ప్రెస్ కౌన్సిల్ సభ్యుడిగా అమర్‌నాథ్ కొనసాగింపు | As a member of the Press Council is continuing to Amarnath | Sakshi
Sakshi News home page

ప్రెస్ కౌన్సిల్ సభ్యుడిగా అమర్‌నాథ్ కొనసాగింపు

Published Wed, Oct 15 2014 1:06 AM | Last Updated on Sat, Sep 2 2017 2:50 PM

As a member of the Press Council is continuing to Amarnath

 హైదరాబాద్: ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) సభ్యుడిగా సీనియర్ జర్నలిస్టు, ఐజేయూ నేత కె.అమర్‌నాథ్ మరో మూడేళ్లపాటు కొనసాగనున్నారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అమర్‌నాథ్‌ను పీసీఐ సభ్యుడిగా మరోసారి నియమించింది. పీసీఐ ప్రతినిధిగా హైకోర్టు సీనియర్ న్యాయవాది ఎన్.రామచంద్రరావు సేవలను సైతం మరో మూడేళ్ల వరకు పొడిగించింది.

కాగా, కె.అమర్‌నాథ్‌కు ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవుపల్లి అమర్, టీయూడబ్ల్యూజే అధ్యక్ష కార్యదర్శులు ఎన్.శేఖర్, విరాహత్ అలీ, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్ష కార్యదర్శులు డి.సోమసుందర్, ఐవీ సుబ్బారావు శుభాకాంక్షలు తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement