హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు అధికారికంగా నిర్వహించిన మీడియా సమావేశాలకు సాక్షి, నమస్తే తెలంగాణ విలేకరులను అనుమతించకపోవడంపై విచారణ జరిపేందుకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ అక్టోబర్ రెండో వారంలో హైదరాబాద్‌కు రానుంది. ఈ విషయాన్ని పీసీఐ సభ్యు డు కె.అమర్‌నాథ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ నెల 30న కమిటీ హైదరాబాద్‌లో పర్యటించాలని భావించినా వరుస సెలవుల నేపథ్యంలో పర్యటనను వచ్చే నెల రెండో వారానికి మార్చుకున్నట్లు ఆయన వివరించారు. ఏపీ సీఎం మీడియా సమావేశాలకు సాక్షి, నమస్తే తెలంగాణ పత్రికలు, సాక్షి, టీ న్యూస్ టీవీల ప్రతినిధులకు ప్రవేశం నిరాకరించిన అంశంపై విచారణ చేపట్టడానికి రాజీవ్ రంజన్‌నాగ్, కె.అమర్‌నాథ్, ప్రజ్ఞానంద చౌధురితో త్రిసభ్య కమిటీని పీసీఐ ఏర్పాటు చేయడం తెలిసిందే.
హైదరాబాద్‌కు అక్టోబర్‌లో ప్రెస్ కౌన్సిల్ కమిటీ
Published Mon, Sep 29 2014 1:14 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM
Advertisement
Advertisement