రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలి:బీజేపీ | trs should clear on waiver of farmer loans, demands BJP | Sakshi
Sakshi News home page

రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలి:బీజేపీ

Published Sun, Jun 8 2014 7:57 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలి:బీజేపీ - Sakshi

రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలి:బీజేపీ

హైదరాబాద్:తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు(కేసీఆర్) ఎన్నికల ముందు ఇచ్చిన రైతుల రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేసింది. రైతుల రుణమాఫీపై ఈ సమావేశాల్లోనే టీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన వైఖరి తెలపాలని బీజేపీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. రుణమాఫీ అంశానికి సంబంధించి కేసీఆర్ వెంటనే తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. లేకపోతే ఈ సమావేశాల్లోనే టీఆర్ఎస్ ను నిలదీస్తామన్నారు. ప్రభుత్వ అమలు చేసే హామీలపై తమ పార్టీ తప్పకుండా సహకరిస్తుందని ఒక  ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

 

రుణమాఫీపై మాట తప్పితే మాత్రం ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామన్నారు. సోమవారం ఉదయం సర్దార్ పటేల్, అమర వీరుల స్థూపాలకు నివాళులు అర్పించిన అనంతరం బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టనున్నట్లు లక్ష్మణ్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement