namaste telangana
-
అడ్డగోలుగా భవనాలకు అనుమతులిచ్చి దోచుకుంటున్నారు
-
హైదరాబాద్‌కు అక్టోబర్‌లో ప్రెస్ కౌన్సిల్ కమిటీ
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు అధికారికంగా నిర్వహించిన మీడియా సమావేశాలకు సాక్షి, నమస్తే తెలంగాణ విలేకరులను అనుమతించకపోవడంపై విచారణ జరిపేందుకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ అక్టోబర్ రెండో వారంలో హైదరాబాద్‌కు రానుంది. ఈ విషయాన్ని పీసీఐ సభ్యు డు కె.అమర్నాథ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30న కమిటీ హైదరాబాద్‌లో పర్యటించాలని భావించినా వరుస సెలవుల నేపథ్యంలో పర్యటనను వచ్చే నెల రెండో వారానికి మార్చుకున్నట్లు ఆయన వివరించారు. ఏపీ సీఎం మీడియా సమావేశాలకు సాక్షి, నమస్తే తెలంగాణ పత్రికలు, సాక్షి, టీ న్యూస్ టీవీల ప్రతినిధులకు ప్రవేశం నిరాకరించిన అంశంపై విచారణ చేపట్టడానికి రాజీవ్ రంజన్‌నాగ్, కె.అమర్నాథ్, ప్రజ్ఞానంద చౌధురితో త్రిసభ్య కమిటీని పీసీఐ ఏర్పాటు చేయడం తెలిసిందే. -
‘సాక్షి’ని ఎందుకు అనుమతించరు?
ఏపీ సీఎం చంద్రబాబుకు ఎంపీ వినోద్ ప్రశ్న కరీంనగర్: ఏపీ సీఎం చంద్రబాబు తన సమావేశాలకు ‘సాక్షి’, ‘నమస్తే తెలంగాణ’ పత్రికా విలేకరులను ఎందుకు రానీయడం లేదని ఎంపీ వినోద్‌కుమార్ ప్రశ్నించారు. తెల్లవారి లేచింది మొదలు పత్రికా స్వేచ్ఛ అని గొంతు చించుకొనే మేధావులకు బాబు నిర్వాకం కనిపించడం లేదా? అని అన్నారు. ఆది వారం కరీంనగర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. మెట్రోపై తెలంగాణ వ్యతిరేకులు కుట్రపన్నారని విమర్శించారు. ఎల్ అండ్ టీ ప్రభుత్వానికి రాసిందిగా చెబుతున్న లేఖ ఇప్పటిది కాదని, ఫిబ్రవరి 11న అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌కు రాసిందన్నారు. -
సాక్షి, నమస్తే తెలంగాణలనే ఎందుకు అడ్డుకుంటున్నారు?
కరీంనగర్: ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ అవసరమని కరీంనగర్ ఎంపీ, టీఆర్ఎస్ నాయకుడు బి.వినోద్‌కుమార్ అన్నారు. ఆదివారం కరీంనగర్లో వినోద్ కుమార్ మాట్లాడుతూ... మీడియాపై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరీపై మండిపడ్డారు. పత్రికా స్వేచ్ఛ గురించి బాగా మాట్లాడే చంద్రబాబు... నమస్తే తెలంగాణ, సాక్షి మీడియాను ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏదైనా విషయం జరిగితే గోరంతను కొండంతలుగా రాసే వారు చంద్రబాబు తీరును ఎందుకు ఎండగట్టడం లేదని ప్రశ్నించారు. అక్టోబర్‌లో టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తామని వినోద్ కుమార్ చెప్పారు. -
‘సాక్షి’కి ఆంక్షలపై జోక్యం చేసుకోండి
ప్రెస్ కౌన్సిల్‌కు ఏపీయూడబ్ల్యూజే, ఐజేయూ, టీయూడబ్ల్యూజే విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం నారా చంద్రబాబు నిర్వహించే విలేకరుల సమావేశాలకు ‘సాక్షి’ దినపత్రిక, టీవీ చానల్, నమస్తే తెలంగాణ దినపత్రిక, టీ న్యూస్ చానల్‌ను అనుమతించకపోవడంపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తక్షణమే జోక్యం చేసుకోవాలని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ), దాని అనుబంధ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (ఏపీయూడబ్ల్యూజే), తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (టీయూడబ్ల్యూజే) శనివారం వి జ్ఞప్తి చేశాయి. సీఎం అధికారిక విలేకరుల సమావేశాలకు అనుమతించేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని ప్రెస్‌కౌన్సిల్ చైర్మన్ జస్టిస్ మా ర్గండేయ కట్జూను కోరాయి. రాష్ట్ర సీఎం నిర్వహించే విలేకరుల సమావేశాలకు ఈ మీడి యాసంస్థలను అనుమతించకపోవడం ప్రభుత్వ నిబంధనలను ఉల్లఘించడమే అవుతుందని ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శు లు డి. సోమసుందర్, ఐవీ సుబ్బారావు, టీయూడబ్ల్యూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్. శేఖర్, విరాహత్ అలీ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండి యా సభ్యులు అమరనాథ్ చెప్పారు. ఈ నాలు గు మీడియా సంస్థల పట్ల అనుసరిస్తున్న వివక్ష రాజ్యాంగం కల్పిస్తున్న పత్రిక, మీడియా స్వేచ్ఛ ను ఉల్లఘించడమే అవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పాఠకులపరంగా సాక్షి దినపత్రిక రెండో స్థానంలో ఉందని, తెలంగాణలో నమస్తే తెలంగాణ ముఖ్యమైన పత్రికల్లో ఒకటని గుర్తుచేశారు. వీటిపై ఆంక్షలు విధించడమంటే ప్రభుత్వ సమాచారం ప్రజలకు తెలియకుండా అడ్డుకోవడం కిందకే వస్తుందని పేర్కొన్నారు. టీడీపీ అధ్యక్షుడుగా చంద్రబాబు గతం లో తన విలేకరుల సమావేశాలకు అనుమతించకపోవడంపై సాక్షి యజమాన్యం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఇప్పటికే ఫిర్యాదు చేసిందని, అది పెండింగ్‌లో ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నాలుగు మీడియా సంస్థలపై విధించిన ఆంక్షలను వెంటనే ఎత్తివేసి, ఆయా సంస్థల విలేకరులను సమావేశాల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. -
బీజేపీలో చేరిన 'నమస్తే తెలంగాణ' ఛైర్మన్
-
బీజేపీలో చేరిన 'నమస్తే తెలంగాణ' ఛైర్మన్
నమస్తే తెలంగాణ పత్రిక ఛైర్మన్ సి. లక్ష్మీరాజం భారతీయ జనతా పార్టీలో చేరారు. పార్టీ జాతీయ నేత, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో న్యూఢిల్లీలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్ఫూర్తితోనే తాను బీజేపీలో చేరినట్లు లక్ష్మీ రాజం తెలిపారు. బీజేపీ ద్వారా తాను దేశానికి సేవ చేస్తానని చెప్పారు. నమస్తే తెలంగాణ ప్రజలందరి పత్రిక అని, బీజేపీలో చేరడం మాత్రం తన వ్యక్తిగత విషయమని ఆయన అన్నారు. కాగా, త్వరలోనే నమస్తే తెలంగాణ పత్రిక పగ్గాలు చేతులు మారుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన బీజేపీలో చేరారా.. మరేదైనా కారణం ఉందా అన్న విషయం మాత్రం తెలియలేదు.