శ్రీరాంపూర్ : నెత్తురు పారని, ఎన్‌కౌంటర్లు లేని తెలంగాణ కావాలని, తెలంగాణలో జరుగుతున్న విధ్వంసాన్ని అడుకోవాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క పేర్కొన్నారు. శ్రీరాంపూర్ కృష్ణాకాలనీలోని గౌరిసుత గణేశ్ మండలి మైదానంలో బహుజన బతుకమ్మ సంబరా లు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విమలక్క మహిళలతో కలిసి బతుకమ్మ ఆ డారు. జిల్లాలో ప్రజల జీవనంపై విధ్వంసం పెరిగిం దన్నారు.
టైగర్ జోన్ పేరిట ఆదివాసీలను అడవికి దూరం చేసి అందులోని సంపదను బహుళజాతి సం స్థలకు అప్పగించడానికి పాలక వర్గం కుట్ర చేస్తుంద ని మండిపడ్డారు. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొ గ్గు ఇక్కడ నుంచి అందిస్తున్న ఇక్కడ జల్ జంగల్ జ మీన్ కోసం పోరాడిన కొమురం భీమ్‌ను ఆదర్శంగా తీసుకొని పోరాడాలన్నారు. చాలా కాలం బతుకమ్మను దళితులకు దూరం చేశారని అందుకు బహుజన బతుకమ్మ పేరుతో బతుకమ్మను బహుజనులకు దగ్గర చేస్తున్నామన్నారు.
ఆకట్టుకున్న కళా ప్రదర్శనలు
ముందుగా బతుకమ్మలతో భారి ఊరేగింపు నిర్వహిం చారు ఒగ్గు కళాకారుడు ఐలయ్య బృందం, ధూంధాం కళాకారుడు డప్పు సమ్మయ్య బృందం డప్పు చప్పుళ్లతో బారి ఊరేగింపు జరిగింది. వేదికపై అరుణోదయ సాంస్కృతిక మండలి కళాకారులు పాడిన పాటలు డ్యాన్స్‌లు ఆకట్టుకున్నాయి. స్వరమాదురి కళానిలయం వ్యవస్థాపకులు, ధూంధాం కళాకారుడు అంతడప్పుల నాగరాజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. పెద్దయెత్తున మహిళలు బతుకమ్మ సం బరాల్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో టీసీఎఫ్ నిర్వాహకులు బైరాగి మోహన్, తిరుపతిరెడ్డి, ఏఐఎఫ్‌టీయూ డివిజన్ అధ్యక్షుడు మేకల పోశమల్లు, ప్రధాన కార్యదర్శి మల్లయ్య, పీఓడబ్ల్యూ నాయకులు కరుణ, రమా, కళాకారులు డప్పు సమ్మయ్య, రేగుం ట చంద్రశేఖర్, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు పత్తి గట్టయ్య, టీడీజీ మండల ప్రధాన కార్యదర్శి జక్కుల కుమార్, ఎంపీటీసీ ఉడుత రాజమౌళీ, ఉప సర్పంచ్ మోతె కనుకయ్య, బీజేపీ మండల నాయకులు అగల్‌డ్యూటీ రాజు, కాసెట్టి నాగేశ్వర్‌రావులు పాల్గొన్నారు.
ఎన్‌కౌంటర్లు లేని తెలంగాణకావాలి..
Published Wed, Oct 1 2014 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 PM
Advertisement
Advertisement