india-pakisthan
-
పాక్‌తో సరిహద్దు వాణిజ్యం రద్దు
న్యూఢిల్లీ / శ్రీనగర్: భారత్–పాకిస్తాన్ల మధ్య జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంట జరుగుతున్న వాణిజ్యాన్ని నిలిపివేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. మామిడికాయలు, ఎండు మిరప, మూలికలు, ఎండు ద్రాక్ష, ఖర్జూరం, కాలిఫోర్నియా ఆల్మండ్ సహా 21 ఉత్పత్తుల కొనుగోలు–అమ్మకాలను రద్దుచేస్తున్నట్లు వెల్లడించింది. వాణిజ్యం ముసుగులో ఉగ్రమూకలకు ఆయుధాలు, డ్రగ్స్, ధనసహాయం అందడంతో పాటు నకిలీ నోట్లు భారత్‌లోకి వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. తాజా నిర్ణయంతో 280 వ్యాపారులపై ప్రతికూల ప్రభావం పడనుంది. -
పాకిస్తాన్‌కు షాకిచ్చిన భారత్..!
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌తో చర్చలకు సిద్దమన్న పాకిస్తాన్‌కు భారత ప్రభుత్వం షాకిచ్చింది. భారత్–పాక్ మధ్య ద్వైపాక్షిక చర్చలను మళ్లీ ప్రారంభించాల్సిందిగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాసిన లేఖను భారత్ తిరస్కరించింది. కశ్మీర్ సరిహద్దుల్లో ఓ బీఎస్ఎఫ్ జవాన్, ముగ్గురు ఎస్పీవోలను పాక్ దారుణ హత్య చేసిన నేపథ్యంలో భారత్ ఈ చర్చలను రద్దు చేసుకుంది. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పే ప్రక్రియలో భాగంగా.. ఈ నెలలో న్యూయార్క్‌లో జరగనున్న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశానికి హాజరయ్యే భారత్, పాక్ విదేశాంగ మంత్రులు భేటీ కావాలని ఇమ్రాన్ ఇటీవల రాసిన లేఖలో ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఓ వైపు చర్చలకు సిద్దమంటూనే సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాక్‌తో చర్చలకు భారత ప్రభుత్వం ససేమిరా అంటో్ంది. బుధవారం రామ్‌గడ్ సెక్టారులో ఓ బీఎస్ఎఫ్ జవాన్‌ను తూటలు దింపు, గొంతుకోసి అత్యంత దారుణంగా హత్యచేసిన ఘటన మరువకముందే గురువారం ముగ్గురు ఎస్వీవోలను పాకిస్తాన్ కిరాతకంగా హత్యచేసింది. ఈ నేపథ్యంలో పాక్‌తో్ శాంతి చర్చలకు ఒప్పుకునేదిలేదని.. ప్రభుత్వం ప్రకటించింది. కాగా సరిహద్దులో పాక్ చర్యలకు తూటలతోనే సమాధానం చెప్తుతామని ఇటీవల భారత సైన్యం ప్రకటించిన విషయం విధితమే. పాకిస్తాన్ నూతన ఇటీవల ఎన్నికైక ఇమ్రాన్ ఖాన్‌కు అభినందనలు తెలుపుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ ఇదివరకే లేఖ రాశారు. దక్షిణాసియాను ఉగ్రవాద రహితంగా మార్చేందుకు ముందుకు రావాలని ఆనాటి లేఖలో మోదీ అన్నారు. దీనిపై ఇమ్రాన్ స్పందిస్తూ.. ద్వైపాక్షిక బంధాలపై మూడుసార్లు సానుకూల ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో భారత్‌తో చర్చలకు సిద్దమంటూ ఈ నెల 14న మోదీకి ఇమ్రాన్ లేఖ రాశారు. సరిహద్దులో పాక్ వైఖరిపై భారత సైన్యం హై అలర్ట్ ప్రకటించింది. కాగా భారత్, పాకిస్తాన్ విదేశాంగ మంత్రుల మధ్య సమావేశం 2015లో చివరి సారిగా జరిగింది. ఆ తరువాత 2016 పఠాన్‌కోట వైమానిక కోటపై పాక్ భారీ దాడికి పాల్పడడంతో ద్వైపాక్షిక చర్చలను నిలిపివేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఇంతవరకూ చర్చలు జరగలేదు. అమెరికా ఆహ్వానం... పాక్, భారత్ విదేశాంగ ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతాయన్న వార్తలపై అగ్రరాజ్యం అమెరికా హర్షం వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్, పాక్ మధ్య ద్వైపాక్షిక చర్చలు చాలా ముఖ్యమని గురువారం వైట్‌హౌస్ వ్యాఖ్యానించింది. భవిషత్తులో భారత్, పాక్ మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావాలని అకాక్షిస్తున్నట్లు అమెరికా విదేశాంగ ఓ ప్రకటలో తెలిపింది. -
చర్చలు మళ్లీ మొదలెడదాం..
ఇస్లామాబాద్: భారత్–పాక్ మధ్య ద్వైపాక్షిక చర్చలను మళ్లీ ప్రారంభించేందుకు సంసిద్ధత తెలుపుతూ ప్రధాని మోదీకి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లేఖ రాశారు. ద్వైపాక్షిక బంధాలకు సవాల్‌గా మారిన ఉగ్రవాదం, కశ్మీర్ సహా ఇతర కీలకమైన అంశాలపై చర్చకు సిద్ధమేనని గురువారం మోదీకి రాసిన లేఖలో ఇమ్రాన్∙పేర్కొన్నారు. సెప్టెంబర్ 14న ఇమ్రాన్ ఈ లేఖ రాసినట్లు ఇస్లామాబాద్‌లోని పాక్ విదేశాంగ కార్యాలయం పేర్కొంది. ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనే ప్రక్రియలో భాగంగా.. ఈ నెలలో న్యూయార్క్‌లో జరగనున్న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశానికి హాజరయ్యే భారత్, పాక్ విదేశాంగ మంత్రులు భేటీ కావాలని ఇమ్రాన్ ప్రతిపాదించారు. ‘భారత్–పాక్ మధ్య సంబంధాల్లో సవాళ్లున్నాయి. ఇరుదేశాల మధ్య శాంతి నెలకొనే ప్రక్రియకు ఐరాస సభలో సమావేశం ఉపయుక్తమవుతుందని భావిస్తున్నా’ అని ఇమ్రాన్ లేఖలో పేర్కొన్నారు. ‘పాక్ ప్రజలు, భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని కశ్మీర్ సహా అన్ని అంశాలను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు మేం సిద్ధం. అభిప్రాయభేదాలను రూపుమాపి పరస్పర ప్రయోజనం కలిగేలా చర్చలు జరగాలని కోరుకుంటున్నాం’ అని అన్నారు. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి.. ఇరుదేశాల సంబంధాల్లో సానుకూల మార్పులు తీసుకొచ్చేందుకు చిత్తశుద్ధితో పనిచేశారన్నారు. నిర్మాణాత్మక చర్యలకు సిద్ధమే.. ఆగస్టు 18న మోదీ ఇరుదేశాల సత్సంబంధాలను కాంక్షిస్తూ ఇమ్రాన్‌కు లేఖ రాశారు. పాక్‌తో అర్థవంతమైన, నిర్మాణాత్మక చర్చలకు సిద్ధమేనని.. దక్షిణాసియాను ఉగ్రవాద రహితంగా మార్చేందుకు ముందుకు రావాలని ఆనాటి లేఖలో మోదీ అన్నారు. పాక్ ఎన్నికల్లో గెలిచాక ద్వైపాక్షిక బంధాలపై ఇమ్రాన్ మూడుసార్లు సానుకూల ప్రకటన చేశారు. శాంతికి ముందడుగు: పీడీపీ ఇమ్రాన్ లేఖకు మోదీ సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) ఆశాభావం వ్యక్తం చేసింది. చర్చల ద్వారా భారత్–పాక్ మధ్య సత్సంబంధాలు నెలకొంటాయని పేర్కొంది. ఐరాస సభ సమావేశం సందర్భంగా ఇరుదేశాల విదేశాంగ మంత్రుల మధ్య చర్చలు జరిగితే.. శాంతి చర్చలకు ముందడుగు పడినట్లేనని వెల్లడించింది. భేటీ కానున్న విదేశాంగ మంత్రులు ఐరాస సర్వప్రతినిధి సభ సందర్భంగా న్యూయార్క్‌లో వచ్చేవారం భారత్, పాక్ విదేశాంగ మంత్రులు భేటీ కానున్నారు. 2016 పఠాన్‌కోట్ ఘటన తర్వాత ఇరుదేశాల మధ్య ఉన్నతస్థాయి సమావేశం జరగడం ఇదే తొలిసారి. మోదీకి ఇమ్రాన్ లేఖలో ప్రతిపాదించినందుకు సానుకూలంగా వీరిద్దరి భేటీ జరుగనుందని.. ఈ సమావేశం ద్వారా భారత్–పాక్ మధ్య చర్చల ప్రక్రియ ప్రారంభమైందని భావించనక్కర్లేదని విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ అన్నారు. సీమాంతర ఉగ్రవాదంపై భారత్ దృష్టికోణంలో మార్పు ఉండబోదన్నారు. పాక్ గడ్డపై ఉగ్రవాద కేంద్రాల విషయంలో పాక్‌ను నిలదీసే వైఖరినే భారత్ ప్రదర్శిస్తుందన్నారు. పాకిస్తాన్‌లోని సిక్కుల పవిత్ర స్థలం కర్తార్‌పూర్ సాహిబ్‌ను భారత సిక్కులు దర్శించుకునేందుకు అనుమతివ్వడంపైనా సుష్మాæస్వరాజ్ మాట్లాడతారని రవీశ్ చెప్పారు. -
పాక్‌పై భారత్ ఘన విజయం
► 74 పరుగులకే కుప్పకూలిన పాక్ ► 5 వికెట్లతో ఎక్తా బిష్త్ విజృంభణ డెర్బీ: మహిళా ప్రపంచ కప్‌లో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది. దీంతో చాంపియన్స్ ట్రోఫీలో భారత పురుషుల జట్టుకు ఎదురైన పరాభావానికి ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. కాగా, మహిళల ప్రపంచ కప్‌లో భారత మహిళల జట్టు హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టును మట్టికరిపించిన మిథాలీ సేన.. అదే దూకుడును కొనసాగిస్తోంది. ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 95 పరుగుల తేడాతో పాక్‌పై ఘనవిజయం సాధించింది భారత్. భారత బౌలర్లలో స్పిన్నర్ ఎక్తా బిస్త్ ఐదు వికెట్లను నేలకూల్చారు. దీంతో తోక ముడవడం దాయాది జట్టు వంతైంది. 170 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ మహిళల జట్టు ఒక్క పరుగుకే తొలి వికెట్ కోల్పోయింది. రెండో ఓవర్ నాలుగో బంతికి ఎక్తా బిస్త్ బౌలింగ్‌లో ఓపెనర్ అయేషా జఫర్ వికెట్ల ముందు దొరికిపోయింది. అక్కడి నుంచి పాక్ పతనం ప్రారంభమైంది. 38.1 ఓవర్లలో 74 పరుగులకే కుప్పకూలింది. పాకిస్తాన్ బ్యాట్స్విమెన్లలో సనామిర్ మాత్రమే ఒంటరి పోరాటం చేసింది. భారత బౌలర్లలో గోస్వామి, దీప్తీ శర్మ, జోషి, హర్మిత్ కౌర్‌లు తలో వికెట్ తీశారు. అంతకు ముందు బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 169 పరుగులు చేసింది. భారత్ మహిళల్లో పూనమ్ రౌత్ (47), దీప్తీ శర్మ(28), సుష్మా వర్మ(33) పరుగులతో రాణించారు. గత రెండు మ్యాచుల్లో అదరగొట్టిన శతక్కొట్టిన సృతి మంధన(2), కెప్టెన్ మిథాలీ రాజ్(8) అభిమానులను నిరాశపర్చారు. -
పాక్ ఎల్బీడబ్ల్యూ..విజయం దిశగా భారత్
♦ 29 పరుగులకే 6 వికెట్లు ♦ ఎక్తా బిష్త్ విజృంభణ డెర్బీ: భారత్ పాక్ మధ్య జరుగుతున్న మహిళా ప్రపంచకప్ లీగ్ మ్యాచ్‌లో భారత్ బౌలర్ ఎక్తా బిష్త్ దాటికి పాక్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. 29 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పాక్ బ్యాట్స్ఉమెన్లలో నలుగురు ఎల్బీడబ్య్లూ కావడం విశేషం. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ మహిళల జట్టు ఒక్క పరుగుకే తొలి వికెట్ కోల్పోయింది. రెండో ఓవర్ నాలుగో బంతికి ఎక్తా బిష్త్ బౌలింగ్‌లో ఓపెనర్ అయేషా జఫర్ వికెట్ల ముందు దొరికిపోయింది. ఈ వికెట్ ప్రారంభమైన పాక్ పతనం 15 ఓవర్లకు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయింది. భారత స్పిన్ బౌలర్ ఎక్తా బిష్త్ మూడు వికెట్లతో చెలరేగగా గోస్వామి, దీప్తీ శర్మ, జోషి తలో వికెట్ తీశారు. అంతకు ముందు బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 169 పరుగులు చేసింది. భారత్ మహిళల్లో పూనమ్ రౌత్ (47), దీప్తీ శర్మ(28), సుష్మా వర్మ(33) లు రాణించారు. గత రెండు మ్యాచుల్లో అదరగొట్టిన శతక వీరమణి సృతి మందన(2), కెప్టెన్ మిథాలీ రాజ్(8) తీవ్రంగా నిరాశపర్చారు. -
హార్దిక్ ఫిలాసఫీ ఇదే..
లండన్: చాంపియన్స్ట్రోఫిలో ఆదివారం పాక్‌తో జరిగిన రసవత్తర పోరులో భారత్ ఘన విజయం సాధించిన తరువాత భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తాను నమ్మిన ఫిలాసఫీని అభిమానులతో పంచుకున్నాడు. 'గతం నుంచి నేర్చుకోండి..ఈ రోజు జీవించండి.. రేపటి గురించి ఆశగా ఎదురు చూడండి.. అని లండన్‌కు శుభోదయం.. భారత్‌కు శుభ మధ్యాహ్నం.. ’అంటూ ఇన్స్ట్రాగ్రాంలో పోస్ట్ చేశాడు. పాక్ మ్యాచ్‌లో 6 బంతుల్లో 20 పరుగులు చేసి 2 వికెట్లు పడగొట్టిన పాండ్యా ఆల్‌రౌండర్‌గా తన పూర్వపు ఫామ్‌ను కొనసాగించాడు. ఇక చివరి ఓవర్లో వరుస సిక్స్‌లు బాదడంతో భారత్ మూడొందల మార్కును సునాయాసంగా చేరింది. ఐపీఎల్-10లో ముంబై ఇండియన్స్ టైటిల్ అందుకోవడంలో కూడా పాండ్యా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. Learn from yesterday Live for today Hope for tomorrow -
శాంతి, సహకారంతో సత్వరాభివృద్ధి
పాక్ ప్రధాని షరీఫ్‌కు లేఖలో భారత ప్రధాని మోడీ ద్వైపాక్షిక సంబంధాల్లో నూతనాధ్యాయం కోసం ఎదురు చూస్తున్నా ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: భారత్-పాకిస్థాన్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో నూతనాధ్యాయం కోసం ఎదురు చూస్తున్నట్లు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షించారు. ఘర్షణలు, హింసకు తావులేని వాతావరణంలో పాక్‌తో కలసి పనిచేయాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ జూన్ 2న తనకు రాసిన లేఖకు స్పందనగా మోడీ ఆయనకు ఈ మేరకు ప్రతి లేఖ రాశారు. శాంతి, స్నేహం, సహకారంతో కూడిన ద్వైపాక్షిక బంధం ఇరు దేశాల్లోని యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు ప్రజల భవిష్యత్తును ఉజ్వలంచేస్తూ ఉభయ దేశాల సత్వరాభివృద్ధికి దోహదపడుతుందని మోడీ లేఖలో వివరించారు. ‘‘మీ (షరీఫ్) ఢిల్లీ పర్యటన సందర్భంగా నాతో జరిపిన ద్వైపాక్షిక చర్చలు నాలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఘర్షణరహిత వాతావరణంలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో నూతనాధ్యాయాన్ని లిఖించేందుకు మీతో, మీ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నా’’ అంటూ మోడీ రాసిన లేఖను పాక్ ప్రభుత్వం శుక్రవారం మీడియాకు విడుదల చేసింది. తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైనందుకు షరీఫ్‌కు మోడీ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘మీతోపాటు ఇతర అతిథుల రాక ప్రమాణస్వీకార కార్యక్రమానికి మరింత వన్నె తేవడమే కాకుండా భారత ఉపఖండంలో ప్రజాస్వామ్య శక్తిని చాటే వేడుక అయ్యింది’’ అని మోడీ పేర్కొన్నారు. కాగా, కరాచీలోని విమానాశ్రయంపై ఉగ్రవాదుల దాడిని మోడీ తీవ్రంగా ఖండించారు. తన తల్లికి చీరను బహుమతిగా పంపినందుకు షరీఫ్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.