కార్యక్రమంలో మాట్లాడుతున్న వినోద్ కుమార్
సాక్షి, హైదరాబాద్ : అన్ని రంగాల్లో తమ జోన్‌ను నెంబర్ వన్ స్థానంలో నిలిపిన ఘనత అధికారులు, ఉద్యోగులు, వివిధ కేటగిరీల సిబ్బంది, కార్మికులదేనని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ కొనియాడారు. విధి నిర్వహణలో ఉద్యోగుల అంకితభావం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. 63వ జాతీయ రైల్వే వారోత్సవాల సందర్భంగా బుధవారం ఇక్కడ బోయిగూడలోని రైల్ కళారంగ్‌లో నిర్వ హించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
గత ఏడాది ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన రవాణా సదుపాయాన్ని కల్పించడం, సరుకు రవాణాలో 12 శాతం అదనపు ఆదాయం సాధించ డంలో దక్షిణ మధ్య రైల్వే ముందువరుసలో నిలిచిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాసిన ‘రైలు కథలు’పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం వివిధ విభాగాల్లో ఉత్తమ ఫలి తాలు సాధించినవారికి అవార్డులను అందజేశారు.
అవార్డులు ఇవే..
జనరల్ మేనేజర్ ఎఫీషియన్సీ షీల్డ్‌ను సికింద్రాబాద్ డివిజన్ సొంతం చేసుకుంది. దీనిని రైల్వే డివిజనల్ మేనేజర్ అమిత్‌వర్ధన్ అందుకున్నారు. సివిల్, ఫైనాన్షియల్ అంశాల్లో ప్రతిభ చూపిన విజయవాడ డివిజన్ కూడా అవార్డును సొంతం చేసుకుంది. 33 జోనల్ స్థాయి అవార్డులను ఆయా డిపార్ట్‌మెంట్‌లు, డివిజన్‌లకు అందజేశారు. మరో 102 మంది అధికారులు, ఉద్యోగులకు అవార్డులను ప్రదానం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment