
తెలుగు సినిమాలు ఎప్పటికప్పుడు థియేటర్లలో రిలీజ్ అవుతూనే ఉంటాయి. కాకపోతే వీటిలో ఓటీటీ, టీవీలోకి వచ్చేవి మాత్రం చాలా తక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. కొన్నింటికి నెలలు లేదంటే ఏళ్ల తర్వాత మోక్షం దక్కుతుంది. అలా దాదాపు రెండేళ్ల తర్వాత ఓ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.
(ఇదీ చదవండి: సినిమా వివాదం.. 'సలార్' విలన్ కి నోటీసులు)
నిహాల్, ద్రిషిక చందర్ నటించిన మిస్టరీ థ్రిల్లర్ సినిమా 'ద స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫల్ గర్ల్'. 2023 మే 12న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రంలో స్టార్స్ లేకపోవడంతో ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. ఇప్పుడు దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి ఎలాంటి హడావుడి లేకుండా వచ్చేసింది. ప్రస్తుతం రూ.99కు రెంట్ విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.
'ద స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫల్ గర్ల్' విషయానికొస్తే.. ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ చరిత్ర (ద్రిషిక) కనిపించకుండా పోతుంది. దీంతో ఐపీఎస్ ఆఫీసర్ ఆదిత్య రంగంలోకి దిగుతాడు. విక్రమ్ అనే వ్యక్తిని కలుస్తాడు. ఇతడి చెప్పిన దానిబట్టి రవి (నిహాల్)తో చరిత్ర ప్రేమలో ఉందనే విషయం బయటపడుతుంది. మరి ఆదిత్య.. చరిత్ర ఆచూకీ కనుగొన్నాడా లేదా అనేది మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 18 మూవీస్)