Ashlesha Thakur
-
ఓ యువతి కథ
కర్ణాటక రాష్ట్రంలో హళిబేడు ఆలయానికి సమీపంలో ఉన్న గిరిజన తండాలో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా నిర్మాత కేఎస్ రామారావు పర్యవేక్షణలో తెరకెక్కిన పీరియాడికల్ ఫిల్మ్ ‘శాంతల’. నిహాల్ కోదాటి, అశ్లేషా ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించగా, వినోద్ కుమార్ ఓ ప్రధాన పాత్రలో నటించారు. ఇండో అమెరికన్ ఆర్ట్స్ పతాకంపై డా. యిర్రంకి సురేష్ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 17న తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ, హిందీ, మరాఠీ భాషల్లో విడుదల కానుంది. ‘‘ఓ గిరిజన తండాలో అమాయక స్త్రీలను చెరబట్టే అరాచకానికి ఒడిగడుతున్న ఒక కామాంధుడి బారి నుండి విముక్తి ΄పొందిన ఒక యువతి కథే ‘శాంతల’ చిత్రకథ. బేలూరు, హళిబేడు జంట దేవాలయాల వద్ద అత్యంత సుందరమైన సన్నివేశాలు, పాటలను చిత్రీకరించాం. అలాగే కీలక సన్నివేశాలను కర్ణాటకలోని మారుమూల ప్రాంతాల్లో దర్శకుడు శేషు పెద్దిరెడ్డి నిర్దేశకత్వంలో కేఎస్ రామారావు షూటింగ్ కార్యక్రమాలను నిర్వహించారు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్. -
‘శాంతల’ పాటను విడుదల చేసిన త్రివిక్రమ్
అమెజాన్ వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్'లో హీరో కుమార్తెగా నటించిన అశ్లేషా ఠాకూర్ టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘శాంతల’. త్రివిక్రమ్ శేషు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నీహల్ హీరోగా నటించాడు. డాక్టర్ ఇర్రంకి సురేష్ నిర్మించిన ఈ చిత్రం నుంచి మొదటి పాటను తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడుతూ మా శాంతల చిత్రం లోని మొదటి పాటని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు విడుదల చేయటం చాలా సంతోషంగా ఉంది. వారికీ మా కృతఙ్ఞతలు. హాలిబేడు, బేలూరులలో జరిగిన ఒక యదార్ధ కథ ఆధారంగా శాంతల చిత్రం చిత్రికరించం. నవంబర్ 3వ తారీఖున విడుదల అవుతుంది’ అని తెలిపారు. ‘సీతారామం’ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.