నిజామాబాద్ : పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడుతున్న విప్లవకారులను పాలకవర్గాలు పట్టుకుని కాల్చిచంపి ఎన్‌కౌంటర్ కథలల్లుతున్నాయని అమరుల, బంధుమిత్రుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పద్మకుమారి ఆరోపించారు. ఎన్‌కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆమె స్పష్టం చేశారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మావోయిస్టు నాయకురాలు లోకేటి లక్ష్మి అలియాస్ సులోచన అలియాస్ నవతక్క కుటుంబ సభ్యులను ఓదార్చడానికి వచ్చిన సంఘం నేతలు నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో విలేకరులతో మాట్లాడారు.
ఇటీవల ఎన్‌కౌంటర్ పేరుతో వివేక్, సూర్యంతోపాటు మరో ఇద్దరు మహిళలను ప్రభుత్వాలు పట్టుకుని కాల్చిచంపి ఎన్‌కౌంటర్ కథలల్లాయన్నారు. ఈ నెల 17,18 తేదీలలో హైదరాబాద్‌లో సంఘం మూడవ మహాసభలు జరిగాయని, ఈ సభలలో అమరుల త్యాగాలను స్మరించుకుంటూ ముందుకు నడవవాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఆమె వెంట సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అంజమ్మ, ఉపాధ్యక్షురాలు శాంత, రాష్ట్ర కమిటీ సభ్యులు నర్సన్న ఉన్నారు.
ఎన్‌కౌంటర్లన్నీ సర్కార్ హత్యలే
Published Wed, Jul 22 2015 8:04 PM | Last Updated on Sun, Sep 3 2017 5:58 AM
Advertisement
Advertisement