కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్లు
ఏడుగురు ఉగ్రవాదుల హతం ఒక జవాను మృతి
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లో వేరు వేరు జిల్లాల్లో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్లలో ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక సీఆర్‌పీఎఫ్ జవాను చనిపోగా, ఐదుగురు జవాన్లు గాయపడ్డారు. శ్రీనగర్‌లోని నౌహట్టాలో జమా మసీదు వద్ద భద్రతా దళాలపై ఉగ్రవాదులు దాడి జరపగా ఒక జవాను మరణించాడు. ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఎదురు కాల్పులు కొనసాగిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ దాడులపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ విచారం వ్యక్తం చేశారు.
ఐదుగురు తీవ్రవాదులు హతం...
భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడిన ఐదుగురు ఉగ్రవాదులను భారత జవాన్లు హతమార్చారు. ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా వద్ద అనుమానాస్పద కదలికల సమాచారం రాగానే బలగాలు అక్కడికి చేరుకున్నాయి. ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. ప్రమోద్ కుమార్ అనే జవానుకు మెడ భాగంలో బుల్లెట్ తగలడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. అనంతరం అతడిని ఆర్మీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.