
సాక్షి, కరీంనగర్ : తాను భారీ మెజార్టీతో గెలవబోతున్నానని టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ ఆశాభావం వ్యక్తం చేశారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని జోస్యం చెప్పారు. కరీంనగర్ లోక్‌సభ ఎన్నికల్లో 68.8 శాతం పోలింగ్ నమోదు కావడం సంతోషమన్నారు.
మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. కేంద్రంలో ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వంలో కేసీఆర్ కీలకపాత్ర పోషిస్తారని అన్నారు. ఎంపీగా వినోద్ కుమార్ గెలిస్తే.. కేంద్రమంత్రి అవుతారని తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో టిఆర్ఎస్ భారీ మెజార్టీ వస్తుందన్నారు. అన్ని కుల సంఘాలు, కరీంనగర్ ప్రజలు ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకున్నారని, వారి నమ్మకాన్ని వమ్ముచేయమని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment