Kashmir border
-
సరిహద్దులో 230 మంది ఉగ్రవాదులు
న్యూఢిల్లీ: భారత జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకశ్మీర్‌లో విధ్వంసం సృష్టించేందుకు పాకిస్తాన్ కుట్ర పన్నుతోందని తెలిపారు. ఇందులోభాగంగా సరిహద్దులో 230 మంది ఉగ్రవాదులను పాక్ సిద్ధం చేసిందనీ, వీరిలో కొందరు ఇప్పటికే కశ్మీర్లోకి ప్రవేశించి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. కశ్మీర్లో పరిస్థితులు సాధారణ స్థితికి రావడం, లోయ నుంచి రోజుకు 750 ట్రక్కుల ఆపిల్స్ ఎగుమతి కావడంపై పాక్ లోని ఉగ్రమూకలు రగిలిపోతున్నారని దోవల్ వెల్లడించారు. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీరీ యువతకు గొప్ప భవిష్యత్, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. కశ్మీర్లో ఉగ్రవాదాన్ని ఎగదోయడమే పాక్ వద్దున్న ఏకైక అస్త్రమని విమర్శించారు. ఢిల్లీలో శనివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన దోవల్.. పాక్ వ్యవహారశైలిపై తీవ్రంగా మండిపడ్డారు. టవర్లు ఏర్పాటుచేసిన పాక్.. కశ్మీర్ వద్ద సరిహద్దులో 20 కి.మీ విస్తీర్ణంలో పాక్ ప్రత్యేకంగా కమ్యూనికేషన్ టవర్లను ఏర్పాటు చేసిందని ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ తెలిపారు. ‘‘ఈ టవర్ల సాయంతో కశ్మీర్‌లోని ఉగ్రవాదులతో పాక్‌లోని వారి హ్యాండ్లర్లు సంప్రదింపులు జరుపుతున్నారు. వీరి సంభాషణల్ని మన నిపుణులు గుర్తించారు. ఈ సందర్భంగా పాకిస్తానీ హ్యాండ్లర్ మండిపడుతూ..‘అసలు అన్ని ఆపిల్ ట్రక్కులు రాకపోకలు ఎలా సాగిస్తున్నాయ్? వాటిని మీరు ఆపలేరా? చేతకాకుంటే ఒప్పుకోండి. మీకు తుపాకులకు బదులుగా గాజులు పంపుతాం’ అని రెచ్చగొట్టేలా పంజాబీలో పాక్ యాసలో మాట్లాడాడు. ఇది జరిగిన తర్వాత ఇద్దరు ఉగ్రవాదులు గత శుక్రవారం సోపోర్‌లోని దంగపురా ప్రాంతంలో ప్రముఖ ఆపిల్ వ్యాపారి హమీదుల్లా రాథర్ ఇంటికెళ్లారు. హమీదుల్లా నమాజ్‌కు వెళ్లడంతో ఆగ్రహంతో ఆయన కుటుంబసభ్యులపై పిస్టళ్లతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో హమీదుల్లా కుమారుడు ఇర్షాద్(25), రెండున్నరేళ్ల మనవరాలు అస్మాలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో చిన్నారి అస్మా ఆరోగ్యం విషమంగా ఉండటంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించాం’’ అని దోవల్ వెల్లడించారు. ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దుచేయడాన్ని మెజారిటీ కశ్మీరీలు మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 ప్రత్యేక హక్కు ఎంతమాత్రం కాదనీ, అతి ప్రత్యేకమైన వివక్షని వ్యాఖ్యానించారు. కశ్మీర్లో ప్రస్తుతం 10 పోలీస్స్టేషన్ల పరిధిలోనే నిషేధాజ్ఞలు అమలవుతున్నాయనీ, ఉగ్రవాదులు సంప్రదింపులు జరపకుండా ఉండేందుకే ఇంటర్నెట్, ఇతర కమ్యూనికేషన్ వ్యవస్థలను స్తంభింపజేశామన్నారు. -
ఇంత అహంకారమా?: భారత్‌పై ఇమ్రాన్ ధ్వజం
కరాచీ : భారత్‌తో శాంతి చర్చలకు సిద్దమన్న తమ ప్రతిపాదనను తిరస్కరించడం నిరాశకు గురిచేసిందని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తెలిపారు. భారత్–పాక్ మధ్య ద్వైపాక్షిక చర్చలను పునరుద్దరించాల్సిందిగా ఇమ్రాన్ ఖాన్ రాసిన లేఖను భారత్ తిరస్కరించిన విషయం తెలిసిందే. దీనిపై భారత ప్రభుత్వాన్ని తప్పుబడుతూ ఇమ్రాన్ ఖాన్ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘శాంతి కోసం చర్చలకు రావాలని నేను రాసిన లేఖకు భారత్ నుంచి అహంకారపూరిత ప్రతికూల స్పందన రావడం నిరాశ కలిగించింది. ఉన్నత పదవులు చేపట్టిన తక్కువ స్థాయి వ్యక్తులను నేను చాలామందిని చూశాను. విశాల ప్రపంచాన్ని చూడగల దార్శనికత వారికి ఉండదు.’ అని భారత ప్రధాని నరేంద్ర మోదీని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఇమ్రాన్ ట్వీట్ చేశారు. Disappointed at the arrogant & negative response by India to my call for resumption of the peace dialogue. However, all my life I have come across small men occupying big offices who do not have the vision to see the larger picture. — Imran Khan (@ImranKhanPTI) September 22, 2018 ఇక కశ్మీర్ సరిహద్దుల్లో ఓ బీఎస్ఎఫ్ జవాన్, ముగ్గురు ఎస్పీవోలను పాక్ దారుణ హత్య చేసిన నేపథ్యంలో భారత్ ఈ చర్చలను రద్దు చేసుకుందన్న విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పే ప్రక్రియలో భాగంగా.. ఈ నెలలో న్యూయార్క్‌లో జరగనున్న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశానికి హాజరయ్యే భారత్, పాక్ విదేశాంగ మంత్రులు భేటీ కావాలని ఇమ్రాన్‌ఖాన్ ఇటీవల భారత్‌కు రాసిన లేఖలో ప్రతిపాదించారు. ఓ వైపు చర్చలకు సిద్దమంటూనే సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాక్‌తో చర్చలెలా జరపుతామని భారత ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. -
పాకిస్తాన్‌కు షాకిచ్చిన భారత్..!
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌తో చర్చలకు సిద్దమన్న పాకిస్తాన్‌కు భారత ప్రభుత్వం షాకిచ్చింది. భారత్–పాక్ మధ్య ద్వైపాక్షిక చర్చలను మళ్లీ ప్రారంభించాల్సిందిగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాసిన లేఖను భారత్ తిరస్కరించింది. కశ్మీర్ సరిహద్దుల్లో ఓ బీఎస్ఎఫ్ జవాన్, ముగ్గురు ఎస్పీవోలను పాక్ దారుణ హత్య చేసిన నేపథ్యంలో భారత్ ఈ చర్చలను రద్దు చేసుకుంది. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పే ప్రక్రియలో భాగంగా.. ఈ నెలలో న్యూయార్క్‌లో జరగనున్న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశానికి హాజరయ్యే భారత్, పాక్ విదేశాంగ మంత్రులు భేటీ కావాలని ఇమ్రాన్ ఇటీవల రాసిన లేఖలో ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఓ వైపు చర్చలకు సిద్దమంటూనే సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాక్‌తో చర్చలకు భారత ప్రభుత్వం ససేమిరా అంటో్ంది. బుధవారం రామ్‌గడ్ సెక్టారులో ఓ బీఎస్ఎఫ్ జవాన్‌ను తూటలు దింపు, గొంతుకోసి అత్యంత దారుణంగా హత్యచేసిన ఘటన మరువకముందే గురువారం ముగ్గురు ఎస్వీవోలను పాకిస్తాన్ కిరాతకంగా హత్యచేసింది. ఈ నేపథ్యంలో పాక్‌తో్ శాంతి చర్చలకు ఒప్పుకునేదిలేదని.. ప్రభుత్వం ప్రకటించింది. కాగా సరిహద్దులో పాక్ చర్యలకు తూటలతోనే సమాధానం చెప్తుతామని ఇటీవల భారత సైన్యం ప్రకటించిన విషయం విధితమే. పాకిస్తాన్ నూతన ఇటీవల ఎన్నికైక ఇమ్రాన్ ఖాన్‌కు అభినందనలు తెలుపుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ ఇదివరకే లేఖ రాశారు. దక్షిణాసియాను ఉగ్రవాద రహితంగా మార్చేందుకు ముందుకు రావాలని ఆనాటి లేఖలో మోదీ అన్నారు. దీనిపై ఇమ్రాన్ స్పందిస్తూ.. ద్వైపాక్షిక బంధాలపై మూడుసార్లు సానుకూల ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో భారత్‌తో చర్చలకు సిద్దమంటూ ఈ నెల 14న మోదీకి ఇమ్రాన్ లేఖ రాశారు. సరిహద్దులో పాక్ వైఖరిపై భారత సైన్యం హై అలర్ట్ ప్రకటించింది. కాగా భారత్, పాకిస్తాన్ విదేశాంగ మంత్రుల మధ్య సమావేశం 2015లో చివరి సారిగా జరిగింది. ఆ తరువాత 2016 పఠాన్‌కోట వైమానిక కోటపై పాక్ భారీ దాడికి పాల్పడడంతో ద్వైపాక్షిక చర్చలను నిలిపివేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఇంతవరకూ చర్చలు జరగలేదు. అమెరికా ఆహ్వానం... పాక్, భారత్ విదేశాంగ ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతాయన్న వార్తలపై అగ్రరాజ్యం అమెరికా హర్షం వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్, పాక్ మధ్య ద్వైపాక్షిక చర్చలు చాలా ముఖ్యమని గురువారం వైట్‌హౌస్ వ్యాఖ్యానించింది. భవిషత్తులో భారత్, పాక్ మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావాలని అకాక్షిస్తున్నట్లు అమెరికా విదేశాంగ ఓ ప్రకటలో తెలిపింది. -
జమ్మూలో పాక్ బలగాల దుశ్చర్య
జమ్మూ: కశ్మీర్ సరిహద్దులో పాకిస్తాన్ బలగాలు రెచ్చిపోయాయి. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న ఆర్ఎస్ పుర, బిష్నా, ఆర్నియా సెక్టార్లలోని గ్రామాలు, బోర్డర్ ఔట్‌పోస్టులపై మోర్టార్లు, బుల్లెట్ల వర్షం కురిపించాయి. ఈ కాల్పుల్లో జార్ఖండ్‌కు చెందిన బీఎస్ఎఫ్ జవాను సీతారాం ఉపాధ్యాయ, నలుగురు పౌరులు ప్రాణాలుకోల్పోయారు. 12 మంది గాయపడ్డారు. పాక్ బలగాల చర్యలను మన బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయని బీఎస్ఎఫ్ ఐజీ జమ్మూ ఫ్రాంటియర్ రామ్ అవతార్ చెప్పారు. 2011లో సీతారాం బీఎస్ఎఫ్లో చేరారు. అతనికి మూడేళ్ల కుమారుడు, ఏడాది కుమార్తె ఉన్నారని అధికారులు తెలిపారు. నేడు కశ్మీర్లో ప్రధాని మోదీ పర్యటన ప్రధాని మోదీ రెండు రోజులపాటు కశ్మీర్లో పర్యటిస్తారు. లఢఖ్, కశ్మీర్ లోయ మధ్య అన్ని కాలాల్లోనూ రాకపోకలు సాగించేందుకు వీలుగా నిర్మించనున్న ప్రతిష్టాత్మక జోజిల్లా సొరంగం పనులను ఆయన శనివారం ప్రారంభించనున్నారు. శ్రీనగర్ రింగ్‌రోడ్, జమ్మూ రింగ్‌రోడ్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. కిషన్‌గంగా పవర్ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు. -
కశ్మీర్ సరిహద్దుల్లో ఉద్రిక్తత
-
చొరబాటుకు యత్నం: ముగ్గురు తీవ్రవాదుల కాల్చివేత
జమ్మూకాశ్మీర్: దేశ సరిహద్ద ప్రాంతంలో తీవ్రవాదులు భారత్‌లో చొచ్చుకు వచ్చే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో ఆర్మీ జవాన్లు వెంటనే అప్రమత్తమయ్యారు. జవాన్లు జరిపిన కాల్పులలో ముగ్గురు తీవ్రవాదులు మృతి చెందారు. తీవ్రవాదుల మృతదేహాల వద్ద భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి ఉన్నట్లు జవాన్లు గుర్తించారు. వాటిని జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. -
మా చేతిలో కత్తులు కూడా ఉన్నాయి జాగ్రత్త!
కాశ్మీర్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తే.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని పాకిస్థాన్‌ను భారత్ గట్టిగా హెచ్చరించింది. ''మా చేతుల్లో డాలు మాత్రమే కాదు.. కత్తులు కూడా ఉన్నాయి జాగ్రత్త'' అని రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. సాహసాలు చేయాలనుకుంటే అనుభవించాల్సి వస్తుందని చెప్పారు. ప్రతిసారీ వాళ్లు దాడి చేసినప్పుడు కేవలం రక్షణాత్మక చర్యలే అవలంబించేవాళ్లమని, ఈసారి ఎదురుదాడి చేయాల్సి ఉంటుందని అన్నారు. కేవలం ఈ నెలలోనే 20 మంది భారత పౌరులు సరిహద్దు కాల్పుల్లో మరణించారు. అనేకమంది గాయపడ్డారు. ఇలాంటి పరిస్థితి ఇంతకుముందు ఎప్పుడూ లేదు. దాంతో సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సరిహద్దుల్లో శాంతి నెలకొనేందుకు ఏం కావాలన్నా చేయాలని మన సైన్యానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వేచ్ఛనిచ్చారు. కానీ మరోవైపు పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు బిలావల్ భుట్టో మాత్రం ఎగిరెగిరి పడుతూనే ఉన్నాడు. కాశ్మీర్ తమదేనని, దాన్ని భారతదేశం నుంచి లాక్కుని తీరుతామని తాజాగా మరోసారి అన్నాడు. -
భారత్ - పాక్ సరిహద్దులో కాల్పులు
-
పాక్ రాయబారికి నిరసన తెలిపిన ప్రభుత్వం
న్యూఢిల్లీ: పాక్ చర్యపై మండిపడిన ప్రభుత్వం.. భారత్‌లోని పాక్ రాయబారి మన్సూర్ అహ్మద్ ఖాన్‌ను పిలిపించి తమ నిరసనను వ్యక్తంచేసింది. సౌత్ బ్లాక్‌లోని విదేశీ వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి రుద్రేంద్ర టాండన్.. ఖాన్‌ను పిలిపించి మాట్లాడారు. ఇలాంటి ఘటనలు ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతీస్తాయని హెచ్చరించారు. కాగా దాడి నేపథ్యంలో పరిస్థితులను సమీక్షించేందుకు భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిక్రమ్ సింగ్ బుధవారం పూంచ్‌కు వెళ్లనున్నారని సైనిక వర్గాలు తెలిపాయి. అలాగే సైనిక వ్యవహారాల డీజీ లెఫ్టినెంట్ జనరల్ వినోద్భాటియా.. పాకిస్థాన్ సైనిక వ్యవహారాల డీజీతో మాట్లాడి ఘటనపై నిరసన వ్యక్తం చేస్తారని వివరించాయి. దౌత్య చర్చలపై నీలినీడలు ఈ ఏడాది జనవరిలో ఇద్దరు భారత సైనికుల్ని పాక్ సైన్యం దారుణంగా చంపిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య చర్చల ప్రక్రియ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇటీవల చర్చల పునరుద్ధరణకు పాక్ ప్రతిపాదించింది. భారత్ తన స్పందన తెలపాల్సిందిగా కోరింది. అలాగే వచ్చే నెల ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం నేపథ్యంలో భారత్, పాక్ ప్రధానులు మన్మోహన్ సింగ్, నవాజ్ షరీఫ్ న్యూయార్క్‌లో భేటీ కావాల్సి ఉంది. అయితే ఈ సమయంలో ప్రస్తుత ఘటన చర్చల పునరుద్ధరణకు ఆటంకంగా మారనుంది.