K. Amarnath
-
ప్రెస్ కౌన్సిల్ సభ్యుడిగా అమర్నాథ్ కొనసాగింపు
హైదరాబాద్: ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) సభ్యుడిగా సీనియర్ జర్నలిస్టు, ఐజేయూ నేత కె.అమర్నాథ్ మరో మూడేళ్లపాటు కొనసాగనున్నారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అమర్నాథ్ను పీసీఐ సభ్యుడిగా మరోసారి నియమించింది. పీసీఐ ప్రతినిధిగా హైకోర్టు సీనియర్ న్యాయవాది ఎన్.రామచంద్రరావు సేవలను సైతం మరో మూడేళ్ల వరకు పొడిగించింది. కాగా, కె.అమర్నాథ్కు ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవుపల్లి అమర్, టీయూడబ్ల్యూజే అధ్యక్ష కార్యదర్శులు ఎన్.శేఖర్, విరాహత్ అలీ, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్ష కార్యదర్శులు డి.సోమసుందర్, ఐవీ సుబ్బారావు శుభాకాంక్షలు తెలిపారు. -
హైదరాబాద్కు అక్టోబర్లో ప్రెస్ కౌన్సిల్ కమిటీ
హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు అధికారికంగా నిర్వహించిన మీడియా సమావేశాలకు సాక్షి, నమస్తే తెలంగాణ విలేకరులను అనుమతించకపోవడంపై విచారణ జరిపేందుకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ అక్టోబర్ రెండో వారంలో హైదరాబాద్కు రానుంది. ఈ విషయాన్ని పీసీఐ సభ్యు డు కె.అమర్నాథ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30న కమిటీ హైదరాబాద్లో పర్యటించాలని భావించినా వరుస సెలవుల నేపథ్యంలో పర్యటనను వచ్చే నెల రెండో వారానికి మార్చుకున్నట్లు ఆయన వివరించారు. ఏపీ సీఎం మీడియా సమావేశాలకు సాక్షి, నమస్తే తెలంగాణ పత్రికలు, సాక్షి, టీ న్యూస్ టీవీల ప్రతినిధులకు ప్రవేశం నిరాకరించిన అంశంపై విచారణ చేపట్టడానికి రాజీవ్ రంజన్నాగ్, కె.అమర్నాథ్, ప్రజ్ఞానంద చౌధురితో త్రిసభ్య కమిటీని పీసీఐ ఏర్పాటు చేయడం తెలిసిందే.