
నాట్య కళ, మహిళా సాధికారికత ఇతివృత్తంగా చారిత్రక నేపథ్యంలో తెరకెక్కించిన ‘శాంతల’చిత్రం చూసి భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాను. ఇదొక గొప్ప కళాత్మక చిత్రం. కచ్చితంగా ఈ చిత్రానికి జాతీయ అవార్డు రావాలి’ అని అన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ‘ఫ్యామిలీ మాన్’ ఫేమ్ అశ్లేష ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘శాంతల’. ఇండో అమెరికన్ ఆర్ట్స్ పతాకంపై ఇర్రింకి సురేశ్ నిర్మించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శేషు దర్శకత్వం వహించారు. నిహాల్ హీరోగా నటించారు. నవంబర్ 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ నేపథ్యంలో తాజాగా హీరో ఈ చిత్రం ప్రివ్యూని హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో వేశారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ చిత్రాన్ని వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమా అద్భుతంగా ఉందని కొనియాడు. కొత్త నటీనటులైనప్పటికీ చక్కగా నటించారు.నిర్మాణపరంగా, సాంకేతికంగా ఎంతో ఉన్నతంగా ఉంది. కెమెరా పనితనం,నేపథ్య సంగీతం, నృత్యాలు, కూర్పు అద్భుతంగా ఉన్నాయి. ఇంతటి మంచి అభిరుచితో సినిమా నిర్మించిన ప్రముఖ నిర్మాత కె ఎస్ రామారావు, దర్శకుడు శేషును అభినందిస్తున్నాను. ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను’అని వెంకయ్య నాయుడు అన్నారు. నవంబర్ 24 న తెలుగు, హిందీ, కన్నడ, తమిళం, మరాఠీ మరియు మలయాళం భాషల్లో ఈ చిత్రం రిలీజ్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment