Rajiv colony
-
యువకుడు ఆత్మహత్య
లేపాక్షి : బిసలమానేపల్లి పంచాయతీ రాజీవ్‌కాలనీకి చెందిన వినోద్‌కుమార్ (24) మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్టు హెడ్ కానిస్టేబుల్ రామాంజినేయులు శుక్రవారం తెలిపారు. గురువారం రాత్రి వినోద్‌కుమార్ రాజీవ్‌కాలనీలోని తన పక్క ఇంట్లో దొంగతనం చేస్తున్నాడని స్థానికులు కొందరు ఆరోపించారు. మనస్తాపానికి గురై శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంట్లో పైకప్పునకు ఉరి వేసుకున్నాడు. తల్లి ఆదిలక్ష్మఽమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
విద్యుదాఘాతానికి యువకుడి మృతి
గణపవరం (నాదెండ్ల): విద్యుత్ తీగలు తగిలి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన గణపవరం రాజీవ్‌గాంధీ కాలనీలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన దుర్గాప్రసాద్ అలియాస్ చరణ్ (21) నాలుగేళ్లుగా వివిధ స్పిన్నింగ్ మిల్లుల్లో రోజువారీ కూలీగా పనిచేస్తుంటాడు. నాలుగు నెలలుగా రాజీవ్‌గాంధీ కాలనీలో మరో ముగ్గురితో కలిసి రూం అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడు. మంగళవారం సాయంత్రం తన స్నేహితుడిని కలిసేందుకు అదే కాలనీలో మరో రూంకు వెళ్లాడు. రూంకు వెళ్లి డాబాపైకి ఎక్కుతున్న సమయంలో విద్యుత్ తీగలు తగిలి కిందపడ్డాడు. గతంలో అదే రూంలో ఉంటున్న యువకులకు ఇంటి యజమాని తరచూ విద్యుత్ తీగల గురించి జాగ్రత్తలు చెప్పేవాడు. అయితే చరణ్ ఈ రూమ్‌కు కొత్తకావడంతో తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో తీవ్రగాయాలైన చరణ్‌ను ఆటోలో చిలకలూరిపేటలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు, వీఆర్వోకు సమాచారం అందించారు. మృతదేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వ మార్చురీలో ఉంచారు. -
జెండా పండుగొచ్చింది!
జెండా పండుగంటే దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం, జాతీయ గీతాలాపన, మిఠాయిల పంపిణీ మాత్రమే అందరికీ తెలిసిన విషయం. ఈ పండుగొస్తే నాలుగు రోజుల పాటు తిండిగింజలు సంపాదించుకోవచ్చని ఎదురుచూసే వారు ఇప్పటికీ ఉన్నారన్న సంగతి మాత్రం అనంతపురంలోని రాజీవ్ కాలనీ వాసులను చూస్తేనే తెలుస్తుంది. రానున్న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విక్రయించేందుకు కాలనీలోని మహిళలు జెండాలను సిద్ధం చేస్తుండగా, కాలనీ వాసులు వాటిని గర్వంగా ప్రదర్శిస్తున్న దృశ్యాలివి..