నైపుణ్యంతో కూడిన విద్య ముఖ్యం | Vinod Kumar Attended To Edu Summit At Banjara Hills | Sakshi
Sakshi News home page

నైపుణ్యంతో కూడిన విద్య ముఖ్యం

Published Sat, Nov 16 2019 3:08 AM | Last Updated on Sat, Nov 16 2019 3:08 AM

Vinod Kumar Attended To Edu Summit At Banjara Hills - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నైపుణ్యంతో కూడిన విద్యతోనే సరికొత్త ఆవిష్కరణలు వస్తాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఈ దిశగా అధ్యాపకులు, ప్రొఫెసర్లు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని హోటల్‌ హయత్‌లో ఎడ్యు సమ్మిట్‌ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇంజనీరింగ్‌ కాలేజీల్లో స్కిల్స్‌ పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం సీఐఐ, ఉన్నత విద్యా మండలి సంయుక్తంగా కృషి చేయాలన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన గురుకులాలు గ్రామీణులకు వరంగా మారాయని, రెండేళ్లలో 500 గురుకులాలు ప్రారంభించినట్లు చెప్పారు. రాష్ట్రంలోని వర్సిటీల్లో ఖాళీగా ఉన్న 1,061 పోస్టులను సీఎం ఇటీవల భర్తీ చేస్తూ ఆదేశాలు జారీచేశారని, ఐటీ రంగంలో దేశంలోనే అగ్రభాగాన ఉండేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ పాపిరెడ్డి, వైస్‌ చైర్మన్లు రమణ, లింబాద్రి పాల్గొన్నారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement