టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ కుమార్(పాత చిత్రం)
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమస్యలను సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లారని టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ కుమార్ వెల్లడించారు. ప్రధానితో సీఎం కేసీఆర్ భేటీ ముగిసిన తర్వాత వినోద్‌కుమార్ విలేకరులతో మాట్లాడారు. కొత్త జోనల్ వ్యవస్థలను ఆమోదించాలని ప్రధాన మంత్రిని సీఎం కోరారని తెలిపారు. జోనల్ వ్యవస్థకు సంబంధించి న్యాయశాఖ, హోంశాఖ కొన్ని అభ్యంతరాలు తెలిపిందని, 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా కొత్త జోన్ ఏర్పాటు చేశామని వివరించారు. కొత్తగా 10 వేల పంచాయతీ కార్యదర్శులను నియమించాల్సి ఉందని, కొత్త జోనల్ వ్యవస్థను ఆమోదిస్తే ఈ నియామకాలు చేపట్టాలని వెల్లడించారు. 60 ఏళ్లుగా తెలంగాణ మోసపోయిందని వ్యాఖ్యానించారు.
రెండు మోడు రోజుల్లోనే రాష్ట్రపతి ఉత్తర్వులు వస్తాయని ప్రధాని హామీ ఇచ్చినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి, నిరుద్యోగులకు ఇది గొప్ప విజయమన్నారు. హైకోర్టు విభజన త్వరగా చేపట్టాలని ప్రధాన మంత్రిని కోరామని వివరించారు. వెనకబడిన జిల్లాలకు నాలుగో విడత కింద రూ.450 కోట్లు విడుదల చేయాలని కోరగా..ఈ అంశాన్ని ఆర్ధిక మంత్రితో మాట్లాడాలని ప్రధాని సూచించారని అన్నారు. ఆదివారం ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీని సీఎం కేసీఆర్ కలుస్తారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment