సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌తో చర్చలకు సిద్దమన్న పాకిస్తాన్‌కు భారత ప్రభుత్వం షాకిచ్చింది. భారత్–పాక్ మధ్య ద్వైపాక్షిక చర్చలను మళ్లీ ప్రారంభించాల్సిందిగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాసిన లేఖను భారత్ తిరస్కరించింది. కశ్మీర్ సరిహద్దుల్లో ఓ బీఎస్‌ఎఫ్ జవాన్, ముగ్గురు ఎస్పీవోలను పాక్ దారుణ హత్య చేసిన నేపథ్యంలో భారత్ ఈ చర్చలను రద్దు చేసుకుంది. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పే ప్రక్రియలో భాగంగా.. ఈ నెలలో న్యూయార్క్‌లో జరగనున్న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశానికి హాజరయ్యే భారత్, పాక్ విదేశాంగ మంత్రులు భేటీ కావాలని ఇమ్రాన్ ఇటీవల రాసిన లేఖలో ప్రతిపాదించిన విషయం తెలిసిందే.
ఓ వైపు చర్చలకు సిద్దమంటూనే సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాక్‌తో చర్చలకు భారత ప్రభుత్వం ససేమిరా అంటో్ంది. బుధవారం రామ్‌గడ్ సెక్టారులో ఓ బీఎస్‌ఎఫ్ జవాన్‌ను తూటలు దింపు, గొంతుకోసి అత్యంత దారుణంగా హత్యచేసిన ఘటన మరువకముందే గురువారం ముగ్గురు ఎస్వీవోలను పాకిస్తాన్ కిరాతకంగా హత్యచేసింది. ఈ నేపథ్యంలో పాక్‌తో్ శాంతి చర్చలకు ఒప్పుకునేదిలేదని.. ప్రభుత్వం ప్రకటించింది. కాగా సరిహద్దులో పాక్ చర్యలకు తూటలతోనే సమాధానం చెప్తుతామని ఇటీవల భారత సైన్యం ప్రకటించిన విషయం విధితమే. పాకిస్తాన్ నూతన ఇటీవల ఎన్నికైక ఇమ్రాన్ ఖాన్‌కు అభినందనలు తెలుపుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ ఇదివరకే లేఖ రాశారు.
దక్షిణాసియాను ఉగ్రవాద రహితంగా మార్చేందుకు ముందుకు రావాలని ఆనాటి లేఖలో మోదీ అన్నారు. దీనిపై ఇమ్రాన్ స్పందిస్తూ.. ద్వైపాక్షిక బంధాలపై మూడుసార్లు సానుకూల ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో భారత్‌తో చర్చలకు సిద్దమంటూ ఈ నెల 14న మోదీకి ఇమ్రాన్ లేఖ రాశారు. సరిహద్దులో పాక్ వైఖరిపై భారత సైన్యం హై అలర్ట్ ప్రకటించింది. కాగా భారత్, పాకిస్తాన్ విదేశాంగ మంత్రుల మధ్య సమావేశం 2015లో చివరి సారిగా జరిగింది. ఆ తరువాత 2016 పఠాన్‌కోట వైమానిక కోటపై పాక్ భారీ దాడికి పాల్పడడంతో ద్వైపాక్షిక చర్చలను నిలిపివేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఇంతవరకూ చర్చలు జరగలేదు.
అమెరికా ఆహ్వానం...
పాక్, భారత్ విదేశాంగ ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతాయన్న వార్తలపై అగ్రరాజ్యం అమెరికా హర్షం వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్, పాక్ మధ్య ద్వైపాక్షిక చర్చలు చాలా ముఖ్యమని గురువారం వైట్‌హౌస్ వ్యాఖ్యానించింది. భవిషత్తులో భారత్, పాక్ మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావాలని అకాక్షిస్తున్నట్లు అమెరికా విదేశాంగ ఓ ప్రకటలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment