విద్యుత్ డిమాండ్ ఉన్న నేపథ్యంలో కేటీపీఎస్ 6వదశలో నిలిపి వేసిన 500 మెగావాట్లను శనివారం రాష్ట్ర గ్రిడ్‌కు అనుసంధానం చేశారు...
- కేటీపీఎస్ ఆరవ దశలో ..
- ప్రస్తుతం 350 మెగావాట్లకే పరిమితం
- జెన్కోకు సుమారు
- రూ.12 కోట్ల వరకు నష్టం
పాల్వంచ : విద్యుత్ డిమాండ్ ఉన్న నేపథ్యంలో కేటీపీఎస్ 6వదశలో నిలిపి వేసిన 500 మెగావాట్లను శనివారం రాష్ట్ర గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. గత నాలుగు రోజుల క్రితం రాష్ర్ట వ్యాప్తంగా వర్షాలు పడటంతో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గింది. దీంతో విద్యుత్ ఉత్పత్తి జెన్కో లోడ్ డిస్పాచ్ అధికారుల ఆదేశాల మేరకు విరామం ఇచ్చారు.
ఈక్రమంలో ఇంజనీర్లు లైటప్‌లను పూర్తి చేశారు. తిరిగి వినియోగం పెరుగుదల చూపడంతో రాష్ట్ర గ్రిడ్‌కు 500 మెగావాట్లలో 350 మెగావాట్లను అనుసంధానించాలని ఆదేశాలు జారీఅ య్యూరుు. ఉత్పత్తిని పున :ప్రారంభించారు. అయితే నాలుగు రోజులుగా రోజుకు 12 వేల మిలియన్ యూనిట్ల చొప్పున మొత్తం 48 వేల మిలియన్ యూనిట్ల ఉత్పత్తి గండి పడటంతో జెన్కోకు రూ.12 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. మరోవైపు పీఎల్‌ఎఫ్ శాతం గ ణనీయంగా తగ్గడంతో 5 శాతం మానిటరింగ్ బెనిఫిట్స్‌లో కూడా ఉద్యోగులకు కోత విధించే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.