Shantala Movie
-
'బలగం, బేబిలాగే ఈ సినిమాను కూడా ఆదరించాలి'
నిహాల్ కోదాటి, అశ్లేషా ఠాకూర్ జంటగా నటించిన పాన్ ఇండియన్ చిత్రం ‘శాంతల’. క్రియేటివ్ కమర్షియల్ సూపర్ విజన్‌తో శేషు పెద్దిరెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. ఇండో అమెరికన్ ఆర్ట్స్ పతాకంపై ఇర్రంకి సుబ్బలక్ష్మి సమర్పణలో డా. ఇర్రంకి సురేష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో నిహాల్ మాట్లాడుతూ– ‘‘ఈ కథతో రెండున్నరేళ్లు ప్రయాణం చేశారు మా దర్శకుడు శేషు. సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ మా సినిమాకు ప్రాణం పోశారు. నటీనటులందరూ అద్భుతంగా నటించారు. ఈ సినిమాను ప్రేక్షకులు విజయవంతం చేయాలి’’ అన్నారు. ‘‘జైలర్, జవాన్, యానిమల్’ వంటి హెవీ డోస్ ఉన్న సినిమాలతో పాటు, ‘బలగం’, ‘బేబీ’ వంటి చిత్రాలనూ ప్రేక్షకులు ఆదరించారు. అలా ‘శాంతల’ సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను. నేను ‘శాంతల’ చూశాను. సినిమా బాగా వచ్చింది. పాన్ ఇండియాకు సరిపడా కంటెంట్ ఉంది కాబట్టి ఆ స్థాయిలో రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత కేఎస్ రామారావు. ‘‘సవాల్‌గా తీసుకుని ఈ సినిమాను పూర్తి చేశాం’’ అన్నారు అశ్లేషా ఠాకూర్. ‘‘మాకు సపోర్ట్‌గా నిలిచిన కేఎస్ రామారావుగారికి థ్యాంక్స్. ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు ఇర్రంకి సురేష్. చదవండి: హీరోలనే ఎక్కువ మోస్తున్నారు.. హీరోయిన్ల పరిస్థితి ఏం కావాలి? -
‘శాంతల’చూసి కన్నీళ్లు పెట్టుకున్నాను: వెంకయ్య నాయుడు
నాట్య కళ, మహిళా సాధికారికత ఇతివృత్తంగా చారిత్రక నేపథ్యంలో తెరకెక్కించిన ‘శాంతల’చిత్రం చూసి భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాను. ఇదొక గొప్ప కళాత్మక చిత్రం. కచ్చితంగా ఈ చిత్రానికి జాతీయ అవార్డు రావాలి’ అని అన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ‘ఫ్యామిలీ మాన్’ ఫేమ్ అశ్లేష ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘శాంతల’. ఇండో అమెరికన్ ఆర్ట్స్ పతాకంపై ఇర్రింకి సురేశ్ నిర్మించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శేషు దర్శకత్వం వహించారు. నిహాల్ హీరోగా నటించారు. నవంబర్ 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో ఈ చిత్రం ప్రివ్యూని హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో వేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమా అద్భుతంగా ఉందని కొనియాడు. కొత్త నటీనటులైనప్పటికీ చక్కగా నటించారు.నిర్మాణపరంగా, సాంకేతికంగా ఎంతో ఉన్నతంగా ఉంది. కెమెరా పనితనం,నేపథ్య సంగీతం, నృత్యాలు, కూర్పు అద్భుతంగా ఉన్నాయి. ఇంతటి మంచి అభిరుచితో సినిమా నిర్మించిన ప్రముఖ నిర్మాత కె ఎస్ రామారావు, దర్శకుడు శేషును అభినందిస్తున్నాను. ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను’అని వెంకయ్య నాయుడు అన్నారు. నవంబర్ 24 న తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, మరాఠీ మరియు మలయాళం భాషల్లో ఈ చిత్రం రిలీజ్ అవుతోంది. -
ఓ యువతి కథ
కర్ణాటక రాష్ట్రంలో హళిబేడు ఆలయానికి సమీపంలో ఉన్న గిరిజన తండాలో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా నిర్మాత కేఎస్ రామారావు పర్యవేక్షణలో తెరకెక్కిన పీరియాడికల్ ఫిల్మ్ ‘శాంతల’. నిహాల్ కోదాటి, అశ్లేషా ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించగా, వినోద్ కుమార్ ఓ ప్రధాన పాత్రలో నటించారు. ఇండో అమెరికన్ ఆర్ట్స్ పతాకంపై డా. యిర్రంకి సురేష్ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 17న తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ, హిందీ, మరాఠీ భాషల్లో విడుదల కానుంది. ‘‘ఓ గిరిజన తండాలో అమాయక స్త్రీలను చెరబట్టే అరాచకానికి ఒడిగడుతున్న ఒక కామాంధుడి బారి నుండి విముక్తి ΄పొందిన ఒక యువతి కథే ‘శాంతల’ చిత్రకథ. బేలూరు, హళిబేడు జంట దేవాలయాల వద్ద అత్యంత సుందరమైన సన్నివేశాలు, పాటలను చిత్రీకరించాం. అలాగే కీలక సన్నివేశాలను కర్ణాటకలోని మారుమూల ప్రాంతాల్లో దర్శకుడు శేషు పెద్దిరెడ్డి నిర్దేశకత్వంలో కేఎస్ రామారావు షూటింగ్ కార్యక్రమాలను నిర్వహించారు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్. -
‘శాంతల’ పాటను విడుదల చేసిన త్రివిక్రమ్
అమెజాన్ వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్'లో హీరో కుమార్తెగా నటించిన అశ్లేషా ఠాకూర్ టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘శాంతల’. త్రివిక్రమ్ శేషు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నీహల్ హీరోగా నటించాడు. డాక్టర్ ఇర్రంకి సురేష్ నిర్మించిన ఈ చిత్రం నుంచి మొదటి పాటను తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడుతూ మా శాంతల చిత్రం లోని మొదటి పాటని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు విడుదల చేయటం చాలా సంతోషంగా ఉంది. వారికీ మా కృతఙ్ఞతలు. హాలిబేడు, బేలూరులలో జరిగిన ఒక యదార్ధ కథ ఆధారంగా శాంతల చిత్రం చిత్రికరించం. నవంబర్ 3వ తారీఖున విడుదల అవుతుంది’ అని తెలిపారు. ‘సీతారామం’ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.