బిసలమానేపల్లి పంచాయతీ రాజీవ్‌కాలనీకి చెందిన వినోద్‌కుమార్ (24) మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్టు హెడ్ కానిస్టేబుల్ రామాంజినేయులు శుక్రవారం తెలిపారు.
లేపాక్షి : బిసలమానేపల్లి పంచాయతీ రాజీవ్‌కాలనీకి చెందిన వినోద్‌కుమార్ (24) మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్టు హెడ్ కానిస్టేబుల్ రామాంజినేయులు శుక్రవారం తెలిపారు. గురువారం రాత్రి వినోద్‌కుమార్ రాజీవ్‌కాలనీలోని తన పక్క ఇంట్లో దొంగతనం చేస్తున్నాడని స్థానికులు కొందరు ఆరోపించారు.
మనస్తాపానికి గురై శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంట్లో పైకప్పునకు ఉరి వేసుకున్నాడు. తల్లి ఆదిలక్ష్మఽమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.