`ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్` మూవీ రివ్యూ
టైటిల్ : ది స్టోరీ ఆఫ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్
నటీనటులు : నిహాల్ కోదాటి, దృషిక చందర్, మధు నందన్, భార్గవ్ పోలుదాస్ తదితరులు
నిర్మాతలు : ప్రసాద్ తిరువల్లూరి, పుష్యమి ధవళేశ్వరపు
దర్శకత్వం: రవి ప్రకాశ్ బోడపాటి
విడుదల తేది: మే 12, 2023
కథేంటంటే..
ప్రముఖ వాయిస్ ఆర్టిస్ట్ చరిత్ర(దృషికా చందర్)మిస్సింగ్ కేసుతో కథ ప్రారంభమవుతుంది. ఒక సెలబ్రెటీ మిస్ అవ్వడంతో ఈ వార్త రాష్ట్రంలో సంచలనంగా మారుతుంది. ఈ కేసును విచారించడం కోసం ఢిల్లీ నుంచి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆదిత్య (భార్తవ పోలుదాసు) రంగంలోకి దిగుతాడు. చరిత్ర కేసును విచారించే క్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త విక్రమ్(సమర్థ్ యుగ్)తో ఆమెకు సన్నిహిత సంబంధం ఉందని గుర్తిస్తారు. అతన్ని విచారించగా.. చరిత్ర తప్పిపోయిన రోజు తనతో కలిసి డేట్‌కి వెళ్లిన మాట నిజమేనని.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదని చెబుతాడు.
ఆ తర్వాత కేసు గురించి కొన్ని వివరాలు కావాలంటే.. పోలీసులకు టైమ్ ఇవ్వకుండా తప్పించుకుంటాడు. మరోవైపు ఇదే కేసులో చరిత్రకు క్లోజ్‌గా ఉన్న రవి(నిహాల్ కోదాటి)ని విచారిస్తారు. అతను ఒక జీవిత భీమా ఏజెంట్. చిన్నప్పటి నుంచి చరిత్రతో కలిసి ఉంటాడు. ఇద్దరు ప్రేమించుకున్నామని, గత రెండు నెలలుగా చరిత్ర తనకు దూరంగా ఉంటుందని చెబుతాడు. అసలు చరిత్ర ఎలా మిస్ అయింది? రవిని ప్రేమించిన చరిత్ర విక్రమ్‌తో ఎందుకు డేట్‌కి వెళ్లింది? ఆమె బతికే ఉందా? చనిపోయిందా? ఆమెని మిస్సింగ్ వెనుక ఉన్నదెవరు? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆదిత్య ఐపీఎస్ ఈ కేసును ఎలా విచారించాడు? ఈ నేపథ్యంలో అతనికి ఎదురైన సవాళ్లు ఏంటి? అసలు నిందితుడు ఎవరు? అనేది తెలియాలంటే ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ మూవీ చూడాల్సిందే.
ఎలా ఉందంటే...
బ్లాక్మెయిల్ మాఫియా అమ్మాయిల జీవితాలతో ఎలా ఆడుకుంటుందనేని ఈ సినిమా ద్వారా చూపించారు. ఆన్లైన్ వేదికగా అమ్మాయిలకు ఎలాంటి వేధింపులు ఎదురవుతన్నాయనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కించారు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగుంది. అయితే దానికి తెరరూపం ఇవ్వడంలో కాస్త తడబడ్డాడు. అయితే చరిత్రకు ఏమైంది? ఎవరు కిడ్నాప్ చేశారు? అసలు బతికుందా లేదా? అనే థ్రిల్లింగ్ పాయింట్స్‌ని చివరి వరకు రివీల్ చేయకుండా ప్రేక్షకుడికి క్యూరియాసిటీ కలిగించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. చరిత్ర మిస్సింగ్‌కి అసలు కారకులు ఎవరనేది రిలీల్ చేసే ట్విస్ట్ ఊహించని విధంగా మలిచాడు.
చరిత్ర మిస్సింగ్.. విచారణ కోసం స్పెషల్ టీమ్ రంగంలోకి దిగడం... రవి, చరిత్రల లవ్‌స్టోరీతో ఫస్టాఫ్ ఇంట్రెస్టింగ్ సాగుతుంది. ఇక సెకండాఫ్‌లో చరిత్ర మిస్సింగ్‌కి గల కారణాలు ఒక్కోక్కటి రివీల్ చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో కథ చాలా వరకు అక్కడక్కడే తిరిగిందనే ఫీలింగ్ కలుగుతుంది. స్లో నెరేషన్ కూడా ఇబ్బందిగా మారుతుంది. ఇన్వెస్టిగేషన్లో కొన్నిసీన్లు అనవసరం అనిపిస్తుంది. రవి, చరిత్ర లవ్ స్టోరీ, వారి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్లు కొత్తగా ఉంటాయి. యూత్‌ని బాగా ఆకట్టుకునేలా ఉంటాయి.
ఎవరెలా చేశారంటే..
రవి పాత్రకి నిహాల్ కోదాటి న్యాయం చేశాడు. పూర్ బాయ్‌గా, గొప్ప ప్రేమికుడిగా చక్కగా నటించాడు. ఇక చరిత్రగా దృషికా చందర్ అద్భుతంగా నటించింది. నిహాల్, దృషికాల కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా భార్గవ పోలుదాసుసెటిల్డ్ పెర్ఫార్మన్స్ చేశారు. ఎస్సై బాషాగా మధునందన్ కూడా డీసెంట్ పెరఫార్మన్స్ చేశారు. ఇక నెగెటివ్ షేడ్స్ ఉన్న విక్రమ్ పాత్రలో సమర్థ్ యుగ్ ఒదిగిపోయాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేర నటించారు.
ఇక సాంకేతిక విషయాలకొస్తే.. గిడియన్ కట్టా సంగీతం పర్వాలేదు. పాటలు బాగున్నాయి. కానీ బీజీఎం యావరేజ్‌గా అనిపిస్తుంది. అమర్ దీప్ గుత్తుల సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ని అందంగా చూపించారు. ఎడిటర్ ప్రవీణ్ పూడి తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని అనవసరపు సన్నివేశాలను ఉన్నాయి. వాటిని మరింత క్రిస్పీగా కట్‌గా కట్ చేస్తే బాగుండేదేమో. నిర్మాత విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి.