ఏపీ సీఎం చంద్రబాబు తన సమావేశాలకు ‘సాక్షి’, ‘నమస్తే తెలంగాణ’ పత్రికా విలేకరులను ఎందుకు రానీయడం లేదని ఎంపీ వినోద్‌కుమార్ ప్రశ్నించారు.
ఏపీ సీఎం చంద్రబాబుకు ఎంపీ వినోద్ ప్రశ్న
కరీంనగర్: ఏపీ సీఎం చంద్రబాబు తన సమావేశాలకు ‘సాక్షి’, ‘నమస్తే తెలంగాణ’ పత్రికా విలేకరులను ఎందుకు రానీయడం లేదని ఎంపీ వినోద్‌కుమార్ ప్రశ్నించారు. తెల్లవారి లేచింది మొదలు పత్రికా స్వేచ్ఛ అని గొంతు చించుకొనే మేధావులకు బాబు నిర్వాకం కనిపించడం లేదా? అని అన్నారు. ఆది వారం కరీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. మెట్రోపై తెలంగాణ వ్యతిరేకులు కుట్రపన్నారని విమర్శించారు. ఎల్ అండ్ టీ ప్రభుత్వానికి రాసిందిగా చెబుతున్న లేఖ ఇప్పటిది కాదని, ఫిబ్రవరి 11న అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌కు రాసిందన్నారు.