బద్లాపూర్‌ నిందితుడి ఎన్‌కౌంటర్‌ను సమర్థించిన సీఎం షిండే | Cm Shinde Supported Cops In Badlapur Accused Encounter Incident | Sakshi
Sakshi News home page

బద్లాపూర్‌ నిందితుడి ఎన్‌కౌంటర్‌ను సమర్థించిన సీఎం షిండే

Published Wed, Sep 25 2024 4:18 PM | Last Updated on Wed, Sep 25 2024 4:43 PM

Cm Shinde Supported Cops In Badlapur Accused Encounter Incident

ముంబయి:బద్లాపూర్‌ లైంగికదాడి కేసులో నిందితుడిని ఎన్‌కౌంటర్‌ను మహారాష్ట్ర సీఎం ఏకనాథ్‌షిండే సమర్థించారు. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ సీఎం షిండే ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.‘నిందితుడి పారిపోయేందుకు ప్రయత్నించే క్రమంలో పోలీసులపై కాల్పులు జరిపాడు. 

ఆత్మరక్షణ కోసమే పోలీసులు తిరిగి కాల్పులు జరిపారు. ఇందులో తప్పేమీ లేదు’అని ఏక్‌నాథ్‌షిండే అన్నారు.కాగా, మహారాష్ట్ర బద్లాపూర్‌లోని ఓ పాఠశాల టాయిలెట్‌లో ఇద్దరు బాలికలపై లైంగిక దాడి జరిపిన కేసులో నిందితుడు అక్షయ్‌షిండేను పోలీసులు అరెస్టు చేశారు. 

ఈ కేసు విచారణలో భాగంగా అక్షయ్‌షిండేను వాహనంలో తీసుకు వెళ్తుండగా అతడు పారిపోయేందుకు ప్రయత్నించి తమపై కాల్పులు జరిపాడని, ఇందుకు తాము తిరిగి జరిపిన కాల్పుల్లో నిందితుడు మరణించాడని పోలీసులు తెలిపారు.బద్లాపూర్‌ లైంగికదాడి కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

ఇదీ చదవండి: బద్లాపూర్‌ నిందితుడి ఎన్‌కౌంటర్‌పై పోలీసులకు హైకోర్టు ప్రశ్నలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement