేషన్లలో రైళ్లకు హాల్ట్ ప్రతిపాదనలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
ప్రస్తుతం ముంబై–నిజామాబాద్ మధ్య నడుస్తున్న లోక్‌మాన్య తిలక్ రైలును కరీంనగర్ వరకు పొడిగించాలని కోరారు. కరీంనగర్– తిరుపతి మధ్య వారానికి రెండు రోజులు నడుపుతున్న రైలును ప్రతిరోజూ నడపాలన్నా రు. దానాపూర్ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్–నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లకు జమ్మికుంటలో, సికింద్రాబాద్– కాగజ్‌నగర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు ఉప్పల్ స్టేషన్‌లో హాల్ట్ ఇవ్వాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment