దీపావళికి అదనపు బస్సులు | Diwali additional buses | Sakshi
Sakshi News home page

దీపావళికి అదనపు బస్సులు

Published Tue, Oct 21 2014 12:22 AM | Last Updated on Sat, Sep 2 2017 3:10 PM

దీపావళికి అదనపు బస్సులు

దీపావళికి అదనపు బస్సులు

అఫ్జల్‌గంజ్: దీపావళి పండుగ సందర్భంగా ఈ నెల 21, 22, 23 తేదీలలో 650 అదనపు బస్సులను నడపాలని నిర్ణయించినట్లు ఆర్టీసీ రంగారెడ్డి ఆర్‌ఎం సి.వినోద్ కుమార్ సోమవారం తెలిపారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, విజయవాడ, తూ.గోదావరి, ప.గోదావరి, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, వైఎస్సార్ జిల్లా, తిరుపతి, అనంతపురం తదితర ప్రాంతాలకు  అదనపు సర్వీసులు వేస్తున్నట్టు వెల్లడించారు.

21న130, 22న470, 23న50 స్పెషల్ బస్సులు నడుపనున్నట్లు తెలిపారు.  250 కిలోమీటర్లకు పైనున్న ప్రాంతాలకు టికెట్ ధరలో అదనంగా 50శాతం ఛార్జీలు వసూలు చేయనున్నట్లు తెలిపారు. ఈ బస్సులు ఎంజీబీఎస్, జేబీఎస్‌తో పాటు జంట నగరాల్లోని ప్రధాన కూడళ్లు, వివిధ ఏటీవీ ఏజెంట్ పాయింట్ల వద్ద నుంచి నడుపనున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు బస్ స్టేషన్లు, ఏవీవీ ఏజెంట్ల వద్ద ఇంటర్నెట్ ద్వారా టిక్కెట్లు రిజర్వ్ చేసుకోవచ్చన్నారు.
 
అదనపు బస్సుల వివరాలు...

ఆదిలాబాద్‌కు 21న 5, 22న 20 స్పెషల్ బస్సులు నడుపనున్నారు. నిజామాబాద్‌కు 21న 5, 22న 20, కరీంనగర్‌కు 21న 10, 22న 60, 23న 10, వరంగల్‌కు 21న 10, 22న 30, 23న 5 సర్వీసులు వేయనున్నారు. ఖమ్మంకు 21న 5, 22న 20, నల్గొండకు 21న 10, 22న 30, మహబూబ్‌నగర్‌కు 21న 10, 22న 30, 23న 20, మెదక్‌కు 21న 5, 22న 20, 23న 5 బస్సులు నడుపనున్నారు. విశాఖపట్నానికి 21న 5, 22న 5, ప.గోదావరికి 21న 5, 22న 10, విజయవాడకు 21న 10, 22న 60, గుంటూరుకు 21న 5, 22న 10, ఒంగోలుకు 21న 10, 22న 20 బస్సులు నడుస్తాయి. నెల్లూరుకు 22న 5, చిత్తూరుకు 22న 5, అనంతపురం 22న 5, కడప 22న 10, కర్నూల్ 21న 10, 22న 40, సిటీ రీజియన్ 21న 10, 22న 60 బస్సులు నడుపనున్నట్లు ఆర్‌ఎం తెలిపారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement