'బలగం, బేబిలాగే ఈ సినిమాను కూడా ఆదరించాలి' | Ashlesha Thakurs Shantala Movie Release On December 15th 2023 | Sakshi
Sakshi News home page

Shantala Movie: రెండేళ్ల కష్టం.. శాంతల రిలీజ్‌కు రంగం సిద్ధం

Published Wed, Dec 13 2023 10:25 AM | Last Updated on Wed, Dec 13 2023 10:25 AM

Ashlesha Thakurs Shantala Movie Release On December 15th 2023 - Sakshi

నిహాల్‌ కోదాటి, అశ్లేషా ఠాకూర్‌ జంటగా నటించిన పాన్‌ ఇండియన్‌ చిత్రం ‘శాంతల’. క్రియేటివ్‌ కమర్షియల్‌ సూపర్‌ విజన్‌తో శేషు పెద్దిరెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. ఇండో అమెరికన్‌ ఆర్ట్స్‌ పతాకంపై ఇర్రంకి సుబ్బలక్ష్మి సమర్పణలో డా. ఇర్రంకి సురేష్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో నిహాల్‌ మాట్లాడుతూ– ‘‘ఈ కథతో రెండున్నరేళ్లు ప్రయాణం చేశారు మా దర్శకుడు శేషు. సంగీత దర్శకుడు విశాల్‌ చంద్రశేఖర్‌ మా సినిమాకు ప్రాణం పోశారు. నటీనటులందరూ అద్భుతంగా నటించారు. ఈ సినిమాను ప్రేక్షకులు విజయవంతం చేయాలి’’ అన్నారు.

‘‘జైలర్, జవాన్, యానిమల్‌’ వంటి హెవీ డోస్‌ ఉన్న సినిమాలతో పాటు, ‘బలగం’, ‘బేబీ’ వంటి చిత్రాలనూ ప్రేక్షకులు ఆదరించారు. అలా ‘శాంతల’ సినిమాను కూడా ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను. నేను ‘శాంతల’ చూశాను. సినిమా బాగా వచ్చింది. పాన్‌ ఇండియాకు సరిపడా కంటెంట్‌ ఉంది కాబట్టి ఆ స్థాయిలో రిలీజ్‌ చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత కేఎస్‌ రామారావు. ‘‘సవాల్‌గా తీసుకుని ఈ సినిమాను పూర్తి చేశాం’’ అన్నారు అశ్లేషా ఠాకూర్‌. ‘‘మాకు సపోర్ట్‌గా నిలిచిన కేఎస్‌ రామారావుగారికి థ్యాంక్స్‌. ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు ఇర్రంకి సురేష్‌.

చదవండి: హీరోలనే ఎక్కువ మోస్తున్నారు.. హీరోయిన్ల పరిస్థితి ఏం కావాలి?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement