గణపవరం (నాదెండ్ల): విద్యుత్ తీగలు తగిలి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన గణపవరం రాజీవ్‌గాంధీ కాలనీలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన దుర్గాప్రసాద్ అలియాస్ చరణ్ (21) నాలుగేళ్లుగా వివిధ స్పిన్నింగ్ మిల్లుల్లో రోజువారీ కూలీగా పనిచేస్తుంటాడు.
నాలుగు నెలలుగా రాజీవ్‌గాంధీ కాలనీలో మరో ముగ్గురితో కలిసి రూం అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడు. మంగళవారం సాయంత్రం తన స్నేహితుడిని కలిసేందుకు అదే కాలనీలో మరో రూంకు వెళ్లాడు. రూంకు వెళ్లి డాబాపైకి ఎక్కుతున్న సమయంలో విద్యుత్ తీగలు తగిలి కిందపడ్డాడు. గతంలో అదే రూంలో ఉంటున్న యువకులకు ఇంటి యజమాని తరచూ విద్యుత్ తీగల గురించి జాగ్రత్తలు చెప్పేవాడు.
అయితే చరణ్ ఈ రూమ్‌కు కొత్తకావడంతో తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో తీవ్రగాయాలైన చరణ్‌ను ఆటోలో చిలకలూరిపేటలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు, వీఆర్వోకు సమాచారం అందించారు. మృతదేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వ మార్చురీలో ఉంచారు.
విద్యుదాఘాతానికి యువకుడి మృతి
Published Wed, Nov 12 2014 1:31 AM | Last Updated on Sat, Sep 2 2017 4:16 PM
Advertisement
Advertisement