బీజేపీలో చేరిన 'నమస్తే తెలంగాణ' ఛైర్మన్ | Namaste telangana chairman rajam joins bjp | Sakshi
Sakshi News home page

బీజేపీలో చేరిన 'నమస్తే తెలంగాణ' ఛైర్మన్

Published Thu, Jun 5 2014 10:40 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

బీజేపీలో చేరిన 'నమస్తే తెలంగాణ' ఛైర్మన్ - Sakshi

బీజేపీలో చేరిన 'నమస్తే తెలంగాణ' ఛైర్మన్

నమస్తే తెలంగాణ పత్రిక ఛైర్మన్ సి. లక్ష్మీరాజం భారతీయ జనతా పార్టీలో చేరారు. పార్టీ జాతీయ నేత, కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో న్యూఢిల్లీలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్ఫూర్తితోనే తాను బీజేపీలో చేరినట్లు లక్ష్మీ రాజం తెలిపారు. బీజేపీ ద్వారా తాను దేశానికి సేవ చేస్తానని చెప్పారు. నమస్తే తెలంగాణ ప్రజలందరి పత్రిక అని, బీజేపీలో చేరడం మాత్రం తన వ్యక్తిగత విషయమని ఆయన అన్నారు. కాగా, త్వరలోనే నమస్తే తెలంగాణ పత్రిక పగ్గాలు చేతులు మారుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన బీజేపీలో చేరారా.. మరేదైనా కారణం ఉందా అన్న విషయం మాత్రం తెలియలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement