
సాక్షి, హైదరాబాద్: రిమోట్ ఓటింగ్ విధానాన్ని బీఆర్‌ఎస్ పార్టీ వ్యతి రేకిస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బి.వినోద్‌కుమార్ తెలిపారు. ఢిల్లీలో రిమోట్ ఓటింగ్‌పై ఎన్నికల కమిషన్ నిర్వహించిన సమావేశానికి గైర్హాజరైన నేపథ్యంలో బీఆర్‌ఎస్ తరపున వినోద్‌కుమార్ స్పందించారు.
రిమోట్ విధానంపై పార్టీ నేతలతో చర్చించి ఈనెల 30 లోగా ఎన్నికల కమిషన్‌కు లిఖిత పూర్వకంగా బీఆర్‌ఎస్ అభి ప్రాయాన్ని తెలియజేయనున్నట్లు పేర్కొన్నారు. కాగా రిమోట్ విధా నం దేశానికి అవసరం లేదని, అభి వృద్ధి చెందిన దేశాలే ఈ పద్ధతిని పక్కన పెడుతున్నాయని అన్నారు. ఇప్పుడున్న ఈవీఎంలనే హ్యాక్ చేస్తున్నారనే ప్రచారాలు ఉన్నాయ ని, వాటినే ఈసీ ఇప్ప టివరకు నివృత్తి చేయలేదన్నారు. ఈ పరిస్థితుల్లో రిమోట్ ఓటింగ్ యంత్రాలను ఎలా విశ్వసిస్తామని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment