అమెజాన్ వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్'లో హీరో కుమార్తెగా నటించిన అశ్లేషా ఠాకూర్ టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘శాంతల’. త్రివిక్రమ్ శేషు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నీహల్ హీరోగా నటించాడు. డాక్టర్ ఇర్రంకి సురేష్ నిర్మించిన ఈ చిత్రం నుంచి మొదటి పాటను తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడుతూ మా శాంతల చిత్రం లోని మొదటి పాటని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు విడుదల చేయటం చాలా సంతోషంగా ఉంది. వారికీ మా కృతఙ్ఞతలు. హాలిబేడు, బేలూరులలో జరిగిన ఒక యదార్ధ కథ ఆధారంగా శాంతల చిత్రం చిత్రికరించం. నవంబర్ 3వ తారీఖున విడుదల అవుతుంది’ అని తెలిపారు. ‘సీతారామం’ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.
Comments
Please login to add a commentAdd a comment