
నిహాల్, అశ్లేషా
కర్ణాటక రాష్ట్రంలో హళిబేడు ఆలయానికి సమీపంలో ఉన్న గిరిజన తండాలో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా నిర్మాత కేఎస్ రామారావు పర్యవేక్షణలో తెరకెక్కిన పీరియాడికల్ ఫిల్మ్ ‘శాంతల’. నిహాల్ కోదాటి, అశ్లేషా ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించగా, వినోద్ కుమార్ ఓ ప్రధాన పాత్రలో నటించారు. ఇండో అమెరికన్ ఆర్ట్స్ పతాకంపై డా. యిర్రంకి సురేష్ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 17న తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ, హిందీ, మరాఠీ భాషల్లో విడుదల కానుంది.
‘‘ఓ గిరిజన తండాలో అమాయక స్త్రీలను చెరబట్టే అరాచకానికి ఒడిగడుతున్న ఒక కామాంధుడి బారి నుండి విముక్తి ΄పొందిన ఒక యువతి కథే ‘శాంతల’ చిత్రకథ. బేలూరు, హళిబేడు జంట దేవాలయాల వద్ద అత్యంత సుందరమైన సన్నివేశాలు, పాటలను చిత్రీకరించాం. అలాగే కీలక సన్నివేశాలను కర్ణాటకలోని మారుమూల ప్రాంతాల్లో దర్శకుడు శేషు పెద్దిరెడ్డి నిర్దేశకత్వంలో కేఎస్ రామారావు షూటింగ్ కార్యక్రమాలను నిర్వహించారు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్.
Comments
Please login to add a commentAdd a comment