ఎన్‌కౌంటర్ల పేరిట మారణకాండ
ఎన్‌కౌంటర్ల పేరిట మారణకాండ
Published Fri, Nov 4 2016 10:04 PM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM
– కలెక్టరేట్ ఎదుట ప్రజాసంఘాల ధర్నా
కర్నూలు(న్యూసిటీ): బహుళ జాతి సంస్థలకు బాక్సైట్ ఖనిజ సంపదను దోచిపెట్టేందుకే ఎన్‌కౌంటర్ల పేరిట ప్రభుత్వం మారణకాండ జరుపుతోందని విప్లవ రచయితల సంఘం(విరసం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పినాకపాణి ఆరోపించారు. శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాకు సీపీఐ జిల్లా నాయకుడు రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పినాకపాణి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్–ఒడిశా సరిహద్దు(ఏఓబీ)లో నవంబర్ 23వ తేదీన జరిగిన ఎన్‌కౌంటర్ బూటకమన్నారు. ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లాబకాష్ , విరసం రాష్ట్ర నాయకుడు అరుణ్ మాట్లాడుతూ.. ఎన్‌కౌంటర్ల పేరుతో హత్య చేయడం రాజ్యాంగం ప్రకారం నేరమని కోర్టులు చాలా సందర్భాల్లో పేర్కొన్నాయన్నారు. ప్రజా అభ్యుదయ సంస్థ జిల్లా కార్యదర్శి భార్గవ్‌కుమార్ , సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టి.షడ్రక్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జేమ్స్, పౌర హక్కుల సంఘం జిల్లా నాయకుడు రత్నం ఏసేపు, జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లాబకాష్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకుడు శేషఫణి తదితరులు పాల్గొన్నారు.
Advertisement